Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

యువతరం కథలపోటీ ఫలితాలు - ..

గోతెలుగు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యువతరం కథల పోటీకి కొత్త, పాత అని తేడా లేకుండా ఎందరో రచయితలూ, రచయిత్రులూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అద్భుతమైన కథలను అందించారు....ఈ పోటీకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన సినీ దిగ్గజాలు శ్రీ రాజ్ కందుకూరి గారు, శ్రీ మధుర శ్రీధర్ గారు తమ విలువైన సమయాన్ని కేటాయించి వాటిల్లోంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రత్యేక బహుమతులకు తగిన కథలనెంపిక చేసారు.

ఈ మూడు + 10 కథల విజేతలకు బహుమతుల చెక్కులను, ప్రశంసా పత్రాలను పంపడం జరిగింది. ఇవి కాక మరో 13 కథలను సాధారణ ప్రచురణకు స్వీకరించడం జరిగింది. బహుమతి పొందిన కథల ప్రచురణ, వాటి తర్వాత సాధారణ కథల ప్రచురణ ప్రారంభిస్తున్నాం.  బహుమతి విజేతలకు శుభాభినందనలు, పాల్గొన్నవారందరికీ అభినందనలు, ధన్యవాదాలు. నిష్పక్షపాతంగా బహుమతుల ఎంపికకు సహకరించిన రాజ్ కందుకూరి గారికీ, మధుర శ్రీధర్ గారికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ...


ప్రథమ బహుమతి 10,000/-:  అనగనగా ఒకడుండేవాడు - డా.ఎం .సుగుణారావు
ద్వితీయ బహుమతి 5,000/- ఇదే ధ్యేయం ఇదే గమ్యం - వారణాసి రామకృష్ణ   
తృతీయ బహుమతి 3,000/- :  ఏ సక్సెస్ టేల్ ఆఫ్ ట్రాన్స్ జెండర్స్ - ప్రతాప వెంకట సుబ్బరాయుడు 
 
10  ప్రత్యేక బహుమతులు 1000/- చొప్పున  

ఔను అతను చదువును ఇష్టపడ్డాడు - ఎంవీ రామిరెడ్డి 
పప్పుసుద్ద - సరసి
మూర్తిగారబ్బాయి - రాజేష్ యాళ్ళ
రోల్ మోడల్ - కొత్తపల్లి ఉదయబాబు
వేరే మెట్టు - కళాగీత
ముఖపుస్తకం - డేగల అనితాసూరి
తల్లివేరు - బలభద్రపాత్రుని ఉదయశంకర్
చాలెంజ్ - కర్రానాగలక్ష్మి
ప్రేమనేర్పిన పాఠం - నామని సుజనాదేవి
యువభారతం - మధురాంతకం మంజుల

 

సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు :

పెళ్ళికూతురు అలిగింది - జి.ఎస్.లక్ష్మి
మనసులో అడుసు - పోడూరి వెంకటరమణశర్మ
వృత్తిదేవోభవ  - శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
భయం భయం - పద్మావతి రాంభక్త
సమాజంలో ఒకరు - ఓట్ర ప్రకాష్ రావు
ముందడుగు - శింగరాజు శ్రీనివాస రావు
 కనువింపు - శివరామప్రసాద్ వక్కలగడ్డ
కొండమలుపు - పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ
అసాధారణం - కొయిలాడ రామ్మోహన్ రావు
అమ్మ నాన్న ఓ కథ ముల్లా జమాల్ బాషా
యువతా మేలుకో - చిన్నికృష్ణ(శివే మాధవ)
శయనేషు రాణి - సి. యమున
నూకలిస్తే -  బేతంచర్ల సూర్య ప్రకాష్   

ఈ జాబితాలో తమ కథలు లేని రచయిత(త్రు)లు వారు పోటీకి పంపిన కథలను వేరే పత్రికలకు పంపుకోవచ్చు....

మరిన్ని శీర్షికలు
pratapabhavalu