Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue328/836/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

 

(గత సంచిక తరువాయి)....ఇస్లామాబాద్ చేరుకున్న వెంటనే అబ్బాస్ తన సూపీరియర్ దగ్గరకు వెళ్ళి రిపోర్ట్ చేశాడు. రక్షణమంత్రి ఇచ్చిన పార్టీలో జరిగింది మాత్రం అతను చెప్పలేదు. మాములుగా ప్రోటోకోల్ ప్రకారం జరిగింది చెప్పి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తరువాత నలుగురిలో ఇద్దరు వెళ్ళిపోయారు కాని ఇద్దరు మాత్రం వెళ్ళకుండ అక్కడే నిలబడ్డారు. “బ్రిగేడియర్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి “అన్నాడు సెక్యురిటిలో ఒకడు.“ఏమిటి?అడిగాడు బ్రిగేడియర్.సెక్యురిటి ఏం మాట్లాడకుండ తన సెల్ ఫోన్ ఆన్ చేశాడు. అందులో రక్షణమంత్రి పార్టీలో మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆ మాటలు ఎంతో పరుషంగా ఆహంకారపూరితంగా ఉండటంతో బ్రిగేడియర్ మొహం అవమానంతో రగిలిపోయింది. వెంటనే ఆ సెల్ తీసుకుని తన సూపీరియర్ ఆఫీసర్ కల్నల్ దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరు కలిసి ఒకటికి రెండు సార్లు ఆ విడియో క్లిప్పింగ్ చూశారు.“ఎంత ధైర్యం మంత్రి ఇష్టంవచ్చినట్టు మాట్లాడతాడా. మనమేనా చేతికి గాజులు తొడుక్కుని కూర్చుంది”అన్నాడు కల్నల్ “ఈ విషయాన్ని మనం తేలికగా తీసుకోవటానికి వీలులేదు. దీనికి తగిన రిటార్డ్ ఇవ్వాలి”అన్నాడు బ్రిగేడియర్. “అవును ముందు మన మంత్రితో చర్చిద్దాం. ఆయన అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం. తరువాత మన నిర్ణయం చెప్తాం”అన్నాడు కల్నల్. ఇద్దరు ఇంకా కొంచం సేపు మాట్లాడుకున్న తరువాత గదిలోంచి బయటకు వచ్చారు.

వాళ్ళకోసం ఎదురుచూస్తూ సెక్యురిటి ఇంకా అక్కడే ఉన్నాడు. “చాల మంచి సమాచారం ఇచ్చావు. నువ్వు వెళ్ళు నీ సెల్ తరువాత పంపిస్తాం”అన్నాడు బ్రిగేడియర్. సెక్యురిటి స్టిఫ్ గా వాళ్ళకు సెల్యుట్ చేసి వెళ్ళిపోయాడు. వెంటనే  కల్నల్ ఫోన్ తీసి రక్షణమంత్రి పిఏతో మాట్లాడాడు. “నాకు అర్జంటుగా మంత్రిగారితో అపాయింట్ మెంట్ కావాలి. నాతో పాటు బ్రిగేడియర్ కూడా వస్తున్నాడు’ అన్నాడు. ఆ రోజు రాత్రి పదిగంటలకు మంత్రి అపాయింట్ మెంట్ దొరికింది ఇద్దరికి. సరిగ్గా ఆ టైంకు ఆయన ఫారమ్ హౌజ్ లోకి కలుసుకున్నారు.ముగ్గురు స్విమ్మింగ్ పూల్ పక్కన సమావేశం అయ్యారు.ఉపోద్ఘాతం లేకుండ కల్నల్ అసలు విషయానికి వచ్చేశాడు. సెల్ తీసి విడియో క్లిప్పింగ్ చూపించాడు. “మైగాడ్ ఎంత అహంకారం. మనం వాళ్ళతో స్నేహం చెయ్యటానికి చెయ్యి అందిస్తే ఆ చేతినే నరకాలని చూస్తాడా. ఏం చూసుకుని ఆ మంత్రిగాడికి అంత గర్వం”కోపంతో కుతకుతలాడిపోతూ అన్నాడు మంత్రి.“ఇలా మనం చేతులు కట్టుకుని కూర్చుంటే లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ భారత్ ను దెబ్బతియ్యాలి”అన్నాడు కల్నల్.“ఏం చెయ్యాలో మీరే చెప్పండి. పేరుకు మేము మంత్రులం అయిన అధికారం అంతా మీ చేతులలో ఉంది. మీరు ఏం చేసిన నాకేం అభ్యంతరం లేదు.”అన్నాడు మంత్రి.ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాడు కల్నల్. తన ప్లాన్ ఏమిటో మెల్లగా చెప్పటం మొదలుపెట్టాడు.

అయిదు నిమిషాల తరువాత పూర్తిచేసి అన్నాడు.“ఇలా చేస్తే మన ప్రజలు కోపంతో రగిలిపోతారు. దీన్ని మనం అవకాశంగా తీసుకుని ఇండియా మీద యుద్ధం ప్రకటిద్దాం. మనం కొత్తగా  కనిపెట్టిన మిసైల్ ను ఇప్పుడు ప్రయోగించే అవకాశం దొరుకుతుంది.”“దీనికి మన ప్రధాన మంత్రిగారు ఒప్పుకుంటారా”సందేహం వెలిబుచ్చాడు మంత్రి.“ ఆ విషయంలో మీకు ఎలాంటి అనుమానం వద్దు. ఆయనను ఒప్పించే బాధ్యత మాది. ఈ లోగా మీరు చెయ్యవలసినంది చెయ్యండి. మొదట చిన్న నిప్పును రాజేయ్యండి. క్రమంగా అది అగ్నిజ్వాలాగా మారిదేశాన్ని అతలాకుతలం చేస్తుంది. ఆ తరువాత మనం అనుకున్నది తేలికగా జరిగిపోతుంది”అన్నాడు కల్నల్.“ఆ విషయం నాకు విడిచిపెట్టండి అంతా నేను చూసుకుంటాను”ఉత్సాహంగా అన్నాడు మంత్రి.అయిదు నిమిషాలు మాట్లాడిన తరువాత అధికారులు ఇద్దరు బయలుదేరారు. ఇద్దరి మొహాలు ఆనందంతో ఏదో గొప్ప విజయం సాధించినట్టు వెలిగిపోతున్నాయి. ఎలాగు ఇంకా కొన్ని రోజులలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేజిక్కించుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

