Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
gang leader re make

ఈ సంచికలో >> సినిమా >>

అనుష్క - ప్రబాస్‌ ఈ పెళ్లి గోలేంటి

Anushka - Prabas  wedding

టాలీవుడ్‌లో అనుష్క, ప్రబాస్‌ల పెళ్లిళ్లు హాట్‌ టాపిక్‌గా నిలిచాయి. 'బాహుబలి' సినిమాకి ముందే వీరిద్దరూ తమ తమ పెళ్లి వార్తలను చెబుతారని అనుకున్నారంతా. కానీ 'బాహుబలి' సినిమా లాంగ్‌ షెడ్యూల్‌తో ఈ సినిమా పూర్తయ్యాకే పెళ్లి అని ఈ వార్తలకు చెక్‌ పెట్టేశారు. 'బాహుబలి' వచ్చి ఏడాది గడుస్తోంది. తర్వాత ప్రబాస్‌ 'సాహో' సినిమాతో బిజీ అయిపోయాడు. ఇప్పుడప్పుడే పెళ్లి వార్త చెప్పేలా లేడు. ఇకపోతే జేజమ్మ విషయానికి వస్తే, సేమ్‌ టు సేమ్‌. 'బాహుబలి' తర్వాత అనుష్క పెళ్లి చేసుకోవడం ఖాయమన్నారు. పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నామనీ అనుష్క కుటుంబ సభ్యుల నుండి సమాచారమ్‌ కూడా అందింది. అయితే అది కూడా జరగలేదు. కానీ ఈ మధ్య ఇదిగో జేజమ్మ పెళ్లి, అదిగో జేజమ్మ పెళ్లంట అంటూ పుకార్లు చాలా షికార్లు చేస్తున్నాయి.

ఈ కోవలోనే ఒకానొక దశలో అనుష్క - ప్రబాస్‌ పెళ్లి చేసుకోనున్నారనే గాసిప్‌ కూడా లేవనెత్తారు. అయితే ఈ విషయాన్ని వీరిద్దరూ ఖండించారు. జస్ట్‌ మేమిద్దరం ఫ్రెండ్స్‌ మాత్రమే అని వారిద్దరూ చెప్పుకొచ్చారు. అయినా ఈ గాసిప్స్‌ ఆగడం లేదు. సోషల్‌ మీడియా వేదికగా వీరిద్దరిపై వస్తున్న గాసిప్స్‌ చూసి నవ్వుకుంటున్నారట. అయితే తాజాగా ప్రబాస్‌ ఫ్యామిలీ నుండి అనుష్కకి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందంటూ హాట్‌ హాట్‌గా గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. ఈ గాసిప్‌ విషయంలో కొంచెం ఆలోచించాల్సి వస్తోంది. ఇంతకీ ఈ గాసిప్‌లోనైనా నిజముందా? ఇంతవరకూ స్ప్రెడ్‌ అవుతున్న గాసిప్స్‌కి చెక్‌ పెట్టేందుకైనా వీరిద్దరూ ఒక్కటవుతున్నారా? ఏంటీ? అనే విషయంలో అసలు సిసలు క్లారిటీ రావాల్సిందే.

మరిన్ని సినిమా కబుర్లు
Another sensation of RJV 'Virus'