Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
something special

ఈ సంచికలో >> సినిమా >>

దొరసాని': ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అవుతుందా.!

old is gold

గతంలో చాలా చాలా రాజు - పేద ప్రేమకథలు తెరపై ఆవిష్కృతమయ్యాయి. కొన్ని విజయాలు అందుకున్నాయి. మరికొన్ని ఘన విజయాలు అందుకున్నాయి. ఇంకొన్ని పరాజయాల పాలయ్యాయి కూడా. అయితే, నయా ట్రెండ్‌లో నయా మూవీగా వస్తోన్న మరో రాజు - పేద స్టోరీ 'దొరసాని'. పేరులోనే ఫీల్‌ ఉంది. సినిమాలోనూ కొత్త ఫీల్‌ ఇచ్చేందుకు ట్రై చేశారు. 'రౌడీ స్టార్‌' విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ, జీవితా రాజశేఖర్‌ దంపతుల చిన్న కుమార్లై శివాత్మిక జంటగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ రెస్పాన్స్‌ చూసి టీజర్‌ కూడా వదిలారు. టీజర్‌ వదిలాక కథ రివీల్‌ అయిపోయింది. కానీ, కొత్త తారాగణంతో సరికొత్త స్క్రీన్‌ప్లేతో 'దొరసాని'ని ధియేటర్స్‌లో లాంఛ్‌ చేయనున్నారు. రిలీజ్‌ డేట్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదు, కానీ, త్వరలోనే విడుదల కానుంది 'దొరసాని' సినిమా. ఓ పల్లెటూరు, ఆ ఊరిలో రాజు అనే పేద కుర్రోడు..

ఊరి పెద్ద కూతురు దొరసానిని ప్రేమిస్తాడు. దొరసానమ్మ కూడా రాజు ప్రేమకు దాసోహం అంటుంది. ఇంకేముంది, రాజు ప్రాణాల మీదికొస్తుంది. తర్వాత ఏం జరగింది.? అంటే 'దొరసాని' చూడాల్సిందే. టీజర్‌లో పిక్చరైజేషన్‌ బాగా చూపించారు. తెలంగాణా యాసలో సినిమాకి డైలాగులు రచించారు. హీరో, హీరోయిన్లు కొత్తవాళ్లు కావడంతో ఆ ఫ్రెష్‌నెస్‌ సినిమాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే ఫ్రెష్‌నెస్‌ సినిమా అంతా కంటిన్యూ చేస్తారో లేదో తెలీదు కానీ, యూత్‌కి కనెక్ట్‌ అవుతుందో లేదో తెలియాలంటే సినిమా రిలీజయ్యేంతవరకూ ఆగాల్సిందే. 

మరిన్ని సినిమా కబుర్లు
BALA 'BALLA' BALA .. you can do it!