చిన్న జవాన్లతో సహా అధికారులందరిని తమకు అనుకూలంగా మరల్చుకున్నారు. కాని అంతవరకు ఆగకకముందే ఇప్పుడు ఇద్దరికి ఒక మంచి సాకు దొరికింది. దీన్ని అడ్డంపెట్టుకుని తమ లక్ష్యం పూర్తిచేసుకోవాలని వాళ్ళ ప్లాన్.అదే రోజు రాత్రి భారతరక్షణమంత్రి మాట్లాడిన విడియో క్లిప్పింగ్ వైరల్అయింది. చాల మంది సెల్ ఫోన్ లలో అది అప్ లోడ్ అయింది. యువకులు, యువతు లు, స్టూడెంట్స్ అధికారులు అన్న తేడా లేకుండ అందరి సెల్ ఫోన్ లలో ఆ విడియో వచ్చేసింది. అది చూసిన యువకులు కోపంతో రగిలిపోయారు. కాలేజి స్టూడెంట్స్ అందరు ఒక్కసారిగా ఉవెత్తున లేచారు. భారత్ ను ఇష్టం వచ్చినట్టు  తిడుతూ కాలేజిలను మూయించారు. ఉద్యోగస్ధులు కూడా అదే విధంగా రియాక్ట్ అయి తమ ఆఫీసులోంచి బయటకు వచ్చారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్న తేడాలేకుండ జనం ఉవ్వెత్తున లేచి రోడ్డు మీద పడ్డారు. అదే రోజు రాత్రి సిటిలో పెద్ద గొడవ జరిగింది. కొంతమంది యువకులు ఒక పెద్ మాల్ లోకి వెళ్ళి ఇష్టంవచ్చినట్టు దాన్ని ద్వసం చేశారు. అడ్డుపడిన షాపు సిబ్బందిని ఇష్టంవచ్చినట్టు కొట్టారు.

అదే సమయంలో మరో నాలుగు చోట ఇలాగే ద్వసం జరిగింది. కేవలం ఇస్లామాబాద్ లో మాత్రమే కాకుండ కరాచి ఇంకా పెద్ద పెద్ద సిటిలో గొడవలు మొదలు అయ్యాయి. అన్ని ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టుగా ఒకే టైం లో జరిగిపోయాయి. సందటిలో సడేమియాలా కొంత మంది గూండాలు రౌడీలు క్రిమినల్స్ స్టూడెంట్స్ గుంపులోకి ప్రవేశించి ఆడవాళ్ళమీద యువతుల మీద అత్యాచారం చేశారు కొంతమందిని నడిరోడ్డు మీద పట్టుకుని బట్టులు తీసేసి మృగంలా ప్రవర్తించారు. దాంతో పోలీసులు కాల్పులు జరపవలసివచ్చింది. ఇలాంటి సంఘటనలు నాలుగు సిటిలో జరగటంతో పోలీసులు కూడబలుక్కున్నట్టు ఒకే సారి గుంపుమీద కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో దాదాపు వంద మంది మరణించారు. అయిన గొడవలు కాని రాస్తారోకాలు కని తగ్గలేదు. మరింత ఎక్కువయ్యాయి. అధికారు ప్రభుత్వం ఏమాత్రం గొడవలను అణచలేకపోవటంతో ఇది సాకుగా తీసుకుని మిలిట్రివాళ్ళు రంగంలోకి దిగారు.

అధికారంలో ఉన్న మంత్రులందరిని హౌస్ అరెస్ట్ చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో మార్షల్ లా అమలులోకి తెచ్చారు. రెండు రోజుల తరువాత పాకిస్ధాన్ సైన్యం టాంకులతో మిస్సైల్స్ తో సరిహద్దు దగ్గర మోహరించింది. ఈ వార్త విని అబ్బాస్ షాక్ అయ్యాడు. ఒక్క క్షణం పాటు అతని మైండ్ బ్లాంక్ అయిపోయింది. సమస్యమీద సమస్యవస్తూ అతన్ని అతలాకుతలం చేస్తోంది. మిత్రవిందకు అతనికి బహిరంగంగా పెళ్ళికానివ్వకుండ అడ్డుపడుతోంది. ఏం చెయ్యాలో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అతనికి అర్ధం కావటంలేదు. ఇప్పటికే మిత్రవిందతో దూరంగా ఉంటు నరకయాతన అనుభవిస్తున్నాడు అతను. ఉగ్రవాదుల సమస్యతీరిన తరువాత ఇద్దరు హాయిగా పెళ్ళిచేసుకుని సంతోషంగా ఉందామని అనుకున్నారు. అతను అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోకటి. ఈ పరిస్ధితిలో అసలు పెళ్ళిచేసుకోవటానికి వీలులేదు. పెళ్ళిమాట అల్లా ఎరుగు అతను ఒక ఇండియన్ పొలిటికల్ అటాచిని ప్రేమించాడని తెలిస్తే చాలు అతన్ని అరెస్ట్ చేసి జైలులో పెడతారు. మిత్రవిందను కూడా ఊరికే విడిచిపెట్టరు. పొలిటికల్ అటాచి ఉద్యోగం అడ్డం పెట్టుకున తమ దేశంలో ఏజంట్ గా వచ్చిందని అనుమానించి ఇంటరాగేట్ చేస్తారు.

