Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

14 - 12 -2018 నుండి 20-12-2018 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం  పెద్దలతో కాస్త మాటపట్టింపులకు వెళ్ళుటకు అవకాశం ఉంది, కాస్ట్ అయి విషయంలో జాగ్రత్త అవసరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగ పడుతాయి. సంతానం విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, చేతిలో ధనం నిలకడగా ఉండకపోవచ్చును. ఆరోగ్య పరమైన సమస్యలు తగ్గుతాయి.   ఆరంభంలో కాస్త మిశ్రమ ఫలితాలు సూచితం. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయంలో సొంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు.

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం  విలువైన వస్తువులను కొనుగోలు చేయు విషయంలో కుటుంబంలో చర్చలకు అవకాశం ఇస్తారు. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో మీరు మొదలు పెట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. సంతానం విషయంలో ఉన్న ఒత్తిడి చాలామేర తగ్గుతుంది, వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు ఆస్కారం ఉంది. వార సూచనలు వినండి.మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి, వీరితో సమయం గడుపుటకు ఆసక్తిని చూపిస్తారు.   

 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

 ఈవారం  వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. ఆర్థికపరమైన విషయాల్లో జీవిత భాగస్వమితో చర్చలకు ఆస్కారం ఉంది. వారం చివరలో కాస్త ఒత్తిడికి గురవుతారు. బంధువుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీకుకొండి. దైవపరమైన విషయాల్లో కాస్త సమయం గడుపుతారు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకొనే సమయంలో పెద్దలను సంప్రదించే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు కలుగుతాయి. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. ఆరోగ్యం విషయాల్లో ప్రత్యేక శ్రద్ద అవసరం.   

 

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం  స్వల్ప దూర ప్రయాణాలు చేస్తారు. చిన్న చిన్న విషయాలకు సైతం ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. విదశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. చేసిన పనులను మల్లి చేయాల్సి వస్తుంది, కాస్త ఈ విషయంలో ఇబ్బంది తప్పక పోవచ్చును. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. వేచిచూసే ధోరణి మంచిది.   ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. తలపెట్టిన పనులను వారం చివరలో విజయవంతంగా పూర్తిచేస్తారు.


సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

 ఈవారం   ముఖ్యమైన విషయాల్లో స్పష్టత కలిగి ఉంటారు. ఉద్యోగంలో బాగుంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. పూజాది కార్యక్రమంలో పాల్గొంటారు. స్త్రీ పరమైన విషయాల్లో వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉంటారు.   పెద్దలను కలుసుకునే అవకాశం ఉంది, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. తలపెట్టిన పనులను పూర్తిచేయుటకు కాస్త ఓపిక అవసరం. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం  వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభించిన పూర్తిస్థాయిలో మీరు సంతృప్తి చెందకపోవచ్చు. స్వల్ప అనారోగ్యసమస్యలు మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టుతాయి. ఎదుటివారితో కలిసి పనిచేసే సమయంలో కాస్త ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంది, సర్దుబాటు అవసరం.  కుటుంబంలో శుభకార్యక్రమాల విషయంలో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. మిత్రులతో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేస్తారు, మీ ఆలోచనలను వారితో పంచుకుంటారు.

 

 


తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం వ్యాపార పరమైన విషయాల్లో బాగానే ఉన్న , అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయు వారికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం, వైద్యున్ని కలవడం వలన మేలుజరుగుతుంది. పెద్దలతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుని,  మీ ఆలోచనలను చాలామంది ప్రశంసిన్చే అవకాశం ఉంది.
 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం  ఆర్థికపరమైన విషయాల్లో ఒకింత ఇబ్బందులు తప్పక పోవచ్చును. ముఖ్యమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో బాగాఉన్న , మీ ఆలోచన విధానం వలన నూతన సమస్యలు పొందుతారు. మీ మాటతీరు మరింత నష్ట పరిచే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. సంతానం వలన లబ్దిని పొందుతారు. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు.  కుటుంబంలో కీలకమైన ఆలోచనలు చేసే ప్రయత్నం చేస్తారు, వేచిచూసి ఉపయోగం లేదు. మానసికంగా కొంత ఇబ్బందులు తప్పక పోవచ్చును. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి.


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

 ఈవారం ఆరోగ్యం విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. సమయం అధికంగా చర్చలకు ఇస్తారు. పనులు ముందుకు సాగుతాయి. గతం కన్నా ఆశజనకమైన వాతావరణం ఏర్పడుతుంది. కాస్త ఓపిక తప్పక మేలుచేస్తుంది.  బంధువులను కలుస్తారు, వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు తొలగుతాయి. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి. విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం ఉంది. జీవితభాగస్వమితో మీ ఆలోచనలు పంచుకుంటారు.   

 

 


మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం  ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో తీసుకొనే నిర్ణయాల విషయంలో జీవిత భాగస్వామితో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయు ఆలోచన వాయిదా పడే ఆస్కారం ఉంది. సంతానం విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగ పడుతాయి. సోదరులను కలుసుకుంటారు.   ఎవ్వరితోను మీ అంతర్గత విషయాలను పంచుకోకపోవడం సూచన. ఎదుటివారిని కాస్త గమనించే ప్రయత్నం చేయుట సూచన. బంధువులను కలుస్తారు, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం  విదేశాల్లో ఉన్న మిత్రులనుండి వచ్చిన సమాచారం మిమల్ని కాస్త ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం లేదా వైద్యం కోసం ధనం ఖర్చు అయ్యే ఆస్కారం ఉంది. అనుకోకుండా మీరు తీసుకొనే నిర్ణయాలు మిమల్ని ఆత్మరక్షణలో పడవేసి అవకాశం ఉంది, జాగ్రత్త.  ఉద్యోగంలో అనుకూలమైన మార్పు వస్తుంది,  మీ ఆలోచనలను అధికారులతో పంచుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో బాగాఉంటుంది. నూతన పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబంలో చాలామేర అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం  మానసికంగా దృడంగా ఉండుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానం నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి.  చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు, అధికారుల నుండి ఆహించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఫలితాలు మీకు అనుకూలంగా రావడం వలన సంతృప్తిని పొందుతారు. దూరప్రదేశ ప్రయాణాలు మిత్రులతో కలిసి చేయుటకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో బాగానే ఉంటుంది.

 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

 
మరిన్ని శీర్షికలు
tamilnadu