Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
7.30 short flim review

ఈ సంచికలో >> శీర్షికలు >>

థాయిలాండు విహారయాత్రలు - కర్రానాగలక్ష్మి

thailond

(రత్చబురి )

పట్టయ బీచ్ రోడ్డును చూస్తే ఆ దేశం మీద మనకి జుగుప్స కలుగుతుంది . అదే బీచ్ కి ఓ రెండు కిలో మీటర్ల దూరంలో వుండే నివాసస్థలాలు చూస్తే అక్కడ థాయిలాండ్ సంస్కృతి , సాంప్రదాయం కనిపిస్తుంది . చాలా నిశ్సబ్దమైన వీధులు ,చక్కగా తీర్చిదిద్దినట్లుండే యిళ్లు , పూల, పండ్ల చెట్లమధ్య వుండే భవనాలు , పక్కగా చిన్న మందిరం మందిరంలో మన బొమ్మల కొలువుని పోలిన బొమ్మల అమరిక . రోజూ ప్రతీ కుటుంబ సభ్యుడు అక్కడ ఊదొత్తుల వెలిగించికాని వీధిగుమ్మందాటరు . నైవేద్యంగా వారు తినేప్రతీ పదార్ధాన్ని అక్కడ వుంచుతారు ( మాంసాహారం , మద్యం తో సహా ) . మరునాడు వాటిని తీసేసి ఆ రోజు వండినవి నివేదన చేస్తారు . ఇల్లు యెంత పెద్దదైత బొమ్మల అమరిక అంత యెక్కువగా వుంటుంది . ప్రతీ యింట్లో బౌద్ద బిక్షువులకు యిచ్చే భిక్ష తయారుగా పెట్టుకుంటారు . ప్రతీ వారు కనీసం యిద్దరు ముగ్గులు భిక్షువులకు భిక్షయిస్తూ వుంటారు .

బీచ్ రోడ్డు కల్చర్ కి యిక్కడి కల్చర్ కి చాలా తేడా కనిపిస్తూ వుంటుంది .

ఇక్కడ నాకెదురైన చిన్న అనుభవం మీతో పంచుకుంటాను .

హోటలులో వుండి అక్కడి శాకాహార భోజనం తినలేక మేము సర్వీస్డ్ అపారం మెంట్ లోకి మారేం . అక్కడ పూర్తి కిచెన్వుంటుంది . వెంటనే నేను లోకలు మార్కెట్ కి వెళ్లేను . మనదేశం లో వున్నట్లు మాంసాహారం అమ్మకాలు ఓ వైపు ,కూరగాయలు ఓ వైపూ లేవు అన్నీ కలగలిప అమ్ముతున్నారు . నాకు కాసేపు యేమీ అర్దం కాలేదు , కాయగూరలు కొనాలావద్దా ? అన్నది , చివరకు చిహ్వ గెలిచింది , కొనాలని నిర్ణయించుకొని గుత్తి వంకాయలు తీసి తట్టలో వెయ్యసాగేను , నేను నిలుచున్న దగ్గర రెండు వైపులా అయిదుడుగుల బుట్టలు వున్నాయి , యెందుకో ఆ బుట్టలో వున్నవి కదులుతున్నట్టుగాఅనిపించి పక్కక తిరిగి చూస్తే బుట్ట పైకి రావడానికి ప్రయత్నిస్తున్న పాములు వందలలో వున్నాయి . ఒక్క క్షణం యేంచెయ్యాలో తెలీలేదు తర్వాత నాకుతెలియకుండానే పరుగందుకున్నాను , ఆ పరుగు మార్కెట్ నుండి బయట పడేవరకుఆపలేదు తరువాత యెప్పుడూ లోకలు మార్కెట్ కు వెళ్లే సాహసం కూడా చెయ్యలేదు . అయితే ఆ రోజు నాచీర కొంగుకు యేపాములైనా వ్రేలాడుతున్నాయేమో అని కలిగిన భ్రమ థాయ్లాండ్ ను వదిలేసాకకూడా చాలా రోజులు మనసులో వుండిపోయిమధ్య మధ్యలో నాకు తెలియకుండానే కొంగున గట్టిగా దులిపే దానిని . ఆ తరువాత నాలో కలిగిన సందేహం పాములనికిలోల లెక్కలో అమ్ముతారా ? లేక పీసులలెక్క అమ్ముతారా ? అని . కిలోలలెక్క లో అయితే యెలా తూచుతారు అని ,చక్కగా చేత్తో పాములని పట్టుకొని పాలిథిన్ కవర్లో కట్టి తూచడం చూడ్డం తో ఆ సందేహం కూడా తీరిపోయింది .

