కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'ని సమంత లీడ్ రోల్‌లో 'ఓ బేబీ' టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అరవయ్యేళ్ల బామ్మ ఫోటో స్టూడియోకెళ్లి ఎలా టీనేజ్ గాళ్‌గా మారిపోయిందనేది ఈ సినిమా కథ. ఈ టీనేజ్ బామ్మ పాత్రలోనే సమంత నటిస్తోంది. అందరికీ తెలిసిందే. అయితే, మన బామ్మ గారికి ఈ సినిమాలో ఓ బెస్ట్ ఫ్రెండూ, ఓ ఇష్టమైన కొడుకూ, ఓ టీనేజ్ మనవడూ ఉన్నారు మరి. అక్కడికే వచ్చేస్తున్నాం. మనవడు అంటున్నారు.. ఆ మనవడు పాత్ర పోషిస్తున్నదెవరబ్బా అని క్వశ్చన్ చేయకండి.. ఆన్సర్ విత్ డీటెయిల్స్ చెప్పేస్తున్నాం కంగారు పడకండి. అబ్బాయి పేరు తేజ. వయసు 'టీనేజ్' అంతే.. ఇక అడక్కండి. అయితే తేజ అంటున్నారు ఎవరీ తేజ అంటే.. అదేనండీ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ తేజ. 'ఇంద్ర', 'చూడాలని ఉంది', 'కలిసుందాం రా'.. తదితర కొన్ని చిత్రాల్లో హీరో పాత్రలకు చిన్నప్పటి పాత్రలు పోషించాడు.
హీరోకి కొడుకు పాత్రలు పోషించాడు.. ఆ కుర్రోడే ఇప్పుడు టీనేజ్‌కొచ్చాడు. ఈ టీనేజ్ కుర్రాడే 'ఓ బేబీ'లో సమంతకు మనవడి పాత్ర పోషిస్తున్నాడు. అప్పుడు చబ్బీ చీక్స్, డింపుల్ చిన్ అన్నట్లుగా క్యూట్‌గా ఉన్నాడు. టీనేజ్‌కొచ్చాడు కదా.. ఇప్పుడు కాస్త ఫిట్‌గా తయ్యారయ్యాడు. ఈ ఫిట్ బాడీతో త్వరలో హీరోగానూ డెబ్యూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడులెండి. అయితే, అంతకు ముందే, 'ఓ బేబీ'తో ఈ క్యూట్ బోయ్ ఎంట్రీ జరిగిపోతోందన్నమాట. ఇటీవల విడుదలైన 'ఓ బేబీ' పోస్టర్‌లో ఈ టీనేజ్ బోయ్‌ని చూసి, ఎవరీ కుర్రాడు..? చాకులా ఉన్నాడే.. అనుకున్నారు కానీ, గుర్తు పట్టడం ఎవ్వరి వల్లా కాలేదు మరి. ఇక ఇప్పుడు వీజీగా గుర్తు పట్టేయొచ్చు. కావాలంటే ఇంకోసారి ఆ పోస్టర్ చెక్ చేసుకోండి. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఓ బేబీ' జూలైలో విడుదలకు సిద్ధంగా ఉంది. సీనియర్ నటి లక్ష్మీ కీలక పాత్ర పోషిస్తోంది. నాగశౌర్య, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|