మిత్రులందరికీ అభివందనం !!
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా ఆధ్వర్యంలో 15th డిసెంబర్ ,2017 నుండి జరుగు ప్రపంచ తెలుగు మహసభల సందర్భంగా తెలుగు కార్టూన్ల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ మామిడి హరికృష్ణ ,డైరెక్టర్ , తెలుగు భాషా సాంస్కృతిక శాఖ గారు తెలియ జేశారు .ఈ సందర్భంగా 'తెలంగాణ భౌగోళిక , సంస్కృతి ,పండుగల ,సామెతల' పై కార్టూన్లు పంపించవలసినదిగా కోరుతున్నాము . కార్టూన్ల ఎంపికపై తుది నిర్ణయం కమిటీదే . ప్రపంచ నలుమూలల నుండి ఈ కార్టూన్లను ఆహ్వానిస్తున్నాము .
కార్టూన్లు చేరవలసిన చివరి తేదీ : 1-12-2017 అనగా డిసెంబర్ 1, 2017 రాత్రి 12 గంటల వరకు . కార్టూన్ సైజు : A3 అనగా 18x12 inches with 300 dpi
కాప్షన్ : తెలుగులో మాత్రమే
కార్టూన్లు పంపవలసిన మెయిల్ ID : worldtelugumahasabhalu@gmail.com
కార్టూన్లు మెయిల్ ద్వారా మాత్రమే స్వీకరించబడును.
అత్యధికంగా 3 కార్టూన్లు మాత్రమే పంపించవలెను .
కార్టూనిస్ట్ పేరు , ఊరు పేరు ,జిల్లా పేరు ,ఫోన్ నెంబర్ తో మీ కార్టూన్ల హామీ పత్రాన్ని జతచేయండి .
ఈ మెసేజ్ తో పాటు జత చేయబడిన Lay out ఆధారంగా మీ కార్టూన్లు పంపండి .
|