విజువల్ ఎఫెక్ట్స్ పరంగా రాజమౌళి చెక్కిన 'బాహుబలి' చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పింది. ఇంతవరకూ తెలుగు సినిమా అంటే లెక్క చేయని ఇతర భాషల్లో కూడా తెలుగు సినిమా స్టామినా అంటే ఇదీ అని చూపించి సత్తా చాటింది 'బాహుబలి'. ఇప్పుడు అలాంటి 'బాహుబలి'కి పోటీగా మరో సినిమా రానుంది. స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా 'బాహుబలి' చిత్రాన్ని ఢీకొట్టే విధంగా ఈ చిత్రం ఉండబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఆ చిత్రం మరింకేదో కాదు. 'సాక్ష్యం'. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ ఆడ్రస్ అయిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈయన హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమే 'సాక్ష్యం'. పునర్జన్మ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
కాగా ఈ చిత్రం షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. అయితే విజువ్ ఎఫెక్ట్స్ కారణంగా ఎప్పుడో విడుదల కావల్సిన 'సాక్ష్యం' కాస్త ఆలస్యంగా విడుదలవుతోంది. ఇకపోతే, ఈ సినిమాలో గ్రాఫిక్స్ పార్ట్ చాలా ఎక్కువగా ఉండనుందట. వాటి కోసం 'బాహుబలి' వంటి ప్రపంచ ఖ్యాతి చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీమ్ అహర్నిశలూ శ్రమిస్తోందట. వారి శ్రమ ఫలితం ఔట్‌పుట్ చాలా బాగా వస్తోందని ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారమ్. మొత్తానికి ఈ సినిమా బడ్జెట్‌లో ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని రూపొందిస్తున్నారట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న 'సాక్ష్యం' జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
|