శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లీడర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ రీచా గంగోపాధ్యాయ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. సినిమాల్లో హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే సినిమాలకు దూరమైంది. చేసినవి తక్కువ సినిమాలే అయినా, స్టార్ హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రబాస్‌తో 'మిర్చి' సూపర్ హిట్ మూవీ కాగా, రవితేజతో నటించిన 'మిరపకాయ్' సక్సెస్ కూడా ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఉన్నాయి. నాగార్జునతో 'భాయ్' చిత్రం తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఉన్నత చదువులు పేరు చెప్పి విదేశాలకు వెళ్లిపోయింది.
ఛాన్సొచ్చినా తర్వాత సినిమాల్లో నటించేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ అప్పుడప్పుడూ తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో అప్‌డేట్స్ ఇస్తూ వచ్చింది. అలాగే తాజాగా తన పెళ్లి వార్తను కూడా అభిమానులతో పంచుకుంది. బిజినెస్ స్కూల్‌లో తనకు పరిచయమైన జోయ్ అనే వ్యక్తిని వివాహమాడబోతున్నట్లు రీచా పేర్కొంది. ఆల్రెడీ జోయ్‌తో రిచా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇంకా ముహూర్తం ఫిక్స్ కాలేదు కానీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని రీచా తెలిపింది. తెలుగుతో పాటు, రీచా తమిళ, బెంగాలీ సినిమాల్లోనూ నటించింది.
|