Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఓటు వేసి చేతులు దులుపుకుంటే... - ..

vote-vesi-chethulu-dhulupukunte-saripodu

మీకంటూ ఒక ఇష్టమైన రాజకీయ నాయకుడు ఉండకూడదు. మీరు ఎన్నుకునే రాజకీయవేత్త దేశం కోసం పని చేస్తున్నాడా లేక తన స్వార్థం కోసం పనిచేస్తున్నడా? అన్న విషయాన్ని మొదట మీరు చూడాలి. రెండవ విషయంగా, ఆ రాజకీయవేత్త విశాలమైన  ఆలోచనా పరిధి, తెలివితేటలు కలిగివున్నాడా, అలాగే దేశానికి ఏది కావాలో అది సృష్టించగల అర్హత, సామర్థ్యం వుందా? దేశ ప్రజల గుండె చప్పుడు, అర్థం చేసుకోగల ఓర్పు ఉందా? అన్న విషయాలు గమనించాలి. ఈ లక్షణాలు ఆ రాజకీయవేత్తలో లేదా నాయకునిలో ఉన్నట్లయితే, ఆ వ్యక్తిని బలపర్చడం మన ధర్మం. అలాగే పై లక్షణాలు లేనట్లైతే ఆ వ్యక్తిని భర్తీ చేయడం మన బాధ్యత. ప్రజాస్వామ్యం ఆనందం కోసం వీక్షించే ఆట కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో పాల్గొనడం అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయడం కాదు. ప్రజాస్వామ్యం మీరు పాలుపంచుకోగలిగేటువంటి ఒక ఆట, అంతేకానీ అది చూసే ఆట కాదు. ‘ఎవరో ఒకరు ప్రజాస్వామ్యాన్ని ఉద్దరించనీ’ అని మీరు నింపాదిగా కూర్చొని మాట్లాడకూడదు. ప్రజాస్వామ్యంలో మీరే ప్రభువులు, మీరు అలక్ష్యంగా వుండకూడదు. మీ చుట్టూ జరిగే విషయాలపై అవగాహన కలిగి వుండాలి. మీలో ఆ చైతన్యం అనే స్పృహ, అవగాహన, సామాజిక అంశాలపై  క్రియాశీలత లేకపోతే ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పని చేయలేదు. అదే సమయంలో, మీరు ప్రతి విషయానికి నిరసన తెలిపి, ‘బంద్’కు పిలుపునిస్తే అవి  దేశ పురోభివృద్ధిని ఆపే సాంకేతికత అవుతుంది.   కానీ దేశాన్ని పురోభివృద్ధి వైపు ఎలా నడపాలి అన్నది ఒక గొప్ప టెక్నాలజి, అది మనం తెలుసుకోవాలి. 

కనీసం నెలకొకసారి, మీ వీధిలో, మీ ప్రాంతంలో సమస్యలను ఒక జాబితాగా రూపొందించి చుట్టుప్రక్కల ప్రాంతాల వారిని కలుపుకొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ ప్ర్రాంత కౌన్సిలర్ లేదా MLAను పిలిచి ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో వారితో చర్చించాలి. ఏ నాయకుడైనా ‘తాత్కాలిక రాజకీయ ఉద్యోగం’లో వున్న ఒక పౌరుడు మాత్రమే అని గుర్తించాలి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయడంతో మీ బాధ్యత తీరిపోదు. ఎవరికో మీరు ఉద్యోగం కల్పించి, ఆ వ్యక్తి పని చేస్తున్నాడా లేదా అని మీరు గమనించకపోతే అదెలా కుదురుతుంది..

ఏ నాయకుడైనా ‘తాత్కాలిక రాజకీయ ఉద్యోగం’లో వున్న ఒక పౌరుడు మాత్రమే అని గుర్తించాలి.

ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రతి ఒక్కరూ సరైన కోణంలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఈ దేశంలో కనీసం యాభై నుంచి అరవై శాతం మంది ముందటి తరం ప్రజలు ఎన్నో కష్టాలను చూశారు. ఈరోజు మీరు, నేను బాగానే తింటున్నాం. కానీ సుమారు నాలుగు వందల మిలియన్ ప్రజలు ఈ దేశంలో తినడానికి సరైన ఆహారం లేక బాధపడుతున్నారు. మనం వచ్చే ఐదు నుంచి పది సంవత్సరాల కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ ఆకలి సమస్యను తీర్చవచ్చు. ప్రతి భారతీయుడు దీనిని అర్థం చేసుకోవాలి.

ఇది మన ముందు వున్న గొప్ప అవకాశం. తినడానికి సరైన తిండిలేక, పిల్లలకు పోషకాహారం, విద్య అందించలేక, సరైన అవకాశాలు లేక, భయంకరమైన సామాజిక, ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న  నిరుపేదల జీవితాలను వచ్చే ఐదు, పది సంవత్సరాలలో  సరైనా ప్లానింగ్, చర్యలతో మనం పూర్తిగా మార్చగలం.

(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)

మరిన్ని శీర్షికలు
tamilnadu