Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Pot Chicken - Village Style - Easy Method

ఈ సంచికలో >> శీర్షికలు >>

మన జీవితంలో అదృష్టం పాత్ర ఎంత.. - ..

ఎవరైతే అదృష్టం మీద ఆధారపడ్డారో, వాళ్ళు నక్షత్రాలు, గ్రహాలు, స్థానాలు, వారికి కలిసి వచ్చే చెప్పులు, సంఖ్యలు ఇలా అన్ని రకాల వాటికి ప్రాధాన్యతనిస్తారు. వీళ్ళు అదృష్టం కోసం వెతుకుతూ, ఆ ప్రక్రియలో విషయాలు వాటంతట అవే జరిగిపోవాలని ఎదురుచూస్తున్నారు. వాళ్ళంతట వాళ్ళు ఎంతో సులువుగా చూసుకోగలిగిన విషయాలను కూడా ఇలా  ఎదురు చూపులు చూస్తూ, అవి చేసుకోకుండా ఉండిపోతున్నారు. జీవితంలోని ప్రతి అంశంలోనూ ఏది జరగాలన్నా, అది మీ వల్ల జరగాల్సిందే. మీ ప్రశాంతత, మీ కలవరం మీరు సృజించుకుంటున్నదే. మీ సమయమనం, మీ పిచ్చి మీరు సృజించుకుంటున్నదే. మీ సంతోషం, దుఃఖం మీరు చేసుకుంటున్నదే. మీలో ఉన్న దైవం లేదా దయ్యం కూడా మీరు చేసుకుంటున్నదే.

ఏదో కాకతాళీయంగా కొన్ని విషయాలు జరగొచ్చు. కానీ మీరు ఇలా అవకాశం కోసం ఎదురుచూస్తుంటే, మీరు సమాధికి వెళ్ళే వరకు మీకు మంచి విషయాలను జరగవు. ఎందుకంటే వాటంతట అవి జరగాలంటే, అంత  సమయం తీసుకుంటాయి మరి.

దురదృష్టవశాత్తు, సరైన పరిస్థితులు కలగాలని, ఇంకా ఎదో జరగాలని ఎదురు చూస్తూ, మీరు మీ శక్త్యానుసారం, మీ సామర్థ్యన్ని ఉపయోగించి, మీ అంతర్ముఖంలోనూ, బహిర్ముఖం లోనూ మీకు కావలసినది సృజించుకోవడం మానేస్తున్నారు.  

తెల్లారింది మొదలు సాయంత్రం వరకు ఒక రోజుని మీరు ఎలా అనుభూతి చెందారన్నది పూర్తిగా మీరే చేసుకుంటున్నారు.  మీకు  ప్రజలతో ఎంత ఘర్షణ ఏర్పడిందన్న విషయం మీరు పరిస్థితులను ఇంకా వారి పరిమితులను అర్థం చేసుకోవడంలో ఎంత విఫలమయ్యారన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇది కచ్చితంగా మీరు అదృష్తం కోసం ధరించే జాతి రాళ్ళ మీద ఆధారపడి ఉండదు. ఇది మీరు ఎంత సున్నితత్వంతో, ఇంగితంతో, తెలివితో, ఎరుకతో   మీ చుట్టూరా ఉన్న జీవాన్ని గమనిస్తూ నడుచుకుంటున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

 

మీకు ఎంతో గొప్ప విషయాలు జరుగుతున్నా, అవి మీకు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదంటే మీరు ఎప్పటిదో వండుకున్న ఆహారాన్ని ఇప్పుడు తింటున్నట్లే.

 

ఒక రోజున ఒక విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులు కలిసారు. ఒకతను ఎంతో నిస్పృహతో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. మరొకతను, “ మీరు ఎందుకిలా ఉన్నారు? ఏం జరిగింది?” అని అడిగాడు.

దానికి మొదటి వ్యక్తి, “నన్ను ఏం చెప్పమంటారు..? నా మొదటి భార్య క్యాన్సర్ తో మరణించింది. రెండో భార్య పక్కింటి వాడితో లేచిపోయింది. నా కొడుకు జైల్లో ఉన్నాడు, ఎందుకంటే నా మీద హత్యా ప్రయత్నం చేశాడు. నా పద్నాలుగేళ్ల కూతురు గర్భవతి. మా ఇంటి మీద పిడుగు పడింది. షేర్ మార్కెట్ లో నాకున్న షేర్లన్నీ ఇవాళ కుప్పకూలిపోయాయి. ఇవన్నీ కాకుండా నాకు ఎయిడ్స్ ఉందని ఇవాళ మెడికల్ రిపోర్ట్ వచ్చింది.”

మరో వ్యక్తి, “అయ్యో ఎంత దురదృష్టం కలిగింది మీకు. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? మీ వృత్తి ఏమిటి?” అని అడిగాడు

అందుకు మొదటి వ్యక్తి, “ నేను అదృష్టం కలిగేందుకు జాతి రాళ్లను అమ్ముతాన” ని జవాబిచ్చాడు.

