Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

‘క్షణం ఒక యుగమే’ షార్ట్ ఫిల్మ్ సమీక్ష- - పి.వి.సాయి సోమయాజులు

kshanam oka yugame short flim review

సీ.ఏ.పి.డి.టి. పతాకంపై విడుదలై యూత్ మొదలు అందరి ఆదరణ పొందుతున్న కొత్త ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ - ‘క్షణం ఒక యుగమే’. విడుదలై నెల కాక ముందే దాదాపు నాలుగు లక్షల వ్యూస్ దక్కించుకోవడమే కాక ఈ సినిమా ఎన్నో మంచి ఫీడ్‍బ్యాక్స్ ను తన సొంతం చేసుకుంది. ఈ చిత్ర సమీక్ష, మీ కోసం-

కథ-

అసలు ప్రేమ మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేని ఓ క్యాబ్ డ్రైవర్ తన కార్‍లో రోజూ ప్రయాణించే ఎంప్లాయైన ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇలా సైలెంట్‍గా సాగే ఈ ప్రేమ కథలో అనుకోని ఓ సమస్య వచ్చి పడుతుంది, అది ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూసి తీరాల్సిందే!

ప్లస్ పాయింట్స్-

ముందుగా ఈ షార్ట్ ఫిల్మ్ లో అభినందించాల్సింది కథనం. ఒక చిన్న లైన్ ని కూడా ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా ప్రేక్షకుడిని దాదాపు గంట సేపు అలరిస్తుంది. కథ ప్రెమిస్ చాలా కొత్తగా, డిఫరెంట్‍గా ఉంది. ట్యాగ్‍లైన్ లో సూచించినట్టుగానే ‘లవ్ ఆన్ వీల్స్’, అంటే, దాదాపు షార్ట్ ఫిల్మ్ మొత్తం కార్‍లోనే జరుగుతుంది. హీరో హీరొయిన్లు ఇద్దరూ చాలా చక్కగా నటించారు... ముఖ్యంగా హీరోయిన్. తన లుక్, డైలాగ్ డెలివరీ, నటన చూస్తే తనకి సినీ ఇండస్ట్రీ లో మంచి ఫ్యూచర్ ఉందనిపిస్తుంది. ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్ తననే చెప్పుకోవాలి. కొన్ని మెటాఫర్స్ ని చాలా చక్కగా చిత్రీకరించారు. మ్యూజిక్ బాగా ఆకట్టుకుంటుంది, ముఖ్యంగా నేపథ్య సంగీతం, సినిమాలో ఉండే రెండు పాటలు చాలా ఒరిజినల్ గా ఉన్నాయి. ‘మెరిసే’ పాట షార్ట్ ఫిల్మ్ అయిపోయాక కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. క్లైమాక్స్ మంచి ఫీల్ ను తెప్పిస్తుంది!

మైనస్ పాయింట్స్-

కామెడీ ఫోర్స్ ఫుల్ గా చేసినట్టు అనిపిస్తుంది. టైటిల్ ‘క్షణం ఒక యుగమే’ అని కాకుండా ఇంకా యాప్ట్ ఫుల్ టైటిల్ పెట్టుంటే, ఒక రేంజ్ కి చేరుకునేది. అక్కడక్కడ ఎడింటింగ్ ఇంకొంచెం క్రిస్ప్ గా ఉండొచ్చు.

సాంకేతికంగా-

ఫ్రీగా కదిలే కెమెరా మూమెంట్స్ ప్రేక్షకులని కథలో బాగా ఇన్వాల్వ్ చేస్తాయి. ప్రతి ఫ్రేమ్‍ను కలర్‍ఫుల్‍గా చూపించే ప్రయత్నం చేసిన కెమెరామెన్ రాహుల్‍ని అభినందించాల్సిందే.  మేకప్, కాస్ట్యూమ్స్ షార్ట్ ఫిల్మ్ కి పర్ఫెక్ట్ గా మేచ్ అయ్యాయి, ముఖ్యంగా హీరోయిన్‍కి. అక్కడక్కడ చిన్న చిన్న జెర్క్స్ ను పక్కనపెడితే ఎడిటింగ్ అబ్సొల్యూట్లి పర్ఫెక్ట్.

మొత్తంగా-

యాభై నిమిషాల నిడివి ఉన్నా, క్షణంలో అయిపోయిందని అనిపించే ఓ మంచి సినిమా!

అంకెలలో-

3.5 / 5

 

LINK :

https://www.youtube.com/watch?v=laAGQ2bQylE

 

మరిన్ని శీర్షికలు
mrutyukeli