Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Arjuna Phalguna || Telugu Independent Film 2017 || Written and Directed by Girish Veluru

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - డా. ఎస్. జయదేవ్ బాబు

యువక మిత్రుడు: స్వయంవరం లో యువరాణి పెట్టిన పోటీల్లో ఎందుకు నెగ్గలేకపోయావ్?

యువకుడు: పోటీలో ఒక ప్రశ్న - పాక శాస్త్రం వొచ్చా అని! వొచ్చు అన్నాను ! రెండు ఆనపకాయలు, పిడికెడు పప్పు యిచ్చి కూరొండమన్నారు!

యువక మిత్రుడు: వొండావా?

యువకుడు: వొండాను! యువరాణి రుచి చూసి, "థూ" అని ఉమ్మేసింది. 

యువక మిత్రుడు: ఎందుకూ?

యువకుడు: కూరలో ఉప్పెయ్యడం మరిచాను!!   

................................

 

మహారాణి: ఆ జోష్యుడ్ని వృత్తి మానుకోమని చెప్పి, కానుకివ్వకుండా ఎందుకు తిప్పి పంపించేశారు మహారాజా?

మహారాజు: అతడు నా జాతకం చూసి, నాకు మహారాజ యోగం వుందని చెప్పాడు!!

 




 

.................................

కాలకూట సర్పము: నా విషం రుచి ఎరిగిన వారు ఎవ్వరూ లేరు! అది తాగిన వాడు మరుక్షణం చచ్చిపోతాడు కదా?

మరోసర్పము: డాబులు పలకకు! నీ విషం రుచి ఒకరికి తెలుసు?

కాలకూట సర్పము:ఎవరది?

మరోసర్పము:ప్రహ్లాదుల వారు!!     

 



 

.................................

 

రాజు: దొంగకి ఉరిశిక్ష విధించారా?

దండనాయకుడు: ఉరి తీస్తుండగా  మెడకు బిగించిన తాడు తెగిపోయింది ప్రభో! శిక్షితుడు చావలేదు!

రాజు: ఇంకో తాడుతో ఉరి తీయకపోయారా?

దండనాయకుడు: అది సిద్ధం చేసే లోగా, దొంగ పారిపోయాడు ప్రభో!

రాజు: ఒరేయ్ ఎవరక్కడ? ఆ కొత్త తాడుతో ఈ దండనాయకుడ్ని ఉరి తీయండి!  

..................................

 

 

 అమ్మవారు: భక్తా నీ భక్తికి మెచ్చి వరమివ్వదలిచాను, కోరుకో!

భక్తుడు: ఈ హుండీని, కాసులతో నింపు! ఆ ధనంతో, శిధిలమై వున్న నీ గుడిని పునర్నిర్మించి, కుంభాభిషేకం చేయిస్తా! నలుమూలల నుంచి భక్తులొచ్చి నిన్ను కొలిచేలా చేయిస్తా!!

అమ్మవారు: ఆ తర్వాత?

భక్తుడు: ఇక్కడొక పెద్ద హుండీని పెట్టి , భక్తులు, కానుకలు, కాసులూ వేసేలా చేయిస్తా! నీకు విశేషం గా , ఘనం గా పూజలు జరిపిస్తా!

అమ్మవారు: ఆ తర్వాత?

భక్తుడు:  కాలం తీరాక, నీ పాద కమలాలతో ఐక్యమై పోతా!

అమ్మవారు: ఆ కోరిక ఇప్పుడే తీరుస్తా, రా, ఐక్యమై పో!!

భక్తుడు: వొద్దమ్మా... నాకు హుండీ కాసులు లెక్కపెట్టాలని ఆశగా వుంది!!     

.................................

 

 

రాజు: చక్రవర్తి గారికి పన్ను చెల్లించారా?

మంత్రి: పన్నుకు బదులు, ఇసుక, రాళ్ళు పంపించమన్నారు. వాటితో మన రాజ్యం చుట్టూ పెద్ద కోట నిర్మిస్తారట!

రాజు: కోట నిర్మించి...?

మంత్రి:  ఆ కోటలో, చక్రవర్తి తమ సైనిక శిబిరాలని ఏర్పాటుచేస్తారట! ఆ సైనికులకు అధికార్లుగా మిమ్మల్నీ, నన్నూ నియమిస్తారట ప్రభూ!

రాజు: సరే ఆ మాటటుంచి, అందుకు ఒప్పుకున్నావా?

మంత్రి: ఈ మంత్రి పదవికన్నా, అదే మేలైన ఉద్యోగం జీతం పదిరెట్లు! ఒప్పుకున్నాను ప్రభూ!!  



 

................................

బాలసోముడు: తప్పు సమాధానం చెప్పినందున , గురువుగారు, నిన్ను గోడ కుర్చీ వేయమన్నారా? ఆయనగారడిగిన ప్రశ్నేమిటీ, నీ జవాబేమిటీ?

బాలరాముడు: మనూళ్ళోని వెయ్యి స్థంభాల గుడికి ఎన్ని స్థంభాలు అనడిగారు! వెయ్యి స్థంభాలని సమాధానం చెప్పాను!

బాలసోముడు:సరైన సమాధానమేగా?

బాలరాముడు:ధ్వజ స్థంభం తో కలిపి వెయ్యిన్నొక్క స్థంభాలు, సరైన సమాధానమట!!   

 

.................................

 

కొండరాయుడు: నా కంట్లోంచి రక్తం కారుతోంది!

గుట్ట సుబ్బడు: రా , భక్త కన్నప్ప దగ్గరికి వెళదాం! ఆయన నీకు చికిత్స చేయగలరు!

కొండరాయుడు: అయ్య బాబోయ్... ఆయనగారెలా చికిత్స చేస్తారో తెలియదా... నేను రాను!! 

 

 

.................................

 

 

 

 

పండు శాస్త్రి: చొప్పదంటు ప్రశ్నలడగడం లో నువ్వు దిట్టవటగా? ఏదీ, ఒక ప్రశ్నడుగు?

కాయశర్మ: భస్మాసురుడి చితా భస్మాన్ని ఎక్కడ కలిపారు?

పండు శాస్త్రి: చచ్చాను!!     
 


.................................

 

 

భృగు మహర్షి: బ్రహ్మగారెక్కడమ్మా?

సరస్వతి: మళ్ళీ వొచ్చారూ.... ఆయనగారు గుడికెళ్ళారండీ!

భృగు మహర్షి: ఆయనకి గుళ్ళేది? నా శాపం గుర్తులేదా?

సరస్వతి: ఒక గుడి వుందండోయ్... పుష్కరలో!! అక్కడికి దయచేయండి!!   

 
 
మరిన్ని శీర్షికలు
uttarakhand