Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prize-for-best-comment

ఈ సంచికలో >> శీర్షికలు >>

10-11-2017 నుండి 16-11-2017 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :  ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే దిశగా అడుగులు వేస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు కాస్త శ్రమించాల్సి వస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. సంతానం నలుగురిలో మంచి పేరును సంపాదించుకొనే అవకాశం ఉంది. వాహనాల విషయంలో ఒకింత జాగ్రత్త అవసరం. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. మిత్రులతో గతంలో చేసిన పనులను తిరిగి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం మరింత శ్రద్ద అవసరం. 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకుసాగుతాయి,నూతన అవకాశాలు లభిస్తాయి.  సూచనలను పరిగణలోకి తీసుకోవడం వలన లబ్దిని పొందుతారు. సోదరులతో చేసిన చర్చలు ఒక స్థాయి వద్ద ఆగిపోయే ఆస్కారం ఉంది, పూర్తిస్థాయి లక్ష్యం నెరవేరకపోవచ్చును. అనుకోకుండా చేసే ప్రయాణాలు లబ్దిని కలుగజేస్తాయి. గతంలో తలపెట్టిన పనులను త్వరగా పూర్తిచేసేలా ప్రయత్నం చేయుట మంచిది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.  


మిథున రాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు వద్దు, చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో అనుభజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. గతంలో మొదలు పెట్టిన వ్యాపారప్రయత్నాలను పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. విదేశీప్రయాణప్రయత్నాలు చేయాలనుకొనే వారికి అనుకూలమైన సమయం. నూతన వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచనలకు రెక్కలు వస్తాయి, కాస్త ప్రయత్నం అవసరం. 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచనల కోసం నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారులతో కలిసి చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. తల్లితరుపు బంధువుల నుండి కీలకమైన విషయాలు  తెలుస్తాయి. జీవితభాగస్వామి నుండి వచ్చిన సూచనల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి,  రావడానికి ఆస్కారం కలదు. సోదరులతో చేపట్టిన చర్చలు పూర్తిస్థాయి సంతృప్తిని కలుగజేస్తాయి. పోటీపరీక్షల్లో విజయాన్ని పొందుటకు అవకాశం ఉంది, ప్రయత్నం అవసరం. 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. నూతన పనులకు అవకాశం ఉంది. పెద్దలనుండి వచ్చిన సూచనలకు ప్రాముఖ్యత ఇవ్వడం మేలు. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఊహించని విధంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. మీ మాటతీరు మూలన కొంత నస్టపోయే అవకాశం ఉంది. సంతానం విషయంలో ఒత్తిడిని కలిగి ఉంటారు. వాహనాల విషయంలో అశ్రద్ధ వద్దు. ప్రయాణాలు చేయునపుడు  తీసుకోవడం మంచిది. అవకాశం ఉంటె ప్రయాణాలు వాయిదా వేసుకోండి. 

 

 


కన్యా రాశి :ఈవారం మొత్తం మీద మొదట్లో ఉన్న ఇబ్బందులు చివరి వరకు ఉండకపోవచ్చును. చిన్న చిన్న విషయాలకే హైరానా పడే ఆస్కారం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు వారం మధ్యలో వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. స్వల్పఅనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. దూరప్రదేశంలో ఉన్న మిత్రులను కలుసుకునే అవకాశం కలదు. 

 

 


తులా రాశి : ఈవారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు, వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు దూరప్రదేశ ప్రయాణాలు వాయిదా వేయుట సూచన. అగ్నిపరమైన వస్తువులతో పనిచేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. మిత్రులనుండి ఆశించినమేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. కుటుంబపరమైన విషయాల్లో వేచిచూసే ధోరణి మంచిది. 

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను కాస్త శ్రమతో పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో సర్దుబాటువిధానం మేలుచేస్తుంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు పెద్దగా లాభించకపోవచ్చును. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకువెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. తండ్రి లేదా తండ్రి తరుపు బంధువుల ఆనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి.  

 

ధనస్సు రాశి ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాలకు సమయం ఇస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది, కాకపోతే పనిభారం తప్పకపోవచ్చును. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. నూతన పనులను చేపట్టు విషయంలో తోటివారి సహకారం పొందగలుగుతారు. మీ మాటతీరు నూతన సమస్యలకు అవకాశం ఇచ్చే ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. రావాల్సిన బాకీ వసూలు ఆయే అవకాశం ఉంది. 

 

 



మకర రాశి :  ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలకు రూపమిచ్చేలా ప్రణాళిక సిద్దంచేసుకొనే ప్రయత్నం చేస్తారు. చేపట్టిన పనులను మిత్రుల సహకారంతో పూర్తిచేస్తారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. గతంలో మీకున్న పెద్దలతో పరిచయాలు ఉపయోగపడుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త ఓపిక అవసరం. శ్రమించుట ద్వారా లబ్దిని పొందుతారు. మానసికపరమైన ఇబ్బందులు మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాలకే ఇబ్బందులు ఎదుర్కొంటారు,సర్దుబాటు అవసరం. 


కుంభ రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు, కాకపోతే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. గతంలో మీకున్న పరిచయాలు లాభిస్తాయి. వాహనాల వలన ఖర్చులు అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. సాధ్యమైనంత మేర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. వివాదాస్పదవిషయాలకు దూరంగా ఉండుట మేలు, అందరిని కలుపుకొని వెళ్ళండి. 

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. పెద్దలను కలుస్తారు, వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన మేర ఫలితాలు లభిస్తాయి. జీవితభాగస్వామి నుండి వచ్చిన సూచనలు మీకు మేలుచేస్తయి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులను కలుస్తారు. 

మరిన్ని శీర్షికలు
mulakkaada pappuchaaru