Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pratapabhavalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

6-7-2018 నుండి12-7-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచలను జీవితాభిగస్వామికి లేదా కుటుంబపెద్దలకు తెలియజేసే అవకాశం ఉంది. విదేశీ అలాగే దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం, కాస్త శ్రమించుట ద్వారా నూతన పెట్టుబడులు పొందుతారు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, జాగ్రత్త. స్త్రీలతో చేసిన చర్చలు మిశ్రమఫలితాలను కలుగజేస్తాయి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలకు అవకాశం ఉంది. దైవపరమైన విషయాల్లో ఉత్సహంగా పాల్గొంటారు. ప్రయాణాలు చేయునపుడు కాస్త ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు. విలువైన వస్తువులను నస్టపోయే ఆస్కారం ఉంది.

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలు ఒకవిధంగా ఉండకపోవచ్చును. అనుభవజ్ఞుల లేదా పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారంలో నూతన నిర్ణయాలకు అలాగే నూతన పనులకు ప్రాధాన్యం ఇస్తారు. నూతన పరిచయాలు ప్రయాణాలు చేస్తున్నపుడు ఏర్పడే అవకాశం ఉంది. విలువైన వస్తవులను కొనుగోలు చేసే ఆలోచన వాయిదా వేయుట ఉత్తమం. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి, పనిభారం ఉంటుంది. సంతానం వలన కొంత సంతోషాన్ని పొందుతారు, ఎక్కువ సమయం వీరితో గడపటం మేలు. నూతన వాహనాలు,భూమి మొదలైన వాటిని కొనుగోలు చేసే ప్రయత్నం ముందుకుసాగుతుంది.

 


మిథున రాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటును కలిగి ఉంటారు. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సోదరులతో చేయుచర్చలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో పెద్దలతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ మొండి నిర్ణయాల వలన మిత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకోకుండా చేపట్టు పనులు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. జీవితాభిగస్వామి ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. బంగారు లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అలసత్వం పనికిరాదు. దైవపరమైన పూజల్లో పాల్గొంటారు.

 

 

 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తం మీద ఆరంభంలో ఏమాత్రం తొందరపాటు కలిగిఉన్న నష్టాలను ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. చర్చల్లో పాల్గొనేముందు అవతలివారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళటం ద్వారా వివాదాలను తగ్గించుకొనే అవకాశం ఉంది. నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగపడుతాయి. రావాల్సిన ఆర్థికసహయం సమయానికి అందకపోవచ్చును. తండ్రితరుపు వారి ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బంది పొందుతారు. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం ద్వారా మేలుజరుగుతుంది.

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద అధికమైన ఆలోచనలు అలాగే ఆలోచనల్లో మార్పులను కలిగి ఉంటారు. సోదరులతో చేపట్టిన చర్చలు మిమ్మల్ని కొద్దిగా భాదకు గురిచేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. సంతానం నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. వారితో సమయాన్ని గడుపుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట ఉత్తమం. వ్యాపారరంగంలో పనిచేసే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళుట మేలు. ఆత్మీయుల ఆరోగ్యం మిమ్మల్ని కాస్త ఇబ్బంది కలిగిస్తుంది.

 

 

కన్యా రాశి : ఈవారం మొతం మీద ఉద్యోగంలో పనిఒత్తిడి ఉంటుంది. పనిబారం ఉంటుంది, నిదానంగాముందుకు వెళ్ళుట సూచన. మీ ప్రయత్నంలో అనుభవజ్ఞుల సూచనలు ఉపయోగపడుతాయి. మీ మాటల్లో స్పష్టత లేకపోవచ్చును. మిత్రులతో చేసిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన మేర పెట్టుబడులు లభిస్తాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో అకారణంగా వివాదం జరిగే అవకాశం ఉంది , సర్దుబాటు విధానం మంచిది. రుణపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్దగా ఉన్న నస్టపోతారు, రాతపూర్వక విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును.

