1) సినిమా రంగం అంటేనే గ్లామర్.....రాత్రికి రాత్రే డబ్బూ, పేరు ప్రఖ్యాతలు అమాంతంగా వచ్చి పడగల రంగం....ఒక్కసారి తెరమీద కనబడితే చాలనుకునే వాళ్ళకు కొదువ లేదు గనక పోటీ అదే స్థాయిలో ఉంటుంది....అలా వచ్చిన వాళ్ళను వాడుకున్నోళ్ళకు వాడుకున్నంత....ఆ రంగం కావాలనుకుని వస్తే ఇవన్నీ తెలిసి, అన్నీ భరించగలమనుకుంటేనే రావాలి....సినిమా రంగంలో అన్యాయాలూ, అక్రమాల గురించి మాట్లాడడం, ప్రశ్నించడమంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలను ఏరిన చందమే అవుతుంది.
2) ఎంత సినిమా పిచ్చితో వస్తే మాత్రం మనుషుల్ని ( అమ్మాయిల్ని ) వాడుకుంటారా? వాళ్ళ సినిమా అభిమాననంతో ఆడుకుంటారా? ఎవరిచ్చారీ హక్కు? పది అవకాశాలు పరభాషల అమ్మాయిలకిచ్చినప్పుడు, ఒక్క అవకాశమైనా తెలుగమ్మాయిలకివ్వకూడదా? ఈ వివక్షను ప్రశ్నించాల్సిందే...ఒక్కొక్కటి చేరి, వేలగొంతులు ఒక్కటై నిలదీయాల్సిందే....ఈ దారుణాల్ని ఖండించాల్సిందే.
పై రెండింట్లో ఏది కరెక్ట్?
|