Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscope september 6tth to september 12th

ఈ సంచికలో >> శీర్షికలు >>

గెట్‌ 'ఫిట్‌' డోన్ట్‌ క్విట్‌.. లెక్కలున్నాయ్‌ బాస్‌.! - ..

'Fit' Don't Quit

దేనికైనా ఓ లెక్కా పత్రం ఉండాలంటారు. అలాగే, ఫిట్‌గా ఉండాలన్నా కూడా కొన్ని లెక్కలు పాఠించాలి తప్పదు బాస్‌.. అంటున్నారు వ్యాయామ నిపుణులు. బరువు పెరగడం సులువే. కానీ, ఆ పెరిగిన బరువును తక్కువ టైంలో తగ్గించేసుకోవాలనుకోవడం ఏమంత సులభం కాదండోయ్‌. అలా చేయడం కూడా సబబు కాదండోయ్‌. పక్కాగా కొన్ని లెక్కలు పాఠిస్తూ బరువును నియంత్రణలో పెట్టుకోవాలి. ఫిట్‌గా ఉండడం మంచిదే. కానీ, 'అన్నప్రసనం రోజే ఆవకాయ అన్నం' అన్నట్లుగా ఉండకూడదు. కొన్ని రోజులు కఠినమైన వ్యాయామాలు చేసేసి, హమ్యయ్యా వెయిట్‌ తగ్గిపోయాం.. అంటూ బాడీకి రెస్ట్‌ ఇచ్చేయకూడదు. కొన్ని ఫిట్‌నెస్‌ సెంటర్స్‌ చెబుతున్న మాటలేంటంటే, మూడు నెలలు, ఆరు నెలలు మాత్రమే ఫిట్‌నెస్‌ సూత్రాలు పాఠించాను. తర్వాత మానేశాను. కానీ నా శరీరం బరువు పెరగలేదు.. అంటూ ఫేక్‌ స్టేట్‌మెంట్స్‌ ఇస్తుంటాయి. కానీ ఆ స్టేట్‌మెంట్స్‌లో ఎంత మాత్రమూ నిజం లేదని గ్రహించాలి.

ఒక్కసారి శరీరానికి కష్టం అలవాటు చేసి, కఠోరంగా కష్టపెట్టేసి, తర్వాత వీలైనంత రెస్ట్‌లోకి పంపించేస్తే, బాడీలో పైకి కనిపించని అనూహ్యమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయని ఫిట్‌నెస్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఏ వయసులో ఏ ఏ వ్యాయామాలు, ఎంత స్థాయిలో చేయాలనే దానిపై సరైన అవగాహన ఉండాలంటున్నారు వారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి ఉండాల్సిన వ్యాయామం ఉండడం లేదు, దాంతో అందాల్సిన శారీరక శ్రమ అందక, శరీరం మొద్దుబారిపోతోంది. తద్వారా అయితే ఊబకాయం, లేదంటే, స్లీకీ (బక్కతనం) ఆవహిస్తోంది. తదనుగుణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే ప్రతీ రోజూ క్రమం తప్పకుండా ఆరగంట నుండి, గంట సమయం మామూలు నడకను అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు.

వేలకు వేలు ధారపోసి, జిమ్‌లో జాయిన్‌ అయ్యి అక్కడ కఠోరమైన వ్యాయామాల్ని ప్రోత్సహించొద్దని జన్యూన్‌గా నిపుణులు సూచిస్తున్నారు. ఫిట్‌గా ఉండడం కోసం క్విట్‌ థాట్స్‌ చేయొద్దంటున్నారు. ఏ వ్యాయామం అయినా, మెల్లగా స్టార్ట్‌ చేసి, క్రమంగా వేగం పెంచాలనీ.. మళ్లీ అదే క్రమంలో తగ్గించుకుంటూ పోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఫలితం తక్కువగా కనిపించినా, ఈ ప్రోసెస్‌ శరీరంలోని బ్యాడ్‌ కొలెస్టరాల్‌ని తగ్గించి, హెచ్‌ డీ కొలెస్టరాల్‌ (మంచి కొలెస్టరాల్‌) స్థాయిల్ని పెంచుతుందట. నిజానికి సాధారణ లైఫ్‌ స్టైల్‌తోనే హెల్దీ ఫిట్‌నెస్‌ సాధించొచ్చు. అపార్ట్‌మెంట్స్‌ లైఫ్‌లో మెట్ల వాడకమే తగ్గిపోయింది. లిఫ్ట్‌ని లిమిటెడ్‌గా వాడి, మెట్ల వైపు కూడా ఓ లుక్కేస్తే, కొంతవరకూ శారీరక వ్యాయామానికి అక్కడి నుండే పునాది వేసినట్టవుతుంది. మెట్లు ఎక్కి దిగడం వల్ల కలిగే ప్రయోజనం అంతా ఇంతా కాదట. అలాగే చిన్న చిన్న దూరాలకు నడకను ఆశ్రయించడం వల్ల కూడా శరీరానికి శ్రమ కలిగించినవాళ్లమవుతాం. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాఠిస్తూ, వీలైనంతలో డైట్‌ నియమాల్ని అనుసరిస్తే, క్విట్‌ థాట్స్‌ జోలికి పోకుండా ఉంటే, హెల్దీయెస్ట్‌ ఫిట్‌నెస్‌ మన సొంతమేగా.!

మరిన్ని శీర్షికలు
Game with her .