Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
mamidikaya - prawns

ఈ సంచికలో >> శీర్షికలు >>

శతపాదమ్ - నాని గుంటూరు

భోజనం చేసిన తరవాత "శతపాదమ్" వేయాలని ఒక సూక్తి వుంది!  "శతపాదమ్" అంటే వంద అడుగులు నడవాలని పెద్దలు చెప్పారు. సైన్స్ ప్రకారం కూడా తిన్న పదార్థాలు జీర్ణం అవ్వటానికి "శతపాదమ్" ఎంతో దోహదపడుతుంది.

ఈ కాలంలో ఆఫీసుల్లో మధ్యాహ్న భోజనం (లంచ్) ఎవరి టేబుల్స్ దగ్గర వాళ్ళు ఆరగించడం, రాత్రి భోజనం (డిన్నర్) చేసి వెంటనే పడుకోవటం లాంటివి మార్చుకుని కనీసం ఒక్క 5నిమిషాలు వెచ్చించినా తిన్నది వంటబట్టి, ఆరోగ్యంగా వుంటారు.

మద్యం సేవించేవారు రాత్రుళ్ళు మత్తులో తినేసి వెంటనే పక్కపై వాలిపోతుంటారు. ఎంత మత్తులో వున్నా "శతపాదమ్"  వేస్తే పొట్ట రాకుండా వుంటుంది.

"శతపాదమ్ భవతి". 

మరిన్ని శీర్షికలు
Peace Tour in Afghanistan by Dr. Ghazal Srinivas