ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. తేజ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. అయితే ఇది టీజర్ షూటింగ్ మాత్రమే. టీజర్ కోసం బాలయ్య ఎన్టీఆర్ గెటప్‌లో కనిపిస్తున్నారు. టీజర్‌తోనే సినిమా పనులు ప్రారంభమైనట్లు చెప్పుకోవచ్చు. ఈ టీజర్‌ని జనవరి 18న విడుదల చేయనున్నారు. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రని తెరపై ఆవిష్కరించబోతున్నారు ఈ సినిమాతో. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు డైరెక్టర్ తేజ. ఆ వెంటనే బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించే ఛాన్స్ రావడం తేజ అదృష్టమనే చెప్పాలి.
ఈ సినిమా కథ కోసం ఇప్పటికే చాలా రీసెర్చ్ చేశాడు తేజ. ఎన్టీఆర్ జీవితంలోని సినీ, రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య అంశాలను ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. అన్నట్లు ఈ సినిమాతో బాలయ్య తొలిసారిగా నిర్మాతగా మారనున్నారు. తన సొంత బ్యానర్‌లో బాలయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా, బాలయ్య నటించిన 'జై సింహా' చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. 'పైసా వసూల్' చిత్రంలో బాలయ్య తనలోని న్యూ యాంగిల్‌ని పరిచయం చేశాడు. తనదైన మార్క్ పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో 'జై సింహా'తో వచ్చేస్తున్నాడు. పొలిటికల్ పంచ్‌లకు ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. నయనతార, నటాషా జోషి, హరిప్రియ ఈ సినిమాలో బాలయ్యతో జత కడుతున్నారు.
|