వరుసగా రెండు సినిమాలతో రెండు సూపర్ హిట్స్ కొట్టింది ముద్దుగుమ్మ రష్మికా మండన్నా. మరో సూపర్ హిట్‌కి రెడీ అయ్యింది. అదే 'దేవదాస్' సినిమా. నాగార్జున, నాని మల్టీస్టారర్‌గా రూపొందుతోందీ సినిమా. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా ఆకాంక్షసింగ్ నటిస్తుండగా, నానితో రష్మికా మండన్నా జత కడుతోంది. ఈ సినిమా షూటింగ్ టైంలో సెట్స్‌లో ఫుల్ జోష్‌తో ఉండేదట రష్మికా. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె ఎనర్జీకి హీరో నాని, కింగ్ నాగార్జున ఫిదా అయిపోయేవారట. ఆ సంగతి పక్కన పెడితే, నాగార్జునకు తాను బాడీగార్డెన్‌ని అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిందీ అందాల భామ.
ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. అసలు విషయం ఏంటంటే నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, దేవదాస్ సెట్‌లో ఆ ఫోటోలు షేర్ చేసింది సోషల్ మీడియాలో. ఆ ఫోటోలో జీన్స్ అండ్ చెక్స్ షర్ట్‌తో నాగార్జున ముందు నిలబడి రెండు చేతులు పైకి చూపిస్తూ రెండు వేళ్లు చూపిస్తూ, నాగార్జున సార్ మీ బాడీగార్డ్‌ని నేను. మీకు అభిమానిని నేను. హ్యాపీగా కింగ్ సైజ్‌లో లైఫ్ ఎంజాయ్ చేయండి.. అంటూ ఆయనకు బర్త్‌డే విసెష్ చెప్పింది రస్మికా. 'గీత గోవిందం' ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండతో కలిసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదే సెంటిమెంట్ 'దేవదాస్' సినిమాకి కూడా ఫాలో అవుతున్నట్టుంది. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ లక్కీనే కాదు, మహా ముదురండోయ్ అందుకే రెండో సినిమాకే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసింది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న 'దేవదాస్' సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు.
|