చూసేరా నాకెన్ని తెలిసిపోయేయో ? ఈ లోగా శివరాత్రి వచ్చింది . అప్పటికి మా థాయి డ్రైవరుకి మేం హిందువులమని అర్దమైంది .హిందూ టెంపుల కి తీసుకు వెళతానని , అక్కడ యెలిఫెంట్ గాడ్ , మంకీగాడ్ , పచివ , బుల్ వుంటాయ అన్నాడు .పచివ తప్ప అన్నీ అర్దమయ్యాయి . పదిమార్లు అడిగినా యీ పచివ యెవరో అర్దం కాలే . సరే అక్కడకి వెళితే యెలాగూ తెలుస్తుంది అని వూరుకున్నాం . గర్భగుడిలో  వున్న శివలింగాన్ని చూస్తే ‘ పరమ శివుని ‘ వీళ్లు పచివ గా పలుకుతారనిఅర్దమైంది . అలాగే ‘ ప్రొబ్రోమ్ ‘ అంటే పర బ్రహ్మ అని తెలిసింది .పట్టయ లో  చాలా  యెక్కువగా  బంగారం  షాపులు  కూడా కనిపిస్తాయి , వాటికన్న యెక్కువగా అంటే బంగారు షాపులోనేకాకుండా ప్రతీ రెస్టొరాంట్స్ లో కూడా కెంపులు , పచ్చలు అమ్ముతూ వుండడంతో సహజ కుతూహలంతో గనులుయెక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నంలో మాకు ‘ రత్చాబురి ‘ పట్టణం గురించి తెలిసింది . బేంకాక్ కి  సుమారు  80కిలోమీటర్లు  పశ్చిమంగా ,  పట్టయ నగరానికి  సుమారు 240  కిలోమీటర్ల  దూరంలోని  వుందట యీరత్చాబురి  పట్టణం . స్థానికుల పలికే  విధానం వల్ల మేము యీ  నగరం పూర్వం ‘ రత్నపురం ‘ అయి వుంటుందని కాలక్రమేణా ‘ రత్చాబురి ‘ గా మారి వుంటుందని అనుకున్నాం . రత్చాబురి  బర్మా సరిహద్దులలో వుంది . కెంపులకు బర్మా ప్రసిధ్ది , బర్మా లో లభ్యమయ్య కెంపులని ‘ పావురపు నెత్తురుకెంపులు ‘ అని వ్యవహరిస్తారు .

వీటి రంగు పావురపు నెత్తుటి రంగులో వుండడమే దీనికి కారణం . బర్మా గనులు మూత పడ్డతరువాత ప్రస్తుతం న్యూ బర్మీస్ కెంపులు వస్తున్నాయి , వీటికి బర్మా దేశానికి యే సంబంధం లేదు . నిజానికి యివిథాయ్లాండ్ లోని గనులలో లభ్యమయేవి , యివి కాస్త లేత యెరుపులో వుంటాయి . రత్చాబురి నగరాన్ని ‘ మీ క్లాంగ్ ‘ నదిబర్మా దేశంతో విడదీస్తూ సహజ సరిహద్దుగా ప్రవహిస్తోంది . ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవులు  , ‘ తనవ్సరీ ‘  పర్వత శ్రేణులతోనూ   యేర్పడింది . ఈ పర్వతాలు  సున్నపుపర్వతాలు కావడంతో  యీ పర్వతాలలో  చాలా సహజ గుహలు  వున్నాయి . కొన్ని పర్యాటకుల  కోసం తెరువబడ్డాయి , యీపర్వతాలలో యింకా  యెన్నో  గుహలు వున్నాయని  అంటారు .  ఇలాంటి  గుహలు  యెన్నో చూడడంవల్ల  మాకేమీ కొత్తదనం కనిపించలేదు . పాత  పెంకుటిళ్లతో  మొదలయి , నగరంలోకి  ప్రవేశిస్తున్నగొద్దీ  కొత్త బహుళంతస్థుల భవనాలు  మాల్స్  కనబడసాగేయి .  పురాతనమైన యిళ్ల  మొదలు  ప్రతీ యిల్లు , షాపు ఒకటేమిటి ప్రతీ  చోటా మనకి కడిగియెండలో  పెట్టిన ,  రంగురాళ్లను మామూలు  రాళ్లను  వేరుచేస్తూ   యిలా  యెన్నో దశలలో వున్న రత్నాలు కనిపించసాగేయి .