ఆ ఇంటరాగేషన్ పద్ధతులు ఎలా ఉంటాయో అబ్బాస్ కు తెలుసు. మనిషి అయిన వాడు ఆ బాధలను తట్టుకోలేడు. అంతకంటే ఆత్మహత్య నయం  అనుకుంటాడు. అలాగని అబ్బాస్ కు చేతులు ముడుచుకుని కూర్చోవాలని లేదు. ఇలాంటి స్ధితి వస్తుందని అతను ఊహించ లేకపోయిన ఏదో సమస్య మాత్రం వస్తుందని అతను అనుమానపడ్డాడు. అందుకే మిత్రవిందను పెళ్ళిచేసుకునే ఉపాయం ఆలోచించాడు.  ఆ రోజు అతను చాంబర్ లో కూర్చుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. దేశం మొత్తాని మిలిట్రి తమ అధీనంలోకి తీసుకోవటంతో అల్లర్లు తగ్గాయి. దాదాపురెండు వందలమంది అమాయకులు పోలీసు కాల్పులలో చనిపోయారు. అదే కాకుండ పాకిస్ధాన్ తన సైన్యాన్ని సరిహద్దు దగ్గర మోహరించింది. దీనికి రాటార్డుగా భారత్ కూడా తన బలాలను అవతలవైపు తప్పకుండ సిద్దం చేస్తుంది. అదే జరిగితే రెండు దేశాల మద్య యుద్ధం అనివార్యం. సమస్య మరింత జటిలం కాకముందే అతనితో మిత్రవింద పెళ్ళి జరిగిపోవాలి. ఏం చెయ్యాలి. టైం గడిచిపోతుంది. సాయంత్రం అయిన అతనికి ఎలాంటి ప్లాన్ తట్టలేదు. ఇంటికి బయలుదేరుతూ మిత్రవిందకు కాల్ చేశాడు.“

ఎలా ఉన్నావు”అడిగాడు. “ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దినదినగండంగా గడుపుతున్నాను. ఏ క్షణంలో రౌడీలు వచ్చి ఎంబసిమీద దాడిచేస్తోరో అని భయంతో హడలిచస్తున్నాను”అంది మిత్రవింద.“లోపల ఉన్నంతవరకు మీకు ఏ సమస్య రాదు. దయచేసి ఎట్టిపరిస్ధితిలోను బయటకు మాత్రం రాకు. ఎట్టి పరిస్ధితిలోను ఎంబసి మీద మాత్రం దాడి జరగదు. నేను గ్యారంటి”అన్నాడు అబ్బాస్.“ఏమిటి ఈ దారుణం. మన పరిస్ధితి ఏమిటి? ఇంకా ఎంతకాలం మనం ఇలా దూరదూరంగా ఉండాలి.”“వర్రికాకు. ఇంకో రెండు రోజులు ఓపికపట్టు. మన సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చెప్తాను. ఆ తరువాత మనిద్దరిని ఎవరు వేరు చెయ్యలేరు. రెండు ప్రభుత్వాలు ఏకమైన మన జోలికి రాదు. నాకు రెండు రోజులు టైం ఇవ్వు చాలు. ఈ లోగా నువ్వు మాత్రం ఒంటరిగా ఎక్కడికి బయటకు వెళ్ళకు”.“అలాగే నువ్వు మాత్రం ఏదో ప్లాన్ ఆలోచించి నన్ను ఈ జైలునుంచి బయటకు తీసుకురా. ఇక్కడ నాకు ఊపిరి అడటం లేదు. పైగా మీ దేశంలో పరిస్ధితులు చాల అద్వాన్నాంగా మారిపోయాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఊహించలేకుండ ఉన్నాను.”

“నాకు మాత్రం తెలియదా. అందుకే నిన్ను రెండు రోజులు ఓపికపట్టమని చెప్పుతున్నాను. ఈ లోగా ఏదో ప్లాన్ ఆలోచించి మన పెళ్ళి జరిగేలా చూస్తాను. సరే ఉంటాను. వీలుచూసుకుని రాత్రి కాల్ చేస్తాను”అని చెప్పి లైన్ కట్ చేశాడు అబ్బాస్. అరగంట తరువాత అతను ఇంటికి చేరుకున్నాడు. వాహనాన్ని పార్కింగ్ స్పేస్ లో పార్క్ చేసి వస్తుంటే అప్పుడే అనూహ్యమైన పరిణామం జరిగింది. అతని మెదడులో ఒక అద్భుతమైన పధకం వచ్చింది. రెండు రోజులు గడిచాయి. అయిన అబ్బాస్ నుంచి ఎలాంటి కాల్ రాలేదు. బహుశా బిజీగా ఉన్నాడని భావించి సరిపెట్టుకుంది. ఆ రోజు మాములుగా అంబాసిడర్ చాంబర్స్ లోకి వెళ్ళింది. ఆయన చాల అనీజీగా ఉన్నాడు. మూడ్ ఏమాత్రం బాగాలేదని ఆయన వాలకం చప్పకనే చెప్పుతుంది. “ఏం జరిగింది సార్ “అలా ఉన్నారు”అడిగింది మిత్రవింద.“పాకిస్ధాన్ రక్షణమంత్రి దగ్గరనుంచి ఇప్పుడే కాల్ వచ్చింది. ఇంకో గంటలో తనని కలుసుకోమని చెప్పాడు”అన్నాడు అంబాసిడర్.“దీనికి  ఇంత కంగారు ఎందుకు. ఇంతకుముందు కూడా మీరు రెండుమూడుసార్లు వెళ్ళారు కదా. ఇది కొత్త కాదు కదా”అంది మిత్రవింద. “అప్పుడు స్నేహపూర్వకంగా వెళ్ళాను. కాని ఇప్పుడు పరిస్ధితులు అలా లేవు. రెండు దేశాలు ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరిపోసుకుంటున్నారు. పైగా పాకిస్ధాన్ తన జవాన్లను మిస్సైల్స్ ను సరిహద్దు దగ్గర మొహరించింది.

