మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రం నుండి తాజాగా తమిళ నటుడు విజయ్ సేతుపతి ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పోరాట యోధుడిగా చేతిలో కత్తితో చురుకైన చూపులతో కనిపిస్తున్నాడు ఈ లుక్‌లో విజయ్ సేతుపతి. 'రాజా పాండి' అనే ఈ పాత్ర సినిమాకి కీలక పాత్రల్లో ఒకటి. కాగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట్లో సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నా, ఈ ఏడాదిలోనే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్, నరసింహారెడ్డికి గురువుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర దాదాపు సినిమా చివరి వరకూ కొనసాగుతుందట. అలాగే జగపతిబాబు, బ్రహ్మాజీ, కన్నడ నటుడు సుదీప్ తదితర నటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనాలు అందుకుంది. ఎప్పుడెప్పుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా.? అని అభిమానులు ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.
|