తమిళ హీరో విశాల్ వాస్తవానికి తెలుగబ్బాయే అయినా, తమిళంలో హీరోగా స్టార్‌డమ్ సంపాదించాడు. అక్కడ నటుడిగా, నిర్మాతగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే, విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడని ఇటీవల ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తై అనీశాతో విశాల్ వివాహం జరగనుంది.
ఈ అనీషా ఎవరో కాదు. 'పెళ్లిచూపులు', అర్జున్‌రెడ్డి' సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మే. విశాల్ ఆటిట్యూడ్ తనకెంతో నచ్చిందనీ, విశాల్‌తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాననే విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది అనీషా. త్వరలో జరగనున్న విశాల్, అనీషాల ఎంగేజ్‌మెంట్‌కి హైద్రాబాద్ వేదిక కానుందనీ, వీరిద్దరి పెళ్లి కూడా హైద్రాబాద్‌లోనే జరగనుందని విశాల్ తండ్రి తెలిపారు. విశాల్ ఇటీవల 'పందెంకోడి 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళంలో స్టార్ హీరో అయినా కానీ తెలుగమ్మాయిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం, హైద్రాబాద్‌లోనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకోవడం విశేషం.
|