Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

జోకులు - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

దీపాలు తుడిచే పరిచారిక, గది వూడ్చే పరిచారికతో : ఏమే ? ఇవాళ చాలా సంతోషంగా వున్నావ్?
గది వూ
డ్చే పరిచారిక : నిన్న గది చిమ్ముతూండగా, ఒక ముత్యపుటుంగురం దొరికింది. ఇవాళ రత్నాల దుద్దులు దొరికాయి !
దీపాలు తుడిచే పరిచారిక  :  రేపు నీకు రవ్వల గాజులు దొరుకుతాయి చూడు !
గది వూడ్చే పరిచారిక : ఔనా...? నీకెలా తెలుసు..?
దీపాలు తుడిచే పరిచారిక  : నేనెరిగిన ఓ పిల్లా, నీకుమల్లే గదులూడ్చే ఉద్యోగంలో చేరి వరుసగా మూడ్రోజులు , ఉంగరం, దుద్దులు, గాజులు దొరికి దాచిపెట్టుకుంది. నాలుగోరోజున రాణిగారు చీవాట్లు పెట్టి చీకటి కొట్లో తోయించారు !!

చంప : మహారాణీ.....ద్వార కాపలా భటులు, నన్నూ, నా తోటి పరిచారికలను చూసి ఈల వేసి విసిగిస్తున్నారమ్మా...!
మహారాణి : అలా చెయ్ మని, నేనే వాళ్ళకి ఉత్తర్వులిచ్చాను. పల్చటి బట్టలు కట్టుకుని అంతఃపురంలో తిరగకండని మీకెన్నిసార్లు చెప్పాలి....నామాటింటారా...ఏమన్నానా...?


వింజామర కన్య : సభలో అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నవ్వాపుకోలేక, నోటికి చేతులడ్డం పెట్టుకున్నారు...ఎందుకూ?
రెండోకన్య: కారణం రాణిగారి అంతరంగిక చెలికత్తె, రాణిగారి పెదాలకి రంగులెక్కువ రాసి, ముస్తాబు చేసింది..!

మూడో కన్య : ( రహస్యంగా ) ఆ పెదాల రంగు, రాజుగారి బుగ్గల మీదున్నాయి చూడు !

 

శ్వేత : నువ్వు పెద్ద రాణీగారి అంతరంగ పరిచారికవి. జీతం పెంచార్ట కదా....ఏం పని చేస్తావేం ?
గీత : ( రహస్యంగా ) చిన్నరాణీ గారు ఏం చీరలు కడతారు? ఏం నగలు పెట్టుకుంటారు,  ఏం తింటారు? ఈ సమాచారాలన్నీ గడియ గడియకీ, పెద్ద రాణీ గారికి చేరవేస్తుంటాను ! మరి, నీదేం పని?
శ్వేత :( రహస్యంగా ) పెద్ద రాణి గారి సమాచారాలన్నింటినీ చిన్నరాణి గారికి చెప్పటమే కాకుండా, ఆవిడ అంతరంగిక పరిచారికల గురించి వివరాలు సేకరిస్తూంటాను !!

తోటపని సుబ్బి : రాణీ గారు, తమ పరిచారికలందరికీ శెలవిచ్చి , నెల్రోజుల్దాకా పనికి రావద్దని పంపించేశారట కదా..!
కొలను పని రత్తి : ఔను, తెలుసులే ! రాణీ గారి బ్రహ్మచారి తమ్ముడు దేశ పర్యటన చేసి తిరిగొస్తున్నాడని కబురొచ్చింది !

 

రాణి : స్థంభాలూ, గోడలూ పొగసూరి పోయి నల్లగా, అసహ్యంగా వున్నాయి.....
నౌకరు పిల్ల : దీపాలు తుడిచే పరిచారికని పిలవమంటారా అమ్మా?
రాణి : తుడిచే పరిచారిక వద్దు, దీపాలకి నూనె పోసి, వొత్తులు నలిపి, వెలిగించే పరిచారికని వెంటనే పిలుచుకురా....!!

 

చెలికత్తె చూడామణి : ఒశేవ్, మన పెద్ద రాణీగారు పాలరాతి శిలలాగా మెరిసిపోతుంటారె...మరైతే చిన్న రాణిగారు, కారు నలుపు...ఆవిడనెలా, మన రాజుగారు పెళ్ళి చేస్కున్నారు?
చెలికత్తె కనకామణి : మన రాజుగారు, చిన్నరాణిని, మసక వెలుతురులో చూసి, మోహించి పెళ్ళి చేసుకున్నారట !
చూడామణి : మసక వెలుతురులోనా?
కనకామణి : ( రహస్యంగా ) మన రాజుగారికి రేచీకటి ! నీకు తెలీదా?

 

పెద్దరాణి, పద్నాలుగవ చిన్నరాణితో : దిగులెందుకమ్మా....నీకేం తక్కువైందనీ....కానుకలూ, ఆభరణాలూ, సౌకర్యాలూ, నీ బంధు మిత్రులకి ఆదరణ, ఆతిథ్యం...వసతులూ, అన్నీ మెండుగా లభించాయి కదా...?
చిన్నరాణి : నేను పెద్దమనిషయ్యేదెప్పుడో....శోభనం ఎప్పుడో...?

 

పరిచారిక పార్మావతి : రాణీగారు గుర్రం స్వారీ నేర్చుకుంటున్నారట, ఔనా?
పరిచారిక శేష్మావతి : మధ్యలో కాలు బెణికి స్వారీ శిక్షణ ఆగిపోయింది !
పార్మావతి : అయ్యో....రాణిగారు గుర్రమెక్కబోయి, పడి, కాలు బెణికిందా...పాపం...?
శేష్మావతి : రాణిగారిక్కాదు...గుర్రానికి, పాపం..! రాణిగారు భారీశరీరం కదా !!

 

చెలికత్తె చెంచులక్ష్మి : రాణీగారి జరీచీరల బోషాణం కాలిపోతే రాజుగారు, శభాష్ అని మెచ్చుకుని విపరీతంగా సంతోషపడ్డారా? ఎందుకూ??
చెలికత్తె మంచుపార్వతి : జరీ చీరలు కాలి, వాటిల్లోంచి, వెండి కరిగి, ముద్దలయ్యాయిగా, ..! ఆ వెండి ముద్దల్ని కోశాగారానికి తరలించి, సంతోషంగా వున్నారు రాజు గారు!!

మరిన్ని శీర్షికలు
vote-vesi-chethulu-dhulupukunte-saripodu