కొన్ని చాలా  చిన్న చిన్న  రత్నాలు శాన పెట్టే  దుకాణాలను కూడా చూసేం రతనాలను  రాతి రూపాలలో  చూసిఆశ్చర్యపోయేం .  గనులలోంచి తవ్విన  రాయి రత్నరూపానికి  వచ్చే  క్రమంలో జరిగే ప్రతీ చర్యను చూసేం .  అంతవరకువినని ప్రక్రియన యిక్కడ చూసేం ,  అదేమిటంటే లేత రంగులో వుండే రత్నానికి కెమికల్ ట్రీట్మెంటు ద్వారా ముదురరంగువచ్చేటట్లు చేస్తూ వుంటారు . గాఢ రంగులో వుండే రత్నాలు మంచి ఖరీదు పలకడం వల్లనేమో యిలా చేస్తారు . దానికి కొన్నికెమికల్స్ ని వేసి రంగురాళ్లను కొన్ని రోజులపాట రైస్ కుక్కర్లలో పెట్టి వేడిచెయ్యడం కూడా ఆశ్చర్యాన్ని కలుగజేసింది . అయితే ధరలు అడిగితే ఆకాశాన్నంటే విధంగా చెప్పడం వింతగా అనిపించింది . తరువాత జెమ్మాలజీ చేసేక మార్కెట్ లోకి యెలా ప్రవేశించాలో తెలిసాక రత్నాల ధరలలో వ్యత్యాసాలు తెలిసేయి ,హోల్ సేల్ ధరలకి మార్కెట్ ధరలకి పదిరెట్లు తేడా వుండడం నాకు యిప్పటికీ ఆశ్చర్యాన్ని కలుగ చేస్తుంది . ఈ ప్రాంతపు ఆచార వ్యవహారాలు , భాష , చేతిపనులలో బర్మా ప్రభావం బాగా కనిపిస్తూ వుంటుంది . రత్చాబురి కి దగ్గరగా వున్న పోటింగ్ మార్కెట్టుని ‘ డెమ్నియోన్ సద్వాక్ ‘ ఫ్లోటింగ్ మార్కెట్ అని అంటారు . మీక్లాంగ్నదిలో కర్రపడవలమీద బేరసారాలు సాగుతూ వుంటాయి . కెనాల్ మీదుగా కర్ర పడవలమీద ప్రయాణిస్తూ కెనాల్ నిఆనుకొని వున్న పల్లెలలో అమ్మకాలు జరుపుతూ వుంటారు .

