బ్యాంక్ మేనేజర్: అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా! ఎందుకలా!
వీరబాహు: నిన్న రాత్రి ఎవరో నన్ను హత్య చేసినట్లు కల వచ్చింది.
మేనేజర్: దానికీ అకౌంటుకీ ఏంటి సంబంధం?
వీరబాహు: ‘మీ కలలను నిజం చేస్తాం’ అని కదా మీ స్లోగన్.
*****
ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసేందుకు ఇంటర్వ్యూకి వెళ్లింది జూలీ.
‘ఇంతకు ముందు నేను ఫలానా హోటల్లో ఐదేళ్లు పనిచేశాను సర్!’ అని గొప్పగా చెప్పింది.
‘నువ్వు అక్కడ పనిచేశావని చెప్పడానికి రుజువేంటి!’ అడిగాడు యజమాని.
‘రుజువులు లేకేం! మా ఇంట్లో ఉన్న చెంచాలన్నీ అక్కడివే!’ అనేసి నాలుక కరుచుకుంది.
*****
బంటి: నేనో రాజకీయ నాయకుడి దగ్గరకు వెళ్లాను. తను నా సమస్యలన్నీ సావధానంగా విన్నాడు. అక్కడికక్కడే వాటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులను జారీ చేశాడు.
చంటి: వావ్ గ్రేట్.... తర్వాత ఏం జరిగింది.
బంటి: ఏం జరుగుతుంది.... మెలకువ వచ్చింది.
*****
సురేష్ ఫేస్‌బుక్ వాల్ మీద వాళ్ల నాన్నగారు ఇలా రాశారు... ‘బాబూ ఇప్పటికైనా నీ కంప్యూటర్ షట్‌డౌన్ చేసి గదిలోంచి బయటకి రా! నిన్ను చూసి రెండు రోజులైపోయింది. ఇవాళైనా కలిసి భోజనం చేద్దాం’. సురేష్ మనసు కరిగిపోయింది. ఓ లైక్ కొట్టి, బ్రౌజింగ్ కొనసాగించాడు.
*****
ఎప్పుడూ చేపల మార్కెట్‌లాగా ఉండే ఆఫీసులో ఆ రోజు శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ‘ఇవాళ ఎందుకింత నిశ్శబ్దంగా ఉంది?’ ఆశ్చర్యంగా తన పీఏని అడిగాడు ఆఫీసరు.
‘ఇవాళ ఆఫీసులో అందరూ వచ్చారండీ. ఇంక ఎవరి గురించి మాట్లాడుకుంటారు పాపం!’ బదులిచ్చాడు పీఏ.
..
|