1) ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేందుకు బలమైన ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరించే ప్రమాదం ఉంటుంది....ప్రస్తుతం మనదేశంలో దాదాపు అదే జరుగుతోందని చాలామంది అభిప్రాయం.ఎంతోమంది గొప్పనాయకుల సారధ్యంలో వెలుగు వెలిగిన కాంగ్రెస్ ప్రస్తుతం సరైన నాయకత్వంలేక చతికిల పడడం ఆ పార్టీకే కాదు, ప్రజలకూ బాధ కలిగిస్తోంది...వారసత్వ భజన మాని, అపరిపక్వ రాహుల్ కి నాయకత్వ బాధ్యతలు అప్పగించే ఆలోచన ప్రస్తుతానికి మానుకొని, మంచి నాయకుడి ఎన్నుకొని,కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చే ప్రయత్నం చేయాలి..
2) పరిపక్వత అనుభవం ద్వారా అదే వస్తుంది. వారసత్వ సెంటిమెంట్ బలంగా పనిచేసే మనదేశంలో రాహుల్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఆలోచన సరైనదే... తాను నేర్చుకుంటూనే పార్టీని ముందుకు తీసుకెళ్ళగలడు రాహుల్. అనుభవజ్ఞుల అండదండలు ఎలానూ ఉండనే ఉంటాయి....వాళ్ళ సలహాలూ, సూచనలతో పార్టీకి పునర్వైభం తేగల నాయకుడు
పై రెండిట్లో ఏది కరెక్ట్?
|