 

 

 

తులా రాశి : ఈవారం మొత్తం మీద బంధువులతో కలిసి నూతన ప్రయత్నాలు అలాగే వారితో సమయం వచ్చించే అవకాశం కలదు. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యాపారపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి , తద్వారా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం సూచన. తల్లితరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. గతంలో మీకు రావాల్సిన రుణపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు రాకపోవచ్చును. జీవితభాగస్వామి నుండి వచ్చిన సూచనలు కాస్త మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది.

 

 

వృశ్చిక రాశి :  ఈవారం మొత్తం మీద సాధ్యమైనంత మేర అవసరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. పెద్దలనుండి లేక ఆత్మీయుల నుండి వచ్చిన సూచనల విషయంలో అలసత్వం పనికిరాదు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదాపడే అవకాశం ఉంది. సమయం అధికభాగం చర్చలలో వినియోగించే అవకాశం ఉంది. ఉద్యోగంలో లేక వ్యాపారంలో కాస్త ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే సానుకూల ఫలితాలు వస్తాయి. మీ మాటతీరు చాలామందిని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న విషయాల్లో ఫలితాలు సంతోషాన్ని కలిగిస్తాయి. సంతానం విషయాల్లో నూతన ఆలోచనలు చేస్తారు.

 

 

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను కొన్నింటిని మధ్యలో వదిలేస్తారు. ముఖ్యమైన వాటికీ అధికప్రాధాన్యం ఇవ్వడం సూచన. అనుకోకుండా చేసే ప్రయాణాల్లో ఎదో తెలియని అనుభూతిని పొందుతారు. గతంలో మీకు ఎదురైనా అనారోగ్యసమస్య మల్లి ఇబ్బందిపెట్టుటకు అవకాశం కలదు, జాగ్రత్త. పెద్దలనుండి ఆశించిన విధంగా సహకారం పొందుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది, సానుకూల ఫలితాలు పొందుతారు. తల్లితరుపు బంధువుల నుండి మరింతగా సహకారం లభిస్తుంది. పూర్తిస్థాయి ప్రణాళిక కలిగి ఉండుట సూచన.

 

మకర రాశి : ఈవారం మొత్తం మీద మీరు చేసే నూతన ఉద్యోగప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కుటుంబంలో నూతన ఆలోచన లేక నిర్ణయాల విషయాల్లో చర్చలకు అవకాశం ఉంది. దూరప్రదేశంలో ఉన్న బంధువుల లేక కుటుంబసభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి, పెద్దలతో పరిచయం ఏర్పడుతుంది. సంతానం విషయంలో కొంత ఒత్తిడి పొందుతారు. ఉద్యోగంలో సర్దుకుపోవడం సూచన. సమయపాలన మంచిది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుతాయి, ఖర్చులకు అవకాశం ఉంది. మిత్రులను కలుస్తారు.

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో మిశ్రమఫలితాలు ఉంటాయి. అధికారులతో మీ ఆలోచనలను పంచుకొనే విషయంలో ఆచితూచి వ్యవహరించుట మంచిది. వ్యాపారంలో అనుభవజ్ఞుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. బంధువుల కుటుంబంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు పూర్తిచేయుటలో పూర్తిస్థాయి ఫలితాలు రాకపోవచ్చును. వారం మధ్యలో కాస్త అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. సోదరులతో చేపట్టిన చర్చలు ముందుకుసాగుతాయి. సంతానం వలన నలుగురిలో మంచి పేరును పొందగలుగుతారు. ప్రయాణాలు చేస్తారు.

 

 

 

మీన రాశి :  ఈవారం మొత్తం మీద ముఖ్యమైన పనులను మొదలు పెట్టుటకు ఉత్సహంను కలిగి ఉంటారు. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది , వీటికి అధికప్రాధాన్యత ఇచ్చే అవకాశం కలదు. సాధ్యమైనంత మేర సోదరులతో వివాదాలు రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమం. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారు వైద్యులకు అందుబాటలులో ఉండుట సూచన. భూమి,ప్లాట్ మొదలైన వాటిని కొనుగోలు చేసేముందు పాత్రలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది. ఇతరుల మాటతీరు మూలాన మీరు కాస్త బాధకు లోనయ్యే అవకాశం ఉంది, సర్దుబాటు అవసరం. 

మరిన్ని శీర్షికలు
ravvapulihora