Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కవితలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

poems

జీవితం విలువ

జీవితాన్ని కాచి వడబోసానంటావు

అనుభవంతో తల పండిందంటావు

సమస్యలతో అల్లాడే మనిషికింత సాయం చెయ్యవు

బాధల్లో ఉన్న వారికి అభయమవ్వవు

నీ అనుభవాన్ని యువతకు మార్గంగా పరచవు

నీ పెద్దరికాన్ని ఆకాశమంత పరచుకున్న వటవృక్షం చేసి

ఎవరికీ నీడనివ్వవు

పెద్దతనమంటే కేవలం ముదిమికి చేరువైన కాల గమనం కాదు

అది అందరికీ ఆసరా కావాలి

బతుకులకు భరోసా అవ్వాలి

ఇది తెలుసుకోకుంటే

నీ సుదీర్ఘ జీవితం విలువ శూన్యం!

మరిన్ని శీర్షికలు
pratapabhavalu