ఒక్కొక్కప్పుడు వీరు వస్తుమార్పిడి పద్దతి లో కూడా బేరసారాలుజరుపుతూ వుంటారు . బర్మా పల్లీయులు వారివారి చేతిపనులు , స్థానిక పంటలు ఎక్కువగా అమ్మతూ వుంటారు .రత్చబురి కి సుమారు అయిదు కిలో మీటర్ల దూరంలో  వున్న ఖో బిన్ గుహలు సందర్శకులలో యెక్కువపేరుపొందేయి . ఇవి సున్నపురాతి గుహలు . తనోసి ‘ పర్వత శ్రేణులలో వున్నాయి యీ గుహలు . ఈ పర్వత శ్రేణులలోయింకా చాలా గుహలు వున్నట్లు వాటిలో కొన్ని వేలసంఖ్యలో గబ్బిలాలు నివాసం యేర్పరచుకోవడం వల్ల ఆ చుట్టుపక్కలకివెళ్లడం ప్రమాదమని స్థానికులు చెప్పేరు . ఖోబిన్ గుహలను ఫ్లైయింగ్ కేవ్స్ అని కూడా అంటారు . దూరం నుంచి చూస్తేయీ గుహలు రెక్కలు చాపుకొన్న గ్రద్ద లా కనిపించడం వల్ల వీటిని ఫ్లైయింగ కేవ్స్ అని పిలువసాగేరు . ఈ గుహలలో యెన్నో ప్రాకృతికంగా యేర్పడ్డ ఆకృతులు వున్నాయి . ఇలాంటి గుహలు యెన్నో చూసివుండడంవల్ల మాకు గొప్పగా అనిపించలేదు , మొదటి మారు చూసేవారికి తప్పకుండ నచ్చుతాయి .యీ గుహలనుండి నడకదారిలో ఓ కిలోమీటర్లు ముందుకు వెళితే అక్కడ తొమ్మిది అంతస్థులుగా పడుతున్న’  క్వీఛాన్ ‘ జలపాతం మమ్మల్ని బాగా ఆకట్టుకుంది . సంవత్సరం పొడువునా పడే యీ జలపాతం వర్షాకాలంలో చాలావుదృతంగా వుంటుంది . ఈ జలపాతం చూడడానిక మేం సెప్టంబరు లో వెళ్లడం వల్ల వుదృతంగా పడుతున్న జలపాతాన్నిచూసేం . పై అంతస్తుచేరడానికి కాలిబాట వుంది . ఆ పైకి వెళ్లి చూస్తే జలపాతం యింక బాగా కనిపిస్తుందని చాలా మందిపర్యాటకుల వెళ్లసాగేరు .

మేం అంతసాహాసం చెయ్యలేదు . దీనిని ‘ నామ్ టోక్ ‘ అని అంటారు . నామ్ టోక్ అంటే థాయిభాషలో జలపాతం అని అర్దం .తనోసి   పర్వతాలలో ‘  బొక్లాంగ్  వేడినీటి ‘  వూటలు  కూడా  చూడదగ్గవే .  నామ్  టోక్  కి ఓ కిలోమీటర్లు  దూరంలో  వున్న సహజ ఖనిజ వేడి నీట వూటలు .  నేల లోంచి వేడి నీరు పైకి చిమ్ముకు  రావడం  ఓ  అద్భుతమనే  చెప్పాలి .   ఈ నీటి వేడి సుమారు  70 నుంచి  90 డిగ్రీల ఫారన్ హీటు లో వుంటాయి . రత్చాబురి లో వున్న  ఓ బౌద్దమందిరానికి వెళ్లేం . పెద్ద బౌద్ద మందిరం , మేం వెళ్లినప్పుడు ఆ మందిరంలో అప్పుడు ఆ సంవత్సరపు వేడుకలు సాగుతున్నాయి . యెందరో బౌద్దభిక్షువులు , వేల సంఖ్యలో భక్తులు వచ్చి బుద్దుని దర్శనం చేసుకుంటున్నారు . మన మందిరాలలో ప్రసాదాలు పంచినట్లు అక్కడ కూడా ఆహారం భక్తులకు అందిస్తున్నారు ,అందులో నాన్ వెజ్ పదార్ధాల వున్నాయి , బుద్దుడు వీళ్లకి జీవహింస చేయరాదు అని చెప్పలేదేమో అని నవ్వుకున్నాం ,యిక్కడ బుద్దుడు పడుకున్నట్టుగా వున్న విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు . నిర్యాణం పొందుతున్న బుద్దిని దర్శనంసర్వపాపాలన పోగొడుతుందని వీరు నమ్ముతారు . మన  మందిరాలలో  కన్నా  చాలా  గలీజుగా  చేసేరు  యిక్కడి  ప్రజలు . వీరు  హిందూ  దేవాలయాలకు  కూడా  పెద్ద సంఖ్యలో  వెళ్లి  కొబ్బరికాయలు  అరటి పళ్లు దేవుడికి  సమర్పిస్తూవుంటారు . పై వారం ‘ అయోధియ ‘  గురించి చదువుదాం , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
what-people-think-about-me