ఇండియా కూడా దానికి దీటుగా సై అంటుంది. ఇలాంటి పరిస్ధితిలో రక్షణమంత్రి పనిగట్టుకుని పిలిచాడంటే ఏదో ముఖ్యమైన కారణం ఉంటుంది. అదేమిటో నా ఊహకు అందటం లేదు. చూడాలి ఏం చెప్తాడో”అన్నాడు స్వగతంగా అంబాసిడర్. మిత్రవింద  కుడి కన్ను అప్రయత్నంగా అదిరింది. కుడి కన్ను అదిరితే ఏదో జరగకూడనిది జరుగుతుందని అంటారు. ఆ మాటలలో నిజం ఎంత ఉందో మిత్రవిందకు తెలియదు. కాని ఉగ్రవాదులు బారముల్లాలో తన ఇంటిమీద దాడిచేసినప్పుడు కూడా ఇలాగే ఆమె కుడికన్ను అదిరింది. అప్పుడు దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కాని జరగకూడని దారుణం మాత్రం జరిగిపోయింది. మళ్ళి చాల రోజుల తరువాత మళ్ళి అదే అనుభవం ఇప్పుడు ఎదురవుతుంది. ఎలాంటి చెడువార్త వినవలసివస్తుందో. “సరే మేడం నేను బయలుదేరుతాను. ఎవరు ఎంబసిని దాటి ఎక్కడికి వెళ్ళవద్దు”అని హెచ్చరించి వెళ్ళి తన కారులో కూర్చున్నాడు. క్షణం తరువాత ఆయన కారు వేగంగా బయటకు దూసుకుపోయింది. అరగంట తరువాత కారు పాకిస్ధాన్ రక్షణమంత్రి ఆఫీసు ప్రెమిసెస్ లో ఆగింది. అంబాసిడర్ గంభీరంగా దిగి మంత్రి చాంబర్స్ లోకి వెళ్ళాడు. మాములు ఫార్మాలిటిస్ పూర్తయిన తరువాత అసలు విషయానికి వచ్చాడు మంత్రి.“మీకు మూడురోజులు టైం ఇస్తున్నాను.

ఈ లోగా మీరు మీ స్టాఫ్ ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలి.”“మా వల్ల ఏం తప్పుజరిగంది మినిస్టర్”ఆందోలనగా అన్నాడు అంబాసిడర్.“మీకు సంజాయిషి చెప్పుకోవలసిన అవనరం నాకు లేదు. ఈ నిర్ణయం నేను తీసుకుంది కాదు. మా ప్రభుత్వం కూర్చుని బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మీ స్టాఫ్ లో అందరు వెళ్ళిపోవనవసరం లేదు. మేము ఇచ్చిన లిస్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి”అంటు ఒక కాగితాన్ని అంబాసిడర్ ముందు పెట్టాడు మంత్రి. వణుకుతున్న చేతులతో ఆ లిస్ట్ అందుకుని చూశాడు. అందులో దాదాపు యాభైమంది పేర్లు ఉన్నాయి. అందులో ఎవరి పేర్లు ఉన్నాయో చూడకుండ అంబాసిడర్ ఆ లిస్ట్ ను కోటు జేబులో పెట్టుకున్నాడు.  ఇప్పుడుఏం చెప్పిన మంత్రి ఒప్పుకోడని అంబాసిడర్ కు అర్ధమైంది. మంత్రికి నమస్కారం చేసి ఆయన చాంబర్స్ లోంచి బయటకు వచ్చాడు. అరగంట తరువాత తన ఎంబసి చేరుకుని తన చాంబర్స్ లో కూర్చున్నాడు. ఆయన వాలకం గమనించిన మిత్రవింద ఆయన చాంబర్స్ లోకి వెళ్ళి “ఏం జరిగింది సార్ “అలా ఉన్నారు”అని అడిగింది.“మూడు రోజులలో మనం ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలి”అన్నాడు మెల్లగా అంబాసిడర్.“ఎందుకని”ఆశ్చర్యంగా అడిగింది మిత్రవింద.    “కారణం మన రెండు దేశాల మద్య ఉన్న ఉద్వేగవాతావరణం. ఎంబసిలో పనిచేస్తున్నవాళ్ళంతా వెళ్ళనవసరం లేదు. యాబై మంది మాత్రం తప్పకుండ వెళ్ళిపోవాలి.

ఇదిగో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ “అని ఇచ్చాడు అంబాసిడర్. మిత్రవింద ఆ కాగితాన్ని అందుకుని చూసింది. ఒక్కోక్కోపేరు చూస్తున్న ఆమె చివరగా ఉన్న పేరును చూసి కట్రాయిలా బిగుసుకుపోయింది. అది ఆమె పేరు. రక్తం ఇంకిపోయినట్టు మిత్రవింద మొహం పాలి పోయింది “సార్ ఇది అన్యాయం”అంది మిత్రవింద.“దాని గురించి చర్చించటం అనవసరం ఈ విషయం గురించి స్టాఫ్ మొత్తానికి చెప్పండి. సామానులు సర్దుకుని రెడిగా ఉండమని చెప్పండి. మూడు రోజులలో వెళ్ళిపోవాలి. ఆ తరువాత ఒక్క క్షణం ఈ దేశంలో ఉన్నా పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెడతారు”అన్నాడు అంబాసిడర్.నిద్రలో నడుస్తున్నదానిలా అంబాసిడర్ చాంబర్స్ లోంచి బయటకు వచ్చిది మిత్రవింద. ఇంకో మూడు రోజులు మాత్రమే మిత్రవింద ఈ దేశంలో ఉంటుంది. తరువాత దేశం విడిచివెళ్ళిపోవాలి ఆమె. ఈ లోగా అబ్బాస్ తో ఆమె పెళ్ళి జరిగిపోవాలి. లేకపోతే ఇద్దరు శాశ్వతంగా ఒకరికి ఒకరు దూరం అయిపోతారు. ఈ జన్మలో కలుసుకోవటం జరగదదు. పైగా రెండు దేశాలు యుద్దానికి కాలుదువ్వుతున్నాయి.

