Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Facts About Cow

ఈ సంచికలో >> శీర్షికలు >>

దూరంచేసుకోవటం ఎలా - ..

How to distance?

ఆధ్యాత్మిక మార్గంలో నాకెదురయ్యే తికమకలను నేను దూరంచేసుకోవటం ఎలా?

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, ఒక స్థాయి భ్రాంతులన్నిటినీ వదిలించుకొని మరొక స్థాయి భ్రాంతులను పట్టుకోవటం కాదు. అది అన్ని భ్రాంతులనూ, భ్రమలనూ పూర్తిగా వదిలివేసి సత్యంలో జీవించటానికి. ఈ ప్రయత్నమంతా సత్యాన్వేషణ గురించిన ప్రయాసే కదా!

సత్యం అంటే యథార్థంగా ఉన్న వాస్తవానికి సంబంధించింది. మీ మనసులో మీరు ఊహించి పెట్టుకొన్నది గాదు. నా మనసులో నేను ఒక దేవుడినో, దయ్యాన్నో ఊహించి పెట్టుకోవచ్చు. కానీ ఆ రెండు ఊహలలో దేనికీ సత్యంతో సంబంధం ఉండదు. మీరు మీ మనసులో ఊహించుకొనేవన్నీ మీరు అలవాటు పడిన సంస్కృతికీ, సంస్కారానికీ సంబంధించినవి. మీరు మనుషులను చూస్తున్నప్పుడు మీకు వాళ్ళు దేవుడులాగా కనిపిస్తున్నారా, దయ్యం లాగా కనిపిస్తున్నారా అన్నది, మీరు ఆశావాదం వైపు మొగ్గుతారా, నిరాశ వాదం వైపా అన్న దాని మీద ఆధారపడే విషయం. దానికి యథార్థంతో, 'అసలు సత్యం' తో సంబంధం ఉండదు. 'అసలు సత్యం' ఏమిటి? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఇక్కడ ఏం పెద్ద ఘన కార్యం సాధించటానికి అవతరించినట్టో మీకే తెలియదు. ఎక్కడినుంచి ఊడిపడ్డారో అంతకంటే తెలియదు. ఇక్కడినుంచి ఎక్కడికి వేంచేస్తారో అదీ తెలియదు! జీవితం గురించిన అసలైన సత్యం అది!

నిస్పృహ, నిరీహ (Hopelessness)

కొన్ని మతాలు ఏవేవో ఆశలు కల్పిస్తూ ఊరిస్తూ ఉంటాయి. ఈ ఆశా పాశంలో చిక్కటం మనిషి ఎదుర్కొనే దురవస్థల్లో అధమమైంది. ఆశ పుట్టిందంటే, మీరు మీ భవిష్యత్తు గురించి లేనిపోని ఊహలూ స్వప్నాలలో మునిగిపోతారు. ' ప్రస్తుతం నా పరిస్థితి ఏమంత బాగా లేదు. అయినా ఏమీ ఫరవాలేదు. నేను మంచి వాడిని. పైగా పేదవాడిని. అందువల్ల నేను ఎలాగూ స్వర్గానికి పోబోతున్న వాడిని కదా ! అక్కడ నేరుగా దేవుడి ఒడిలోనే నా స్థానం సిద్ధంగా ఉంటుంది !' అని ఇలా ఏవేవో భావనలలో ఉంటారు. ఇదే ఆశ అంటే.

ఎవరయినా మీకు కొంత ఆశ చూపగలిగారంటే, ఇక మీకు మీరే తోచినవన్నీ ఊహించేయటం మొదలుపెడతారు. ఆశ అంటే అబద్ధాల సృష్టికి సోపానం. మీరు ఆశలకు దూరంగా, ఆనందమయంగా ఉండగలిగితే, అదీ అసలు గమ్యం. ఆ గమ్య స్థలంలో మీకు ఆశలతో పని లేదు. బాహ్య ప్రపంచంలో ఏమి జరిగినా, ఏది వచ్చినా పోయినా మీకు ఒకటే. మీకు, అంతర్గతంగానే, లభించవలసింది ఏదో కొంత లభించింది.

