Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

బేతాళప్రశ్న - ..

betala prashna

1. ఫ్రాన్స్ ని కిందకు తోసి ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక  వ్యవస్థగా ఎదిగింది భారత్. సామాన్యుడు నిత్యం ఎదుర్కుంటున్న సమస్యలూ, పెద్దగా కనిపించే ఒడిదుడుకులన్నీ చిన్నవేనని తేలిపోయింది.

2.ఇది ఒక పార్శ్వం మాత్రమే...ఆ లెక్కలన్నీ అపర కుబేరులూ, పెరుగుతోన్న కార్పొరేట్ వ్యాపారుల సంఖ్యలను బట్టి వేసిన అంచనాల గణాంకాలు మాత్రమే. నిత్యావసర వస్తువులూ, పెట్రోలు ధరలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు....వ్యవసాయానికి తగిన ప్రోత్సాహం లేక రైతన్న బిక్కుబిక్కుమంటున్నాడు. నోట్ల రద్దు దెబ్బకి ప్రజలింకా కోలుకోనే లేదు. జీ ఎస్ టీ పన్ను విధానాలకు ఇంకా అలవాటు పడనే లేదు. ప్రగతి ఫలాలు ప్రతి పౌరుడికీ అందిన నాడే నిజమైన దేశప్రగతి.. పై రెండింట్లో ఏది కరెక్ట్?

 

పైరెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని శీర్షికలు
sarasadarahasam