తన చాంబర్స్ లో కూర్చుని అబ్బాస్ కు కాల్ చేసింది. ఎన్ని సార్లు చేసిన అబ్బాస్ దగ్గర నుంచి  రెస్పాన్స్ లేదు. భయం కంగారు కలిసికట్టుగా మిత్రవిందను కుదిపేశాయి. ఆ రోజు సాయంత్రం అంతా ఉద్వేకంతో తల్లిడిల్లిపోయింది మిత్రవింద. సరిగ్గా ఆమె ఆఫీసునుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమె సెల్ ఫోన్ చప్పుడు చేసింది. డిస్ ప్లే మీద అబ్బాస్ నెంబర్ చూసి వెంటనే సెల్ ఆన్ చేసింది మిత్రవింద. “ఉదయం నుంచి నీకోసం ట్రై చేస్తున్నాను. కాని నువ్వు రెస్పాన్స్ కాలేదు. ఎక్కడ ఉన్నావు”కంగారుగా అడిగింది మిత్రవింద.“నాకు అంతా తెలుసు. మూడు రోజులు టైం ఉంది కనుక నువ్వు కంగారుపడవలసింది ఏం లేదు. భయపడకుండ కూల్ గా ఉండు. రెండు రోజులు నాకు కాల్ చెయ్యకు. మూడో రోజు పదిగంటలకు నేనే కాల్ చేసి ఏం చెయ్యాలో చెప్తాను. అంతవరకు పిచ్చిపిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండ కామ్ గా ఉండు. అంతా సర్దుకుంటుంది”అన్నాడు అబ్బాస్.“మనకు ఉన్నది మూడు రోజులు మాత్రమే. ఈలోగా నువ్వు ఏదో చేసి మన పెళ్ళి జరిగేలా చూడాలి. ఆ గడుపు దాటిపోతే మళ్ళి మనం కలుసుకోవటం అంటు జరగదు”అంది మిత్రవింద.“అంతా నాకు తెలుసు. నేను చెప్పినట్టు కామ్ గాఉండుఉంటాను బై “అని లైన్ కట్ చేశాడు అబ్బాస్.మిత్రవిందతో మాట్లాడిన తరువాత అబ్బాస్ సెల్ ఆఫ్ చేసి తన ఆఫీసులోంచి బయటకు వచ్చాడు. జీపులో కూర్చుని తిన్నగా ప్రభుత్వ హాస్పటల్ చేరుకున్నాడు.

చీఫ్ డాక్టర్ ను కలుసుకుని మాట్లాడాడు. “క్యాప్టన్ మీరు కోరినట్టుగానే ఒక అమ్మాయి శవాన్ని దహనం చెయ్యకుండ జాగ్రర్త చేశాం. రండి చూపిస్తాను”అని మర్చ్యురి  గదిలోకి తీసుకువెళ్ళాడు. అటెంటర్ ఒక డ్రాయర్ తెరిచి పట్టుకున్నాడు. అందులో ఒక అమ్మాయి శవం. ఆమె దాదాపు మిత్రవింద అంత ఒడ్డు పొడుగు ఉంది.“ఈ మద్య ఈ అమ్మాయి శవం తప్ప ఇంకో ఆడశవం రాలేదు. ఈ అమ్మాయి ఎవరో ఈమే పేరు ఏమిటో మాకుతెలుసు. రోడ్డు మీద చచ్చిపడిఉంటే మున్సిపాలిటి వాళ్ళు తీసుకువచ్చి ఇక్కడ పెట్టారు. ఆమె చనిపోయి పదిరోజులైంది. కాని ఇంతవరకు ఒక్కరు కూడా ఆమె శవాన్ని క్లెయిమ్ చెయ్యటానికి రాలేదు. పేపర్ లో కూడా ప్రకటన చేశాం. కాని ఏం లాభం లేకుండ పోయింది. అప్పుడే మీ దగ్గరనుంచి కాల్ వచ్చింది. పాతికసంవత్సరాలు లోపు ఏదైన అనాధ స్త్రీ శవం వస్తే మీకు చెప్పమని చెప్పారు. అందుకే రూల్స్ కు విరుద్దం అయిన శవాన్ని జాగ్రర్త చెయ్యవలసివచ్చింది”అన్నాడు డాక్టర్. “ద్యాంక్యు డాక్టర్. మీ మేలు ఎప్పటికి మరచిపోలేను. ఈ శవాన్ని నేను తీసుకువెళతాను. ఫార్మాలిటిస్ ఉంటే పూర్తిచేసి మరి తీసుకువెళతాను”అన్నాడు అబ్బాస్.డాక్టర్ తో మాట్లాడిన తరువాత అబ్బాస్ తిన్నగా ఆఫీసుకు వెళ్ళకుండ ఇస్లామాబాద్ లో ఒక ఇరుకువిధీలో తన జీపు ఆపాడు. ఆ ప్రాంతం అచ్చంగా హైదరాబాదులో ఉన్న బారకాస్ ఏరియాను పోలి ఉంది. అబ్బాస్ జీపు దిగి ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్ళాడు. గట్టిగా తలుపుమీద తట్టాడు. క్షణం తరువాత తలుపులు  తెరుచుకున్నాయి.

