Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sira chukkalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

5 - 10 -2018 నుండి 11-10-2018 వరకు వారఫలాలు - - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మీ ఆలోచలను జీవిత భాగస్వామికి లేదా కుటుంబ పెద్దలకు తెలియజేసే అవకాశం ఉంది. విదేశీ అలాగే దూర ప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం, కాస్త శ్రమించుట ద్వారా నూతన పెట్టుబడులు పొందుతారు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, జాగ్రత్త. స్త్రీలతో చేసిన చర్చలు మిశ్రమ ఫలితాలను కలుగజేస్తాయి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలకు అవకాశం ఉంది. దైవ పరమైన విషయాల్లో ఉత్సహంగా పాల్గొంటారు. ప్రయాణాలు చేయునపుడు కాస్త ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు. విలువైన వస్తువులను నస్టపోయే ఆస్కారం ఉంది.    

 వృషభ రాశి : ఈ వారం ఆరంభంలో ఏ మాత్రం తొందరపాటు కలిగి ఉన్న నష్టాలను ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. చర్చల్లో పాల్గొనే ముందు అవతలి వారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళటం ద్వారా వివాదాలను తగ్గించుకొనే అవకాశం ఉంది. నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగ పడతాయి. రావాల్సిన ఆర్థిక సహయం సమయానికి అందక పోవచ్చును. తండ్రి తరుపు వారి ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందులు కలుగవచ్చు. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం ద్వారా మేలు జరుగుతుంది.   

 

మిథున రాశి : ఈ వారం సాధ్యమైనంత మేర అవసరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. పెద్దల నుండి లేక ఆత్మీయుల నుండి వచ్చిన సూచనల విషయంలో అలసత్వం పనికి రాదు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది. సమయం అధిక భాగం చర్చలలో వినియోగించే అవకాశం ఉంది. ఉద్యోగంలో లేక వ్యాపారంలో కాస్త ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే సానుకూల ఫలితాలు వస్తాయి. మీ మాట తీరు చాలా మందిని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న విషయాల్లో ఫలితాలు సంతోషాన్ని కలిగిస్తాయి. సంతానం విషయాల్లో నూతన ఆలోచనలు చేస్తారు.

 


కర్కాటక రాశి : ఈ వారం ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధికారులతో మీ ఆలోచనలను పంచుకొనే విషయంలో ఆచితూచి వ్యవహరించుట మంచిది. వ్యాపారంలో అనుభవజ్ఞుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. బంధువుల కుటుంబంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు పూర్తి చేయుటలో పూర్తిస్థాయి ఫలితాలు రాకపోవచ్చును. వారం మధ్యలో కాస్త అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. సోదరులతో చేపట్టిన చర్చలు ముందుకు సాగుతాయి. సంతానం వలన నలుగురిలో మంచి పేరును పొందగలుగుతారు. ప్రయాణాలు చేస్తారు.

సింహ రాశి : ఈ వారం బంధువులతో కలిసి నూతన ప్రయత్నాలు అలాగే వారితో సమయం వచ్చించే అవకాశం కలదు. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యాపార పరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి , తద్వారా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం సూచన. తల్లి తరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. గతంలో మీకు రావాల్సిన రుణ పరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు రాకపోవచ్చును. జీవిత భాగస్వామి నుండి వచ్చిన సూచనలు కాస్త మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది.

 


కన్యా రాశి : ఈ వారం ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. పని బారం ఉంటుంది, నిదానంగా ముందుకు వెళ్ళుట సూచన. మీ ప్రయత్నంలో అనుభవజ్ఞుల సూచనలు ఉపయోగపడుతాయి. మీ మాటల్లో స్పష్టత లేకపోవచ్చును. మిత్రులతో చేసిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార పరమైన విషయాల్లో ఆశించిన మేర పెట్టుబడులు లభిస్తాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో అకారణంగా వివాదం జరిగే అవకాశం ఉంది , సర్దుబాటు విధానం మంచిది. రుణ పరమైన విషయాల్లో ఏ మాత్రం అశ్రద్దగా ఉన్న నష్టపోతారు, రాత పూర్వక విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. 

