Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

21 - 12 -2018 నుండి 27-12-2018 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం పెద్దలతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటె చాలు. ఉద్యోగంలో బాగుంటుంది , ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబంలో గతంలో చేసిన ఆలోచనలను అమలుచేసే ప్రయత్నం చేయుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ద తీసుకోవడం సూచన. చిన్న చిన్న విషయాలకే అదికంగా ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి.

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆత్మీయులను కలుసుకునే అవకాశమా ఉంది , వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. విదేశాల్లో ఉన్న మిత్రులు మిమ్మల్ని పొగిడే అవకాశం ఉంది, కాస్త ఈ విషయాల్లో జాగ్రత్త అవసరం. సంతానం నుండి మీకు ఆశించిన మేర సహకారం లభ్సితుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. పెద్దలతో మీకున్న పరిచయం లబ్దిని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడం మంచిది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. మీ మొండితనమే మీకు శ్రీరామరక్ష. మితులతో ఆర్థికపరమైన లావాదేవీలు చేయుటకు అవకాశం ఉంది.

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, తోటివారి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సంతానం గురుంచి నూతన ఆందోళన మొదలయ్యే అవకాశం ఉంది, కాస్త అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి.


సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

  ఈవారం ఆరంభంలో బాగాఉంటుంది, కాని మీ ఆలోచనలో స్పష్టత లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర అనవసరమైన చర్చలకు దూరంగా ఉండుట సూచన. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి, అలాగే కాస్త పనిభారం పెరుగుటకు ఆస్కారం ఉంది. విధేశీప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం , స్వదేశానికి వచ్చే అవకాశం కూడా ఉంది.

 

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆలోచనలు చాలామందికి నచ్చుటకు అవకాశం ఉంది. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో మీకు రావాలిసిన ధనం సమయానికి చేతికి అందుతుంది. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యక్రమాల విషయాల్లో చర్చలు జరుగతాయి. బంధువులను కలుస్తారు, వారితో సమయం సరదాగా గడుపుతారు.  

 

 


తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

 ఈవారం పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. చిన్న చిన్న తప్పుల వలన అధికంగా నష్టపోతారు. గతంలో మీరు వ్యవహరించిన తీరు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తుంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, అధికారుల నుండి మన్ననలు పొందుతారు. సంతానం గురుంచి అధికంగా ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది.

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. సోదరులతో అనుకోకుండా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది , కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ మాటతీరు చాలామందికి నచ్చక పోవచ్చును. విలువైన వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. రుణపరమైన విషయాల్లో శక్తిని గుర్తుపెట్టుకోండి.  

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం సమయాన్ని అధికంగా చర్చలకు ఇస్తారు , పెద్దాలతో కలిసి మీ ఆలోచనలు పంచుకుంటారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుటకు  శ్రమ పడే అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆత్మీయుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి.

 

 


మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

 ఈవారం సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయుటకు ఆవకాశం ఉంది, ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. గతంలో చేపట్టిన పనుల వలన మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. తండ్రి లేదా తండ్రి తరుపు బంధువుల ఆరోగ్యం విషయంలో ఒకింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది, ఇబ్బందులు పొందుతారు. కోపాన్ని తగ్గించుకోండి , మంచిది.

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం కుటుంబంలో మీ ఆలోచనలు సభ్యులకు తెలియ జేస్తారు. చర్చల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు శ్రమించాల్సి వస్తుంది. అనుభవజ్ఞుల సూచనలు తీసుకోండి. ఉద్యోగంలో అధికారులతో మాటపట్టింపులకు వెళ్ళకండి. వ్యాపారంలో పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. అనుకోకుండా విదేశీ ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. మిత్రులనుండి సహకారం పొందుటకు అవకాశం ఉంది.

 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం ఆత్మీయులను కలుస్తారు, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. చేపట్టిన పనులను మిత్రుల సహకారంతో పూర్తిచేస్తారు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుతాయి. గత కొంతకాలంగా కుటుంబంలో ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. చర్చాపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ధనం కొంత చేతికి అందుతుంది , కాకపోతే ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన.

 

 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

 
మరిన్ని శీర్షికలు
tamilnadu