ఎదురుగా ఒక పాతికసంవత్సరాల యువకుడు కనిపించాడు. యానిఫారమ్ లో ఉన్న అబ్బాస్ ను చూడగానే అతను చలిజ్వరం వచ్చినవాడిలా వణికాడు.“సార్ నేను ఏ నేరం చెయ్యలేదు. రెండు రోజులకు ముందే జైలునుంచి రిలీజ్ అయ్యాను. మార్కెట్టులో చిన్న ఎలక్ట్రిక్ దుకాణం పెట్టుకుని గౌరవంగా బతుకుతున్నాను”అన్నాడు అతను.“నిన్ను అరెస్ట్ చెయ్యటానికి రాలేదు. నువ్వు నాకో సహయం చెయ్యాలి. ఊరికే చెయ్యనవసరం లేదు. బాగా డబ్బు ఇస్తాను. చేస్తావా”అడిగాడు అబ్బాస్.“నేను మీకు సహయం చెయ్యటం ఏమిటి”ఆశ్చర్యంగా అడిగాడు ఆ యువకుడు. అతని పేరు బేగ్. ఏం చేస్తాం.  సమయం అలా వచ్చింది. సరే అసలు విషయం చెప్తాను. ఇదిగో ఫోటో. దీని వెనుక ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు వయస్సు తల్లిపేరు తండ్రి పేరు ఊరు అన్ని వివరాలు ఉన్నాయి. నాకు ఈ రోజు రాత్రిలోగా ఆమె పేరుమీద ఒటర్స్ ఐడి కావాలి. సంబంధిత అధికారి సంతకం కూడా ఫోటో మీద ఉంది. సరిగ్గా అలాంటి సంతకంతోనే నాకు ఆ అమ్మాయిఓటర్ ఐడి కావాలి. నీకు ఎంత కావాలో చెప్పు ఇస్తాను”అని ఒక ఫోటో బేగ్ చేతిలో పెట్టాడు అబ్బాస్.“సార్ సంవత్సరం ముందు ఫోర్జరి కేసులో మీ పోలీసులు నన్ను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. కొన్ని రోజులకు ముందే జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాను. మళ్ళి అదే నేరం చెయ్యమంటున్నారు”అన్నాడు బేగ్ పాలిపోయిన మొహంతో.“ అప్పుడు నీ కోసం ఆ తప్పు చేశావు. ఇప్పుడు నాకోసం చెయ్యమంటున్నాను. దీని వల్ల నీకు ఎలాంటి సమస్య రాదు. అంతేకాదు నీ మీద పెండింగ్ లో ఉన్న కేసులని మాఫీ చేయిస్తాను. ముఖ్యంగా ఉగ్రవాదులకు నువ్వు ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఇచ్చావని నీ మీద ఆరోపణలు ఉన్నాయి. అది నిజం కాదని నాకు తెలుసు. కాని చట్టానికి తెలియదు. నీ మీద ఆ కేసులన్ని పోవాలంటే నువ్వు ఈ పని చెయ్యక తప్పదు. ఒక మంచి పనికోసం చిన్న నేరం చేస్తే తప్పులేదు ఆలోచించుకో”అన్నాడు అబ్బాస్. బేగ్ ఇంకేం ఆలోచించలేదు. ఫోటో తీసి జేబులోపెట్టుకున్నాడు.

అబ్బాస్ అతనికి ఒకకవరు ఇచ్చి తన జీపులో కూర్చున్నాడు. క్షణం తరువాత జీపు కదిలి ముందుకు వెళ్ళిపోయింది. కవరులో చాల డబ్బు ఉంది. ఆ ఫోటో మిత్రవిందది. ఫోటో కింద అబ్బాస్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. రెండు రోజులు గడిచి మూడో రోజు వచ్చింది. పాకిస్ధాన్ ఇచ్చిన డెడ్ లైన్ రోజది. ఆ రోజు సరిగ్గా రెండు గంటలలోగా యాబైమంది స్టాఫ్ ఇస్లామాబాద్ విడిచివెళ్ళిపోవాలి. ఆ రోజు ఉదయనుంచి హడావిడి మొదలైంది. ఇండియా బయలుదేరబోతున్న స్టాఫ్ అందరు సంతోషంతో ఊగిపోతున్నారు. ఎప్పుడెప్పుడుతమ దేశానికి వెళ్ళిపోదామా అని పదేపదే ఆరాటపడ్డారు. ఈ శుభసమయం ఈ రోజు వచ్చింది.    అందరు ఉదయమే తన సామాన్లు సర్దుకుని సిద్దంగా ఉన్నారు. మిత్రవింద కూడా తన సామాను సర్దుకుని రెడిగా ఉంది. ఇంకో ఆరుగంటలు మాత్రమే గడవు ఉంది. ఈలోగా అబ్బాస్ కాల్ చేసి అతను తమ పెళ్ళికి ఏం చెయ్యదలచుకున్నాడో తెలుసుకోవాలి. ఫోన్ చేసి చెప్పాలి అతను. కాని ఇంతవరకు అతని వైపు నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు. మిత్రవింద మాత్రం భయంతో బిక్కచచ్చిపోతుంది. బయలుదేరబోతున్న స్టాఫ్ అందరు కాంపౌండ్ లో వచ్చి నిలబడ్డారు. భారతప్రభుత్వం వాళ్ళ కోసం స్పెషల్ ఫ్లైట్ సిద్దం చేసింది. సరిగ్గా పన్నెండు గంటలకు అందరు ఏయిర్ పోర్ట్ చేరుకోవాలి.

