'సూపర్‌స్టార్ చిరంజీవి అదే ఫ్రేమ్‌లో ఒక గౌరవం ఉండాలి' అని బిగ్‌బీ అమితాబ్ సోషల్ మీడియాలో తెలుగులో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పోషించే పాత్ర తాలూకు ఫస్ట్‌లుక్ బయటికి వచ్చింది. పొడవాటి తెల్లని గుబురు గెడ్డం, నుదుటున ఎర్రటి తిలకంతో ముసలి గెటప్‌లో ఉన్న అమితాబ్ గెటప్ చూస్తుంటే, ప్రముఖ కవి రవీంద్రనాధ్ ఠాగూర్ గెటప్‌ని తలపిస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర చాలా కీలకమైనదట. ఇంకోపక్క సినిమాలో చిరంజీవి లుక్ ఎలా వుండబోతోందో కూడా రివీల్ అయిపోయింది.
నయనతార లుక్ సైతం రివీల్ అయ్యింది. సినిమాలో మరో ముఖ్య పాత్రలో కన్పించనున్న బ్రహ్మాజీ గెటప్ సైతం బయటకు వచ్చేసింది. అమితాబ్ అధికారికంగా స్టిల్‌ని రిలీజ్ చేస్తే, మిగతా లుక్స్ లీక్ అయినట్లు తెలుస్తోంది. చిరంజీవి, నయనతార - పెళ్ళి సన్నివేశంలో కన్పిస్తున్నారు. ఆల్రెడీ తొలి షెడ్యూల్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా రెండో షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌కి తాజాగా అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు. అమితాబ్ గెటప్‌పై ఫస్ట్ ట్రైల్ షూట్స్ చేశాక ఈ గెటప్‌ని ఫైనల్ చేశారు. ఈ గెటప్‌తో పాటుగా, చిరంజీవి, నయనతార గెటప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మరుగున పడిపోయిన చరిత్ర ఆయనది. అందరికీ తెలియాల్సిన ప్రస్థానమది. చిరంజీవి చేస్తున్న ఈ ప్రయత్నానికి వివిధ భాషలకు చెందిన పలువురు నటీనటులు తమ తమ పాత్రలతో తమ వంతు తోడ్పాటునందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
|