Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

ఒక మెరుపు తీగ: నన్ను మించిన సౌందర్యవతి ఈ  భూలోకం లో గాని , ఏడేడు లోకాల్లో గాని లేదు!
మరోమెరుపు తీగ: డాబులు పలక్కు! నీకు మించిన అతిలోక సౌందర్యం నాకుంది!
ఒక మెరుపు తీగ:  నన్నెవరు సృష్టించారో తెల్సా? విశ్వ కర్మ!!
మరోమెరుపు తీగ: నన్నెవరు సృష్టించారో తెల్సా? బాపు!!

 

................................

 

రాయుడి పెళ్ళాం: ఏవండీ! బియ్యం, పప్పూ కొనుక్కు రమ్మంటే? రత్నాలూ, ముత్యాలూ  కొనుక్కొచ్చారేం?
రాయుడు: విజయనగర వీధుల్లో వాటినే రాసులు పోసి అమ్ముతున్నారు, పైగా చౌక కూడానూ!!
 

.................................

నక్క భార్య: ఎంతసేపూ, ఈ పీతలూ,  తొండలూ, కుందేళ్ళూ తిని మొహం మొత్తిపోయింది మావా!
నక్క మామ: సరే.. ఏం కావాలో చెప్పు తెచ్చిపెడతా!
నక్క భార్య: నక్క జొన్న కూడు కావాలి!!

  

.................................

విపరీత రాజ భక్తుడు: రాజు గారి బంగారు సిం హాసనం ఎవరో దొంగలు అపహరించారట! ఎంత అప్రదిష్ట! మనం వెంటనే నిధులు వసూలు చేసి, ఒక కొత్త బంగారు సిం హాసనాన్ని రాజు గారికి బహూకరిద్దాం!!
ఓ మోస్తరు రాజ భక్తుడు: దాదాపు ప్రతి నెలా ఇలా జరుగుతోంది! ఈ ఏడాది పదిసార్లు నిధులు వసూలు చేశాం, రాజు గారికి పది బంగారు సిం హాసనాల్ని బహూకరించాం! నాకు రాజు గారి మీద, నీ మీద అనుమానం గా వుందయ్యా!!

 

..................................

 "ఒరేయ్... మీరు సేకరించే వన ఫలాలలో సీతాఫలాలని, కొరికి రుచి చూసేరు! తోకలు కత్తిరిస్తా!"
ఒక వానరుడు: ఎవరదీ ఉరమాయించేదీ?
రెండో వానరుడు: హనుమంతుల వారు! నోరు మూసుకుని పని చూడు!!

  

.................................

గురువు: శిష్యులారా, నా వద్ద అపూర్వ మంత్ర శక్తులున్నాయి! వాటిల్లో ఒక మంత్రాన్ని స్మరించాననుకోండి, ఎదుటి వాడు భగ్గున కాలి, బూడిదై పోతాడు!
గురువు భార్య వంటింట్లోంచి : ఏవండోయ్ ఒక్కసారి ఇక్కడికి రండి... పొయ్యి రాజుకోవడం లేదు!! 

................................

యమ కింకరులు: ఏమిటయ్యా... దారి పొడుగూతా వాంతులు చేస్తున్నావూ?
నరుడు: తులసి తీర్థం బాబూ... మీరొచ్చేకాడికి, నానోట్లో ఎంతమంది పోశారో తెలుసా?? 

.................................

సాదాఖాన్: నీ దగ్గర ఇంత కొల్లగొట్టిన సొమ్ములు, దోచుకున్న ధనం వుందే? అంతా ఎక్కడిదీ? నిజం చెప్పు!!
సీదాఖాన్: ఆలీ బాబా నలభై దొంగల కథ నీకు తెల్సుగా, చివర్లో ఆ నలభై దొంగల్నీ, మరజీనా, నూనె  పీపాయిల్లో వుంచి లోయలోకి తోసేసిందిగా? ఒక దొంగ చావలేదు! తప్పించుకుపోయి, తన వృత్తి సాగించాడు! అతడి మూడో తరం మనవడ్ని నేను! ఈ సొమ్ములూ మా ముత్తాతలది!!
సాదాఖాన్: అయ్య బాబోయ్! నీకు కట్టుకథలు కూడా వచ్చన్నమాట

.................................

 

 యువరాజు: నా ప్రేమ రాజ్యానికి, నువ్వే మాహారాణివి సుందరీ! నిన్ను పెళ్ళి చేసుకోదలిచాను!
సుందరి: మీ పట్టాభిషేకం ఎప్పుడో చెప్పండీ! అది జరిగిన మరుక్షణం ఒప్పుకుంటాను!! మీ రాజ్యానికి కూడా మహారాణిని కావాలనుంది!!   


.................................

అష్ట దిక్పాలకుల్లో ఒకరు: మన మీద ఒక కన్నేసి వుంచుతారన్నావే? ఎవరాయన?
ఇంకొకరు: ఇంకెవరూ, త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ గారు. ఆయనకి నాలుగు ముఖాలు, ఎనిమిది కళ్ళు!! మనం ఎనమండుగురం కదా??     

 

మరిన్ని శీర్షికలు
uttarakhand