రెండు గంటలకు స్పెషల్ ఫ్లైట్ వాళ్ళను తీసుకుని టేకాఫ్ తీసుకుంటుంది. ఏది చేసిన ఏం చేసిన అబ్బాస్ ఈ లోగా చెయ్యాలి. ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అంబాసిడర్ అతని సతీమణి వచ్చారు.“మేము బయలుదేరుతున్నాం. మీరు కూడా టైంకు ఏయిర్ పోర్ట్ చేరుకోండి. అందరు జాగ్రర్తగా ఢిల్లీ చేరుకోండి. బై”అని స్టాఫ్ అందరికి చెప్పి తమ కారులో కూర్చున్నారు. మరుక్షణం కారు వేగంగా ఏయిర్ పోర్ట్ వైపు దూసుకుపోయింది.అందరు తమ దేశానికి వెళ్తున్నందుకు ఆనందంతో కేరింతలు కొడ్తున్నారు. ఒక్క మిత్రవింద తప్ప. ఆమెకు ఆక్కడ నా అన్నవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడే ఆమెకు సర్వస్వం అయిన అబ్బాస్ ఉన్నాడు. అతని లేని జీవితం ఆమె ఊహించలేకపోతుంది.పదిగంటలు గడిచాయి. స్టాఫ్ ను తీసుకువెళ్ళటానికి ఒక మెటడర్ వ్యాన్ వచ్చింది. అందులో ఇరవైమంది మాత్రమే పడతారు. అందుకే ముందు ఇరవైమంది తమ సామాన్లు తీసుకుని బయలుదేరారు. వాళ్ళు వెళ్ళిపోవటం చూసి మిత్రవింద గుండెలు రాకేట్ వేగంతో కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఇంకో రెండు గంటలు మాత్రమే ఉంది. పాకిస్ధాన్ ఇచ్చిన గడువు ఆ టైంతో పూర్తవుతుంది. ఒక్క క్షణం ఆ గడువు దాటిన చట్టవిరుద్దంగా ఆ దేశంలో ఉన్నట్టు భావించబడుతోంది. మరో ఇరవైమంది వెళ్ళటానికి తయారయ్యారు. అరగంట తరువాత మళ్ళి మెటడర్ వ్యాన్ వచ్చింది. ఇంకో ఇరవైమంది ఎక్కి ఏయిర్ పోర్ట్ కు వెళ్ళిపోయారు. మరో పదిమంది మాత్రం మిగిలిఉన్నారు.అబ్బాస్ ఇంకా ఎందుకు కాల్ చెయ్యలేదో మిత్రవిందకు అర్ధం కావటం లేదు. మళ్ళి అరగంట తరువాత మెడటర్ వ్యాన్ వచ్చింది. అప్పుడే అబ్బాస్ దగ్గర నుంచి కాల్ వచ్చింది.    ఉపోద్ఘాతం లేకుండ అతను అసలు విషయానికి వచ్చాడు.“నేను చెప్పేది జాగ్రర్తగా విను. నువ్వు నీ కారు తీసుకుని ఒంటరిగా ఏయిర్ పోర్ట్ కు బయలుదేరు. నీతో పాటు నీకు సంబంధించిన అన్ని ఐటింటి కార్డ్స్ తీసుకుని బయలుదేరు. సరిగ్గా జిన్నా చౌరస్తా దగ్గరకు చేరుకో. అక్కడనుంచి తిన్నగా వెళితే ఏయిర్ పోర్ట్ వస్తుంది. కాని నువ్వు తిన్నగా వెళ్ళకుండ కుడివైపు తిరుగు. అక్కడనుంచి కొంతదూరం ప్రయాణం చేసి పదవమైలురాయి దగ్గరకు చేరుకో. ఆ రాయికి ఎడంవైపు విశాలమైన మైదానం దాని తరువాత కొండలు లోయలు కనిపిస్తాయి.

అక్కడ నీకోసం ఎదురుచూస్తూఉంటాను. వెంటనే బయలుదేరు”అని ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండ లైన్ కట్ చేశాడు అబ్బాస్.మిత్రవింద కూడా సెల్ ఆఫ్ చేసి తన సామాన్లు తీసుకుంది. అబ్బాస్ కోరిన ఐడింటి కార్డ్స్ కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఆమె బ్యాగ్ లో ఉన్నాయి. వాటిని తీసుకుని కారులో కూర్చుంది. గేటు దగ్గర ఉన్న సెక్యురిటి గార్డ్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. వ్యాన్ లో వెళ్ళకుండ కారులో వెళ్తున్నందుకు అతనికి విస్మయం కలిగించింది.“ఏయిర్ పోర్ట్ చేరుకున్న తరువాత నేను కాల్ చేస్తాను. నువ్వు వచ్చి కారును స్వాధీనం చేసుకో అంది.”అబ్బాస్ చెప్పినట్టుగానే ఆమె వేగంగా జిన్నా చౌరస్తా వైపు దూసుకుపోయింది. పావుగంటలో అక్కడికి చేరుకుంది. మిత్రవింద తిన్నగా వెళ్ళకుండ తన కారును కుడివైపుకు కోసింది. అక్కడనుంచి వేగంగా పదవమైలు రాయిదగ్గరకు చేరుకుంది. అబ్బాస్ చెప్పినట్టుగానే కుడివైపు విశాలమైన మైదానం దాని తరువాత కొండలు లోయలు కనిపించాయి. మైదానం దగ్గర ఒక చోట అబ్బాస్ కనిపించాడు. అతని పక్కనే అతని పర్సనల్ కారు ఉంది.మిత్రవింద తన కారును వేగంగా అటువైపుకు తీసుకువెళ్ళింది.“మిత్రవింద వెంటనే నువ్వు వేసుకున్న బట్టలు విప్పు”అన్నాడు అబ్బాస్. మిత్రవింద ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడింది.“నా ఉద్దేశం అది కాదు. నీ బట్టలు విప్పి ఈ అమ్మాయికి తొడుగు”అంటు తన కారు డిక్కి తెరిచాడు.

అందులో ఒక అమ్మాయి శవం ఉంది.“నీ బట్టలు విప్పి ఈ అమ్మాయికి తొడుగు. తరువాత నీకు సంబంధించిన ఐడింటి కార్డ్స్ కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్ నీ బ్యాగ్ లో పెట్టి ఆమె పక్కన పెట్టు. ఇద్దరం ఆమె శవాన్ని నీకారు డ్రైవింగ్ సీటులో కూర్చోపెడదాం. తరువాత కారును ఎదురుగా ఉన్న లోయలోకి తోసేద్దాం. దాంతో భారత ఎంబసిలో పనిచేస్తున్న పొలిటికల్ అటాచి మిత్రవింద చరిత్ర సమావ్తం అవుతుంది. కాని అందరు అనుకున్నట్టుగా ఆమె చనిపోలేదు. బెనజీర్ అనే పేరుతో అబ్బాస్ భార్య అయింది”అంటు పూర్తిచేశాడు అబ్బాస్. తరువాత ఇద్దరు కలిసి ఆమెకు మిత్రవింద బట్టలు తొడిగారు. ఆమె పక్కన మిత్రవిందకు సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి ఆమె శవాన్ని డ్రైవింగ్ సీటులో కూర్చోపెట్టారు. తరువాత ఇద్దరు కలిసి కారును గట్టిగా ముందుకు తోశారు. కారు వేగంగా ముందుకు వెళ్ళి లోయలో పడిపోయింది. ముందు ఢాం అంటు పెద్ద చప్పుడు అయింది. తరువాత కారు తునాతునకలైపోయింది. కారు ఇంజన్ బద్దలై మంటలు వ్యాపించాయి. చిక్కని పొగ సుడులు తిరుగుతు పైకి లేచింది. జరిగింది చూసిన తరువాత ఇద్దరు వెళ్ళి అబ్బాస్ కారు దగ్గర నేలమీద కూర్చున్నారు. అబ్బాస్ మిత్రవింద చుట్టు చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు.

అతనికి సహకరిస్తూ మిత్రవింద ఇంకా అతనికి దగ్గరగా జరిగింది. ఆ స్పర్షలో కామం లేదు కోరిక లేదు. కేవలం ప్రేమ మాత్రం ఉంది.“ఇంతకి ఆ అమ్మాయి ఎవరు”అబ్బాస్ గుండెల్లో తలదాచుకుంటు అడిగింది మిత్రవింద.“పేరు ఊరు తెలియదు. ఒక అనాధ శవం. కాని మన పెళ్ళిజరగటానికి తను ఎంతో ఉపయోగపడింది. తను చచ్చిపోయిన మనకు సహయం చేసింది”“ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి.? అడిగింది మిత్రవింద.“మీ ప్రభుత్వానికి లోకానికి ఇండియన్ పొలిటికల్ అటాచి ప్రమాధంలో చనిపోయింది. కాని నువ్వు మాత్రం కొత్తపేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు. ఈ క్షణం నుంచి నీ పేరు బెనజీర్. ఇస్లామాబాద్ కు వందకిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న  గ్రామంలో నువ్వు పుట్టావు.”“ఈ మాటలు ఎవరు నమ్ముతారు. పోలీసులకు అనుమానం రాదా.” “అందుకే నీ పేరు మీద ఒటరు ఐడిండి కార్డ్ తయారుచేశాను. దీన్నిచూసిన తరువాత చచ్చినట్టు నమ్ముతారు”అంటు అబ్బాస్ ఆమె చేతిలో ఓటర్ కార్డ్ పెట్టాడు.అందులో తన పేరు బెనజీర్ గా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది.

“నీకు తెలియకుండ ఈ పని చేసినందుకు నాకు చాల బాధగానే ఉంది. కాని ఏం చెయ్యను. ఇంతకంటే వేరే దారి నాకు కనిపించలేదు. మన కోసం మన పెళ్ళికోసం నీ ఉనికిని పూర్తిగా మార్చేశాను. మీ అమ్మనాన్న ఎంతో ముద్దుగాపెట్టిన పేరును దేశాన్ని మతాన్ని కూడా మార్చేశాను. ఇందుకు నన్ను క్షమించు మిత్రవింద”అన్నాడు అబ్బాస్.“బాధపడకు. నువ్వు చేసినపని ఎంత మాత్రం తప్పు కాదు. నాకోసం నీ ఆహారపు అలవాట్లను పద్ధతులను మార్చుకున్నావు. నీతో పాటు మీ అమ్మను కూడా మార్చవు. అంతకంటే నేను మతం మారటం గొప్ప విషయం కాదు. దేశం మతం కంటే కూడా మానవత్వం గొప్పది. అది నీలోను మీ అమ్మలోను ఎంతో పుష్కలంగా ఉంది”అంది మిత్రవింద తన్మయత్వంతో. అబ్బాస్ ఏం చెప్పకుండ ఇంకా ఆమెను తనలోకి పొదుపుకున్నాడు. ఇద్దరు కొన్ని నిమిషాల పాటు ఒకరి స్పర్శను ఒకరు అనుభవిస్తూ అలౌకికమైన ఆనందంలో ఉండిపోయారు.రెండు రోజుల తరువాత అబ్బాస్ మిత్రవింద నిక్కా ఘనంగా జరిగింది. ఇన్ని రోజుల తరువాత కోడలు పిల్ల తన ఇంట్లో అడుగుపెడ్తున్నందుకు షబ్నమ్ సంతోషం అంతా ఇంతా కాదు. ఆ మరునాడు హోటల్ లో రిసప్షన్ జరిగింది. దానికి బ్రిగేడియర్ కల్నల్ మరికొంతమంది అధికారులు వచ్చారు. బెనజీర్ వేషంలో ఉన్న మిత్రవిందను చూసి ఒక అధికారి ఆశ్చర్యపోయాడు. అతను ఆ రోజు అబ్బాస్ ను హోటల్ లో కలిసినవ్యక్తి. అప్పుడు అబ్బాస్ మిత్రవిందను తన దూరపు చుట్టంగా పరిచయం చేశాడు.“బ్రిగేడియర్ సాబ్ ఈ పెళ్ళి కూతురిని ఇంతకుముందు చూశాను.

ఆమె అచ్చంగా ఎంబసిలో పనిచేసిన లేడి పొలిటికల్ అటాచిలా ఉంది”అన్నాడు.“పిచ్చిపిచ్చిగా వాగకు. ఆ పొలిటికల్ అటాచి ప్రమాధవశతు చనిపోయింది. ఆమెకు ఈమేకు కొంచం పోలికలు ఉండవచ్చు. అంతమాత్రాన్న ఈమే ఆమె కాదు”అన్నాడు బ్రిగేడియర్. అయిన అతని అనుమానం తీరలేదు. తన సెల్ తో మిత్రవింద ఫోటో తీశాడు. తరువాత తమ దగ్గర ఉన్న ఎంబసి స్టాఫ్ ఫోటోలను చూశాడు. అందులో ఉన్న మిత్రవింద ఫోటోను అబ్బాస్ పక్కన బెనజీర్ రూపంలో ఉన్న మిత్రవిందను పోల్చీ చూశాడు.  ఆమె ఖచ్చితంగా మిత్రవింద అని అతనికి అర్ధమైంది. వెంటనే తన అనుమానాన్ని కల్నల్ కు బ్రిగేడియర్ కు రిపోర్ట్ రూపంలో పంపించాడు.ఈ విషయం ఏం తెలియని అబ్బాస్ మిత్రవింద తమ హనిమూన్ ను ఇండియాలో ఆగ్రలో గడుపాలని తీర్మానించుకున్నారు.

సమాప్తం

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nee peru talachina chalu