 

మీరు మాత్రం, లేనిపోనివేవేవో, మంచివో చెడ్డవో, మీ మనసులో ఊహించేసుకోకుండా కాస్త గట్టిగా నిలబడగలగాలి. మీరు దేవుడినీ సృష్టించుకోవద్దు, దయ్యాలనూ సృష్టించుకోవద్దు. స్వర్గాన్నీ ఊహించుకోనక్కరలేదు, నరకాన్నీ ఊహించుకోనక్కరలేదు. మంచీ చెడూ అని ఏవేవో భ్రమలు కూడా అక్కరలేదు.

 

సత్యమేదో తెలుసుకొని, ఆ ఎరుకతో ఎలా జీవించాలో నేర్చుకోవటం అన్నిటికంటే ముఖ్యమైన విషయం. అసలు అది తప్ప మనం చేయవలసిన పని అంటూ వేరే ఏదీ లేదు. యథార్థాలను మీ మనసు ద్వారా వక్రీకరించు కోకుండా, ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగారంటే, మీరు ముక్తికి ఒక్క మెట్టు దూరంలోకి వచ్చేసినట్టే. మీరేమీ చేయనక్కరలేదు. చేయాల్సిందేమన్నా ఉంటే, కాలమే చేసేస్తుంది. కాలమే మీకు పరిణతిని సమకూర్చి మిమ్మల్ని చేరవలసిన చోటికి చేరుస్తుంది.

మీరు మాత్రం, లేనిపోనివేవేవో, మంచివో చెడ్డవో, మీ మనసులో ఊహించేసుకోకుండా కాస్త గట్టిగా నిలబడగలగాలి. మీరు దేవుడినీ సృష్టించుకోవద్దు, దయ్యాలనూ సృష్టించుకోవద్దు. స్వర్గాన్నీ ఊహించుకోనక్కరలేదు, నరకాన్నీ ఊహించుకోనక్కరలేదు. మంచీ చెడూ అని ఏవేవో భ్రమలు కూడా అక్కరలేదు. ' ఈ మనిషిని నేను ఇష్టపడతాను, ఈ మనిషిని ఇష్టపడను' - ఇలాంటి ఏదీ లేదు. ప్రతి విషయాన్నీ అది యథార్థంగా ఎలా ఉందో అలా చూడగలిగితే, అంత వరకు చాలు. కొన్ని సమయాలలో సాధారణ లోక వ్యవహారాల అవసరాల మేరకు మీరు ఇలాంటి భిన్నత్వాలను గుర్తిస్తే గుర్తిస్తారేమో. కానీ మిగతా సమయాలన్నింట్లో, మీరు విషయాలను అవి యథార్థంగాఎలా ఉన్నాయో అలాగే చూడగలిగితే చాలు.

తరవాతి మజిలీ: పారమార్థిక సత్యం!

విషయాలను యథార్థంగా ఎలా ఉన్నాయో అలా చూడగలిగితే, జీవ చైతన్యమంతా ఇక ఈ రూపంగానూ, ఆ రూపం గానూ కనిపించదు. విశ్వమంతా వ్యాపించి పోయిన ఒక విస్ఫోటన శక్తిలా ఆవిష్కృతమౌతుంది. ఈ బ్రహ్మాండమంతా ఒక జీవశక్తి ప్రకాశితమైన, సజీవమైన బ్రహ్మాండం. 'ఇది జీవం, ఇది నిర్జీవం, ఇది ప్రాణి, ఇది అప్రాణి, ఈమె స్త్రీ, ఇతగాడు పురుషుడు ' - ఇలాంటి నామ రూపాలుగా గుర్తించటం మీరు మానేస్తే, మీకు కనిపించే సత్య స్వరూపం అది. ప్రతీ విషయాన్నీ కేవలం ఉన్నదున్నట్టుగా దాని యథార్థ రూపంలో చూడండి.

 

విషయాలను యథార్థంగా ఎలా ఉన్నాయో అలా చూడగలిగితే, జీవ చైతన్యమంతా ఇక ఈ రూపంగానూ, ఆ రూపం గానూ కనిపించదు. విశ్వమంతా వ్యాపించి పోయిన ఒక విస్ఫోటన శక్తిలా ఆవిష్కృతమౌతుంది… ప్రతీ విషయాన్నీ కేవలం ఉన్నదున్నట్టుగా దాని యథార్థ రూపంలో చూడండి.

