కావలిసిన పదార్ధాలు: శనగపప్పు (నానబెట్టినది). ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ఉప్పు, కారం, మసాలాపొడి, నూనె
తయారుచేసే విధానం: ముందుగా కుక్కర్ లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలిపి నానబెట్టిన శనపప్పును వేసి కలిపి కొద్దిగా ఉడికిన తరువాత కారం, ఉప్పు, వేసి 2 నిముషాలు మూత వుంచి ఉడకనివ్వాలి. చివరగా మసాలా పొడిని వేయాలి. అంతేనండీ.. రుచికరమైన శనగపప్పు కూర రెడీ..
|