విషయం ఏమిటంటే, మీరు ఒక విధంగా ఉంటే కొన్ని పరిస్థితులు మీ పట్ల ఆకర్షితమవుతాయి. మీరు మరో విధంగా ఉంటే, మీ చుట్టూ జరిగే విషయాలు మరో విధంగా ఉంటాయి. అక్కడొక పూల పొద, ఒక ముళ్ళపొద ఉన్నాయనుకోండి, తేనెటీగలన్ని పూల వైపుకి వెళ్తాయి. దీనర్థం పూలపొద అదృష్టవంతురాలని కాదు, దాని సువాసన అటువంటిది. అది ఆకర్షిస్తోందని కనపడకకపోవచ్చు, కాని ఆకర్షిస్తోంది. ప్రజలు ముళ్ళపొద వైపుకి వెళ్లడానికి ఇష్టపడరు, ఎందుకంటే అది మరో విధమైన పరిస్థితిని సృష్టిస్తోంది కాబట్టి. ఈ రెండు కూడా అవి సృజించే దాన్ని ఎరుక లేకుండానే చేస్తూ ఉండి ఉండొచ్చు కానీ చుట్టూతా జరిగేవి ఎలా జరగాలో ఆ విధంగానే జరుగుతాయి.

మీకు ఎంతో గొప్ప విషయాలు జరుగుతున్నా, అవి మీకు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదంటే మీరు ఎప్పటిదో వండుకున్న ఆహారాన్ని ఇప్పుడు తింటున్నట్లే. అది మీరు ఎప్పుడో ఎక్కడో చాలా కాలం క్రితం చేసుకున్నది. దాన్ని మీరు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. కానీ అది రోజురోజుకి పాచిపోతుందని తెలుసుకోవాలి. మీకు కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు అవి ఎందుకలా జరుగుతున్నాయో మీకు తెలుస్తుంటే, దాని అర్థం మీరు స్పృహతో ఆహారాన్ని ఈ రోజున వండారన్నమాట. అదేవిధంగా మీకు చెడ్డ విషయాలు జరుగుతూ, అవి ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలియకపోతే, మళ్ళీ మీరు అలా పాచిపోయిన ఆహారాన్నే తింటున్నారని అర్థం.

అదృష్టం -  మీరు చూడలేనిది 

భారత ప్రాంతీయ భాషల్లో అదృష్టం అంటే ఏంటో చూద్దాం. దృష్టి అంటే మనం చూడగలిగింది. అదృష్టం అంటే మనం చూడలేనిది; మీరు చూడలేకపోతున్నారనమాట. మీరు చూడగలిగితే ఏది ఎందుకు జరుగుతోందో మీకు తెలుస్తుంది కదా, మీరు చూడలేనప్పుడే జరుగుతున్న విషయాలు యాదృచ్చికంగా జరుగుతున్నట్టు మీ కనిపిస్తుంది. అప్పుడు మీరు అది అదృష్టమనో దురదృష్టమనో అనుకుంటారు.

 

ఆధ్యాత్మికత అంటే మీరు మీ జీవితాన్ని పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకోవటమే.

 

ఆధ్యాత్మికత అంటే మీరు మీ జీవితాన్ని పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకోవటమే. అలా మీ జీవితాన్ని పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకున్నప్పుడు మాత్రమే, మీరు పూర్తి స్థాయిలో ఎరుక ఉన్న జీవం అవుతారు ఇంకా మీలో దైవత్వం కూడా ఉదయిస్తుంది.

మీ జీవితాన్ని మీరు స్పృహతో చూడవలసిన సమయం. మీరు అదృష్టం మీద, నక్షత్రాలు లేదా గ్రహాల మీద ఆధారపడకండి; ఇవన్నీ జీవం లేని వస్తువులు. మానవ నైజం ప్రాణం లేని విషయాల తలరాతను రాయాలా లేదా ప్రాణం లేని వస్తువులు మానవ నైజాన్ని నిర్ణయించాలా....? ఏవిధంగా ఉండాలి...? మానవ నైజం ప్రాణంలేని వాటికి ఏం జరగాలన్నది నిర్ణయించాలి కానీ ఒక నక్షత్రం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అంటే లేదా ఒక ప్రాణంలేని వస్తువు మీ తలరాతను నిర్ణయించడం ఏంటి?   

ఇలాంటివి మిమ్మల్ని ప్రభావితం చేసేందుకు మీరు అనుమతినివ్వకండి. ఎందుకంటే ఇలా చేస్తే మీ జీవితం ఎంతో పరిమితంగా మారిపోతుంది. మీరు ఒక చట్రంలో ఉండిపోతారు, దాన్ని దాటి ముందుకు వెళ్ళలేరు. ఇది మీ ఎదుగుదలను మీ అవకాశాలను తగ్గించి వేస్తుంది.

 

మీకు  ప్రజలతో ఎంత ఘర్షణ ఏర్పడిందన్న విషయం మీరు పరిస్థితులను ఇంకా వారి పరిమితులను అర్థం చేసుకోవడంలో ఎంత విఫలమయ్యారన్న దాన్ని బట్టి ఉంటుంది.

 

ఏదో కాకతాళీయంగా కొన్ని విషయాలు జరగొచ్చు. కానీ మీరు ఇలా అవకాశం కోసం ఎదురుచూస్తుంటే, మీరు సమాధికి వెళ్ళే వరకు మీకు మంచి విషయాలను జరగవు. ఎందుకంటే వాటంతట అవి జరగాలంటే, అంత  సమయం తీసుకుంటాయి మరి. 

కాబట్టి మీరు యాదృచ్చికంగా జీవిస్తే మీరు భయాందోళనల్లో కూడా జీవిస్తారు. మీరు మీ శక్తి సామర్థ్యాలతో జీవిస్తే, బయిట ఏం జరిగినా జరగకపోయినా, కనీసం మీలో జరుగుతున్నది మీ అదుపులో ఉంటుంది. ఇది మరింత స్థిరమైన జీవితం.

మరిన్ని శీర్షికలు