తులా రాశి : ఈ వారం అధికమైన ఆలోచనలు అలాగే ఆలోచనల్లో మార్పులను కలిగి ఉంటారు. సోదరులతో చేపట్టిన చర్చలు మిమ్మల్ని కొద్దిగా భాదకు గురిచేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. సంతానం నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. వారితో సమయాన్ని గడుపుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయుట ఉత్తమం. వ్యాపార రంగంలో పనిచేసే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళుట మేలు. ఆత్మీయుల ఆరోగ్యం మిమ్మల్ని కాస్త ఇబ్బంది కలిగిస్తుంది

 

వృశ్చిక రాశి : ఈ వారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటును కలిగి ఉంటారు. స్వల్ప దూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సోదరులతో చేయుచర్చలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో పెద్దలతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ మొండి నిర్ణయాల వలన మిత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకోకుండా చేపట్టిన పనులు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. జీవితభాగస్వామి ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. బంగారు లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అలసత్వం పనికి రాదు. దైవ పరమైన పూజల్లో పాల్గొంటారు.

 


ధనస్సు రాశి : ఈ వారం మీరు చేసే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబంలో నూతన ఆలోచన లేక నిర్ణయాల విషయాల్లో చర్చలకు అవకాశం ఉంది. దూర ప్రదేశంలో ఉన్న బంధువుల లేక కుటుంబ సభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి, పెద్దలతో పరిచయం ఏర్పడుతుంది. సంతానం విషయంలో కొంత ఒత్తిడి పొందుతారు. ఉద్యోగంలో సర్దుకుపోవడం సూచన. సమయ పాలన మంచిది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుతాయి, ఖర్చులకు అవకాశం ఉంది. మిత్రులను కలుస్తారు.

మకర రాశి : ఈ వారం నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను కొన్నింటిని మధ్యలో వదిలేస్తారు. ముఖ్యమైన వాటికీ అధిక ప్రాధాన్యం ఇవ్వడం సూచన. అనుకోకుండా చేసే ప్రయాణాల్లో ఎదో తెలియని అనుభూతిని పొందుతారు. గతంలో మీకు ఎదురైనా అనారోగ్య సమస్య మల్లి ఇబ్బంది పెట్టుటకు అవకాశం కలదు, జాగ్రత్త. పెద్దల నుండి ఆశించిన విధంగా సహకారం పొందుతారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది, సానుకూల ఫలితాలు పొందుతారు. తల్లి తరుపు బంధువుల నుండి మరింతగా సహకారం లభిస్తుంది. పూర్తి స్థాయి ప్రణాళిక కలిగి ఉండుట సూచన.  


కుంభ రాశి : ఈ వారం మీ ఆలోచనలు ఒక విధంగా ఉండక పోవచ్చును. అనుభవజ్ఞుల లేదా పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారంలో నూతన నిర్ణయాలకు అలాగే నూతన పనులకు ప్రాధాన్యం ఇస్తారు. నూతన పరిచయాలు ప్రయాణాలు చేస్తున్నపుడు ఏర్పడే అవకాశం ఉంది. విలువైన వస్తవులను కొనుగోలు చేసే ఆలోచన వాయిదా వేయుట ఉత్తమం. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి, పని భారం ఉంటుంది. సంతానం వలన కొంత సంతోషాన్ని పొందుతారు, ఎక్కువ సమయం వీరితో గడపటం మేలు. నూతన వాహనాలు,భూమి మొదలైన వాటిని కొనుగోలు చేసే ప్రయత్నం ముందుకు సాగుతుంది.  

 


మీన రాశి : ఈ వారం ముఖ్యమైన పనులను మొదలు పెట్టుటకు ఉత్సహంను కలిగి ఉంటారు. మిత్రుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది , వీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కలదు. సాధ్యమైనంత మేర సోదరులతో వివాదాలు రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమం. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారు వైద్యులకు అందుబాటలులో ఉండుట సూచన. భూమి, ప్లాట్ మొదలైన వాటిని కొనుగోలు చేసే ముందు పాత్రలను ఒక సారి సరి చూసుకోవడం మంచిది. ఇతరుల మాట తీరు మూలాన మీరు కాస్త బాధకు లోనయ్యే అవకాశం ఉంది, సర్దుబాటు అవసరం.   

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

 

 

మరిన్ని శీర్షికలు
bachelors-pappu