Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
vaaram varaam vari vari varaphalalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

13-4-2018 నుండి19-4-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. దూరప్రదేశంలో ఉన్న మిత్రులను కలుస్తారు, వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు లభిస్తాయి. వారాం చివరలో ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఆత్మీయులనుండి వచ్చిన సమాచారం మిమ్మల్ని ఆలోచనల్లో పడవేసి అవకాశం ఉంది.

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద సమయాన్ని ఎక్కువగా సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. పెద్దలసూచనల మేర ముందుకు వెళ్ళుట సూచన. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది, సాధ్యమైనంత వరకు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడుతుంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. ముఖ్యమ్గా ధనాన్ని విలువైన వస్తువులకు ఖర్చు పెట్టక పోవడం మంచిది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు.


మిథున రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తులతో అధికసమయం గడుపుతారు. చేపట్టిన పనుల విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఉద్యోగంలో మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబపరమైన విషయంలో ఒత్తిడి పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడుతుంది. సంతానం గురుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి.
 

 

కర్కాటక రాశి :   ఈవారం మొత్తంమీద మీరు నూతన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఎదుర్కొంటారు. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపార పరమైన విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు తప్పకపోవచ్చును. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మీరు తీసుకొనే నిర్ణయాలను కుటుంబసభ్యులకు తెలియజేయుట, అలాగే వారినుండి కావాల్సిన మద్దతును సంపాదించుట వలన లబ్దిని పొందగలుగుతారు. విలువైన వస్తువుల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ ఉన్న నస్టపోయే ఆస్కారం కలదు, ఈవిషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.

 

 సింహ రాశి : ఈవారం మొత్తంమీద అధికారుల సూచనలకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. మానసికపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. పెద్దలతో చర్చలు చేయునపుడు కాస్త ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. స్పష్టమైన ఆలోచనలను కలిగి ఉండుట సూచన. ఉద్యోగంలో పనిఒత్తిడి తప్పకపోవచ్చును. ప్రయాణాలు ఊహించని విధంగా వాయిదాపడే ఆస్కారం కలదు. సోదరులతో చేసిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. చిననాటి మిత్రులతో సమయాన్ని వారం చివరలో సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.

 

 

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద సంతానం కోసం సమయాన్ని కేటాయిస్తారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేస్తారు. తోటివారి సహకారం తీసుకోవడం వలన కొంత వేగంగా పనులు ముందుకు వెళ్ళుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మొదట్లో తడబాటు పొందుటకు అవకాశం ఉంది. కాస్త ప్రణాళిక అలాగే ముందుచూపు కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది.

 

తులా రాశి :  ఈవారం మొత్తంమీద సమయాన్ని మిత్రులతో సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దలతో నూతన సంభందాలు కొనసాగించే అవకాశం ఉంది. దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చిననాటి మిత్రులను కలుసుకొని ఆస్కారం ఉంది. కుటుంబపరమైన విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడం సూచన.

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు, అలాగే సమయాన్ని వారితో గడపటానికి అవకాశం ఉంది. చేపట్టిన పనులను కాస్త ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్ళు ప్రయత్నం చేయుట ద్వారా , సంతృప్తికరమైన ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారపరమైన విషయాల్లో అనుబవజ్ఞుల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన. ,గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట ద్వారా నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. ఆత్మీయులను లేదా ఇష్టమైన వారిని కలుసుకునే ఆస్కారం ఉంది.
 

ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద నూతన ప్ర్తయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో గతంలో రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ మాటతీరు మూలన ఊహించని మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది. సొంతఆలోచనల కన్నా పెద్దల ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన. ఆత్మీయుల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది.

 

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద చర్చలకు సాధ్యమైనంత వరకు సమయం ఇవ్వకండి, ఒకవేళ చర్చల్లో పాలగొనవలసి వస్తే సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. చేపట్టిన పనులను వారం మధ్యలో పూర్తిచేసే ఆస్కారం ఉంది. ప్రయాణాలు కుటుంబసభ్యులతో కలిసి చేసే అవకాశం కలదు. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. సంతానం గురుంచి కొంత ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి.

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త తడబాటు ఉంటుంది. పెద్దల సూచనలను పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. సంతానం గురుంచి ఆలోచనలు అధికం అవుతాయి. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది , నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 

మీన రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డ, రేణూ రాను అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండి ఆ దిశగా ముందుకు వెళ్ళుట సూచన. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగంలో అధికారులు మీనుండి నూతన విషయాలను ఆశిస్తారు. పెద్దలనుండి ఆశించిన మేర సహాకారం లభిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో జీవితభాగస్వామితో మీ ఆలోచనలు పంచుకుంటారు. 

మరిన్ని శీర్షికలు
aalolam short flim review