Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ వారం ( 19/7- 25/7 ) మహానుభావులు.

వర్ధంతులు

జూలై 21

శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావు : వీరు జూలై21, 1923 న  బందపురం లో జన్మించారు.  అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర  సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. వీరు రాసిన, “ తెలుగు నాటక వికాసము “ అనే గ్రంధాన్ని ప్రామాణికంగా పరిగణిస్తారు.

జూలై 22

1.శ్రీ దాశరధి కృష్ణమాచార్య :  వీరు జూలై 22, 1925 న చిన్నగూడూరు లో జన్మించారు.  దాశరధి గా ప్రసిధ్ధులు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించిన ఘనుడు. అనేక సినిమా గీతాలని కూడా రచించారు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు.

2. శ్రీమతి రాగతి పండరీ బాయ్ : వీరు జూలై22, 1965 న విశాఖపట్టణం లో జన్మించారు. ప్రముఖ వ్యంగ్య చిత్రకారిణి. తెలుగు వ్యంగ్యచిత్రరంగంలో, హేమాహేమీల సరసన సమాన స్థాయిలో నిలబడిన ఏకైక మహిళ.

 

జూలై 23

శ్రీ రాయసం వెంకట శివుడు : వీరు జూలై 23, 1870 న , ఇరగవరం లో జన్మించారు. ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకులు, సంఘసంస్కర్త గా పేరుపొందారు.  కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్నరోజుల్లో ఎంతోమంది పేదవిద్యార్ధులకి సహాయం చేసారు.

జూలై 24

శ్రీ మొదలి నాగభూషణ శర్మ : వీరు జూలై 24, 1935 న , దూళిపూడి లో జన్మించారు.. ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, వీరు విమర్శకుడుగా, పరిశోధకుడు గా కూడా పేరు తెచ్చుకున్నారు. వీరు దాదాపు 70 నాటకాలూ, నాటికలూ కూడా రాసారు.

 

వర్ధంతులు

జూలై 21

శ్రీ గిడుగు రాజేశ్వరరావు  :  ఈయన తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు, తెలుగు భాషను మాట్లాడండి. పిల్లలకు నేర్పించండి. అంటూ నిరంతరం సాగించిన ప్రచారం ఆయన భాషా సేవకు నిదర్శనం.. శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి మనుమడు.

వీరు జూలై 21, 2013 న స్వర్గస్థులయారు.

 

జూలై 24

1.శ్రీ గుర్రం జాషువా :  ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి . సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసారు. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డారు.; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు.. “ గబ్బిలం “ వారి రచనలలో సర్వోత్తమయినది.

వీరు జూలై 24, 1971 న స్వర్గస్థులయారు.

 

2.శ్రీ చేకూరి రామారావు :  తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్తగా పిలువబడేవారు.  చే రా  గా అందరికీ సుపరిచితులు. తెలుగు భాషా శాస్త్రంలో చేరా నూతన ఒరవడిని సృష్టించారు. 'చేరాతలు' పేరుతో పత్రికలలో సుదీర్ఘకాలంపాటు ఆయన కొనసాగించిన సాహితీ కాలం అన్నివర్గాల వారిని అలరించింది. చేరా రచించిన 'స్మృతి కిణాంకం' అనే వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. చేరా రాసిన 'సాహిత్య విమర్శ', 'పరామర్శ', 'చేరాతలు', 'రెండు పదులపైన', 'ఇంగ్లిష్-తెలుగు పత్రికా పదకోశం', 'ముత్యాల సరాల ముచ్చట్లు', 'వచన పద్యం' సాహితీ ప్రియులను అలరించాయి..

వీరు జూలై  24 , 2014 న స్వర్గస్థులయారు..

 

జూలై 25

శ్రీమతి కొన్నమనేని అమరేశ్వరి :  వీరు భారతదేశంలో తొలి మహిళా న్యాయమూర్తి. పదమూడు సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో న్యాయమూర్తి గా పనిచేసారు.

వీరు జూలై 25, 2009 న స్వర్గస్థులయారు.

 

 

మరిన్ని శీర్షికలు
chamatkaaram