Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

నా నువ్వే చిత్రసమీక్ష

movie review

చిత్రం: నా నువ్వే 
తారాగణం: కళ్యాణ్‌రామ్‌, తమన్నా, వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భరణి, సురేఖా వాణి, ప్రవీణ్‌ తదితరులు. 
సంగీతం: శరత్‌ వాసుదేవన్‌ 
సినిమాటోగ్రఫీ: పి.సి. శ్రీరామ్‌ 
నిర్మాతలు: కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి 
నిర్మాణం: కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌, ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ 
సమర్పణ: మహేష్‌ కోనేరు 
దర్శకత్వం: జయేంద్ర 
విడుదల తేదీ: 15 జూన్‌ 2018

క్లుప్తంగా చెప్పాలంటే.. 
ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వెళ్ళాలనుకునే కుర్రాడు వరుణ్‌ (కళ్యాణ్‌రామ్‌). రేడియో జాకీ మీరా (తమన్నా)కి విధి పట్ల విపరీతమైన నమ్మకం. ఆ విధ పట్ల నమ్మకం లేని వరుణ్‌తో మీరాకి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే కొన్ని కారణాలతో ఈ ఇద్దరూ విడిపోతారు. తిరిగి కలుసుకునేందుకు మీరా చేసిన ప్రయత్నాలు వర్కవుట్‌ అయ్యాయా? లేదా? విధిని నమ్మని వరుణ్‌, ఆ విధిని గట్టిగా నమ్మే మీరాతో ప్రేమని గెలిపించుకున్నాడా? లేదా? వీరి ప్రేమ కథని విధి ఎలాంటి మలుపులు తిప్పింది? అనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే.. 
నటుడిగా కళ్యాణ్‌రామ్‌కి మంచి మార్కులు పడతాయి. రొమాంటిక్‌ యాంగిల్‌ని ట్రై చేసిన కళ్యాణ్‌రామ్‌ మెచ్యూర్డ్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటాడు. హీరోయిన్‌ తమన్నా, ఈ సినిమాకి మేజర్‌ ప్లస్‌ పాయింట్‌. నటనతోనూ, గ్లామర్‌తోనూ మెప్పించింది. ఆమె గ్లామర్‌ కుర్రకారుకి కితకితలు పెట్టడం ఖాయం. కళ్యాణ్‌రామ్‌, తమన్నా మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, తనికెళ్ళ భరణి, సురేఖా వాణి, పోసాని కృష్ణమురళి తమవంతుగా సినిమాకి ఉపయోగపడ్డారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు. 
కథ మరీ కొత్తదేమీ కాదు. కథనం పరంగానే ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది. డైలాగ్స్‌ ఓకే. టెక్నికల్‌గా చూసుకుంటే, సినిమాటోగ్రఫీ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. పిసి శ్రీరామ్‌ అనుభవం ప్రతి ఫ్రేమ్‌లోనూ కన్పిస్తుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి హెల్పయ్యాయి.

రొమాంటిక్‌ స్టోరీస్‌ ఎంచుకునేటప్పుడు లీడ్‌ పెయిర్‌ ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ ఆడియన్స్‌ని ఎలా అలరిస్తుందనే విషయమై దర్శకుడికి ఓ ఐడియా వుండాలి. లీడ్‌ పెయిర్‌ మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్‌ అయినా, కొంచెం ఎబ్బెట్టుగా అన్పిస్తుంటుంది. డైరెక్షన్‌ పరంగా కొన్ని లోపాలు కన్పిస్తాయి. సాగతీత సన్నివేశాలు ఎక్కువ కావడం సినిమాకి మరో మైనస్‌ పాయింట్‌. టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి పూర్తి సహకారం లభించినా దర్శకుడు, పాతకాలం నాటి ఆలోచనా విధానంతో సినిమా తెరకెక్కించడం ఒకింత ఇబ్బందికరమే. ఓవరాల్‌గా సినిమా నిరాశపరుస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్‌ ఈ సినిమాకి ఆడియన్స్‌ని రప్పించే అవకాశం వున్నా, దర్శకుడు మిగతా ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ని ఎంగేజ్‌ చేయలేకపోవడం బాధాకరం.

ఒక్క మాటలో చెప్పాలంటే
నా నువ్వే.. కెమిస్ట్రీ కుదిరినా.. ఈక్వేషన్స్‌ కుదరలేదు

అంకెల్లో చెప్పాలంటే...
2.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka