Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
karnataka  viharayatralu

ఈ సంచికలో >> శీర్షికలు >>

06-09-2019 నుండి 12-09-2019 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, అధికారులతో నూతన చర్చల్లో సమయాన్ని గడుపుతారు. ఆర్థికపరమైన నూతన అవకాశాలు లభిస్తాయి. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. మీ మాటతీరు మూలన నూతన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. తండ్రితరుపు బంధువులను కలుస్తారు, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. గతంలో చేపట్టిన చర్చలు ముందుకు వెళ్లకపోవచ్చును. కొన్ని కొన్ని విషయాల్లో ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నంలో విఫలం అవుతారు.

 

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్తారు . చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసికంగా దృడంగా ఉండుట, అలాగే నిర్ణయాలు తీసుకొనే విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళుట సూచన. కుటుంబంలో పెద్దలనుండి వచ్చిన సూచనలు నచ్చక పోవచ్చును, కాకపోతే సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచిది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది.

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం మొత్తం మీద ఆరంభంలో చేపట్టు పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనల దిశగా అడుగులు ముందుకు వేస్తారు. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం మంచిది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు చేసిన ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం ఉంది, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవచ్చును. ఆరంభంలో పనిఒత్తిడి తప్పక పోవచ్చును.

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో పెద్దల ఆలోచనల మేర ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. సభ్యులతో చర్చల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. వ్యాపారరంగంలో పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుముందు స్పష్టమైన ఆలోచన అలాగే ప్రణాలిక కలిగి ఉండుట సూచన. స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండుట మంచిది. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు లభిస్తాయి. మీ మాటతీరు విషయంలో కొంతమంది ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం మొత్తం మీద విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆసక్తిని చూపిస్తారు. జీవితభాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయుటకు, సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే దిశగా చర్చలు జరుగుతాయి. చిన్న చిన్న విషయాల్లో మీదంటూ ఒక విధానం కలిగి ఉండుట సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. ఆరోగ్యం విషయాల్లో ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వాహనాల వలన అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం మొత్తం మీద బంధువులతో మీరు చర్చల్లో పాల్గొంటారు , నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అలాగే సమయానికి భోజనం చేయుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్లకండి. సర్దుబాటు విధానం మంచిది. సంతాన పరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. పెద్దలతో మీకున్న పరిచయం బలపడేలా ఆలోచనలు చేయుట వలన మేలుజరుగుతుంది.

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం మొత్తం మీద సంతానం గురుంచి బాగా ఆలోచిస్తారు, పెద్దలనుండి పూర్తిగా సహకారం లభిస్తుంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మిత్రులనుండి పూర్తిగా సహకారం లభిస్తుంది. వారితో చర్చలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. సముద్రప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువులనుండి ఆశించిన మేర ఆర్థికపరమైన సహకారం లభిస్తుంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది.

 


వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో మీ ఆలోచనలను పంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది, వాటిని తగ్గించుకొనే ప్రయత్నంలో విఫలం అవుతారు. మీ మొండి నిర్ణయాల వలన వ్యక్తిగతంగా లబ్దిని పొందుతారు. విదేశాలలో ఉన్న బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో కాస్త తడబాటు కలిగి ఉంటారు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. మిత్రుల నుండి మీరు ఆశించిన మేర సహకారం లభిస్తుంది.


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం మొత్తం మీద పెద్దలతో సమయాన్ని సరదాగా గడుపుతారు, వారినుండి ఆశించిన మేర పూర్తిస్థాయి సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. జీవితభాగస్వామితో లేక కుటుంబంతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఎవ్వరితోను మనస్పర్థలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. రుణపరమైన విషయాల్లో ఇతరులకు సహాయం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట మంచిది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి.

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం మొత్తం మీద మీకు నచ్చిన వారితో సమయం గడుపుతారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో ముఖ్యమైన ఆలోచనలు చేసే దిశగా అడుగులు వేస్తారు. వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. నూతన ఒప్పందాల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది.

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. వారినుండి పూర్తిస్థాయి సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి, కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పెద్దలతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి, మౌనంగా ఉండుట మంచిది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది , నూతన వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట మంచిది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబంలో వచ్చిన ఇబ్బందులను బాగా ఆలోచించి ఎదుర్కోండి , అలాగే వారై అభిప్రాయాలను గౌరవించుట వలన మేలుజరుగుతుంది
 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం మొత్తం మీద చర్చలకు అవకాశం ఇవ్వకండి, పెద్దలతో మీ ఆలోచనలను తెలియజేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. పెట్టుబడులు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు, వారికి అనుగుణంగా నడుచుకొనుట వలన మరింత లబ్దిని పొందుతారు. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. మాటతీరు చాలామందికి నచ్చుతుంది, పనులను మీ మాటతీరు వలన పూర్తిచేసే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు , తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.

 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని శీర్షికలు
'Fit' Don't Quit