 

బ్రహ్మాండం అనే ఒక అఖండ జీవ శక్తిలో మీరు భాగం అయిపోయినప్పుడు, మీకు జీవితం మరో విధంగా కనిపిస్తుంది. అంటే అత్యంత సుందరంగా కనిపిస్తుందనా? కాదు! చాలా వికారంగా కనిపిస్తుందనా? అదీ కాదు. మరి ఎలా కనిపిస్తుంది? జీవితం ఎలా ఉన్నదో సరిగ్గా అలా కనిపిస్తుంది! ఈ రూపంగా, ఆ రూపంగా కాదు, ఎలా ఉన్నదో సరిగ్గా అలాగా! అసలు ఈ బ్రహ్మాండంలో ఎప్పుడూ ప్రతిదీ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది, కానీ మీ మనసు మాత్రం ప్రతిదాన్నీ కొంత వక్రీకరించి వంకర టింకరగా చూస్తుంది. ఆ వక్రీకరణలన్నీ నిలుపుచేసి, కేవలం ఉన్న దాన్ని ఉన్నట్టుగా చూస్తే, మీకు కనిపించేది ఒక జీవ శక్తి విస్ఫోటం. మీరు ఇక్కడే పది లక్షల సంవత్సరాలుండి దీన్ని పరిశీలన చేసేందుకు నిర్విరామంగా తీవ్రమైన కృషి చేసినా, ఆ కృషి అంతా ఒక పైపై అవగాహనకు మాత్రమే సరిపోతుంది.

ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులు ఈ విశ్వం ఒక నిత్య ప్రవర్ధమానమైన విశ్వం (ever expanding universe) అంటారు. సారాంశ రూపంగా వాళ్ళు చెప్పేదేమిటంటే ఈ విశ్వాన్ని గురించి ఎలాంటి తుది నిర్ధారణాలూ సాధ్యమే కావని. ఓ పక్క భౌతిక శాస్త్రం అధ్యయనం చేస్తూ, మరో పక్క ఇలాంటి బోధన చేయటం విచిత్రమే. ఈ విశ్వరూపం పూర్తి చిత్రాన్ని వాళ్ళు పరిశీలన చేస్తున్న విధానంలోనే ఏదో ఒక దోషమూ, అపరిపూర్ణతా ఉన్నాయని వాళ్ళు ఇప్పుడు గుర్తించగలుగుతున్నారు.

కనక ఈ ప్రపంచాన్ని గురించి 'ఇదం ఇత్థం'(ఇది ఇలా ఉంటుంది) అనేది ఏమీ లేదు. ఎంతసేపు పరిశీలించినా మన అవగాహన పరిపూర్ణం కాదు. అసంపూర్ణ అవగాహన గానే ఉండిపోతుంది. నిజానికి 'ఈ 'ఇదం ఇత్థం' అనేది ఏదో పూర్తిగా అర్థమైందనుకోండి. ఇక ఆ తరవాత ఏం చేస్తారు చెప్పండి? మీరు ఒక విషయం జాగ్రత్తగా గ్రహించాలి. మీరు 'సత్యం' అనే మజిలీ చేరుకొన్నారంటే, అక్కడ 'ఇదం ఇత్థం ', ఇది ఇలాగా, అది అలాగా అనే నిర్ధారణలు ఏవీ ఉండవు. ఈ నిర్ధారణాలూ, నిర్ణయాలూ మీ మనసులో జరిగేవి, పారమార్థిక జగత్తులో ఉండేవి కావు. నిర్ణయాత్మకంగా ఉండాలన్న తపన మనసుకు సంబంధించింది. దానికి ఎప్పుడు, 'ఈ అధ్యాయం ముగించాను. ఇది నాకు పూర్తిగా అవగతమైంది!' అని ఎప్పటికప్పుడు ఒక నిర్ణయాత్మకమైన ముగింపు కావాలి. కానీ జీవం అలాఉండదు అది ఏ పరిమితులూ ఎరగని శక్తి. అదే దాన్లో ఉన్న సొగసు.

మరిన్ని శీర్షికలు
Dr. ghajal Srinivas