Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
check

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆన్‌లైన్‌కి 'అతి'గా అతుక్కుపోతున్నారు.! - ..

online

ఆన్‌లైన్‌.. పరిచయమే అక్కర్లేని పదమిది. 'జనతా గ్యారేజ్‌'.. ఇచ్చట అన్నీ రిపేర్‌ చేయబడును..' అన్నట్లుగా, 'ఆన్‌లైన్‌' ఇక్కడ అన్ని వ్యవహారాలూ చక్కబెట్టేయొచ్చు. అదీ ఆన్‌లైన్‌కి పక్కా డెఫినేషన్‌. ఇప్పుడు మనం ఈ టాపిక్‌ గురించే చర్చించుకోబోతున్నాం. అయితే, ఆన్‌లైన్‌లో బిజినెస్‌ చేయొచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు.. సీరియళ్లు, సినిమాలూ వంటి ఎంటర్‌టైనింగ్‌ ప్రోగ్రామ్స్‌తో పాటు బూతు ప్రోగ్రామ్‌లు కూడా విచ్చలవిడిగా వీక్షించొచ్చు.. షాపింగ్‌, ఎక్సట్రా వంటి ఇలా ఒక్కటేమిటీ పైన చెప్పుకున్నాం కదా.. అన్ని వ్యవహారాలూ చక్కబెట్టేయొచ్చు. అయితే, ఈ ట్రెండ్‌ ఎంత ప్రమాదకరంగా మారిపోయిందంటే, సర్వ రోగాలకు ఇదే మూలంగా తయారైందిప్పుడు. టెక్నాలజీని వినియోగించుకోవడం మంచిదే. కానీ, దాన్ని సద్వినియోగ మార్గంలో ఎంతమంది వినియోగిస్తున్నారు అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

సగటున ఆన్‌లైన్‌ చూస్తున్న వారి సంఖ్య ఎంతో తెలుసా.? యావరేజ్‌ 103 నిముషాలు అని మానసిక నిపుణులు తెలియజేస్తున్నారు. నిజానికి విదేశాల నుండి పునికి పుచ్చుకున్న సాంప్రదాయమే ఈ ఆన్‌లైన్‌ వ్యవహారం. విదేశాల్లో ఈ ప్రొసెస్‌ని వినియోగించడంలో కొన్ని పద్ధతులు, పడిగట్లున్నాయి. అందువల్ల ఆక్కడ ఈ ప్రొసెస్‌తో ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ, ఇండియాలోకొచ్చేసరికి ప్రతిదీ వేలం వెర్రిలా తయారైంది. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. మీకిది తెలుసా.? ఆన్‌లైన్‌ యూజ్‌ చేస్తున్న వారిలో ఇండియాలో ఉన్నంత విచ్చలవిడితనం మరెక్కడా లేదని తాజా అధ్యయనాల్లో వెల్లడి అయ్యాయి. అవును కదండీ.. ఆవు పేడ కూడా ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా.? అందుకే, ఆన్‌లైన్‌ చూసే వారి సంఖ్య అంతలా పెరిగిపోయింది. యూజింగ్‌ బాగానే ఉంది. మరి ఈ యూసేజ్‌ వెనక దాగిన సమస్యల్ని బొత్తిగా పట్టించుకోవడం లేదు. సైబర్‌ క్రైమ్స్‌తో పాటు, రకరకాల రోగాల బారిన పడేందుకు ఈ డేంజరస్‌ ట్రెండ్‌ వెర్రి తలలు వేస్తోంది.

ఈ ప్రమాదకరమైన ట్రెండ్‌కి అలవాటు పడడంతో, శృతి మించిన సైబర్‌ క్రైమ్స్‌ తద్వారా ఆత్మహత్యలు, హత్యలు. . ఇదీ నేటి సమాజం పరిస్థితి. ఇక రోగాల విషయానికొస్తే, గంటల తరబడి ఆన్‌లైన్‌కి అతుక్కుపోవడం వల్ల వచ్చే వ్యాధులకు మందులతో పరిష్కారాలు లభించడం లేదు కూడా. తద్వారా హెల్త్‌ ఇష్యూస్‌ బాగా ఎక్కువైపోతున్నాయి. శారీరక రుగ్మతల కంటే, మానసిక రుగ్మతలు పెరగడానికి కూడా ఈ నయా ట్రెండే కారణమవుతోందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మతిమరుపు, కంటిచూపు మందగించడం వంటి సెన్సిటివ్‌ హెల్త్‌ ఇష్యూస్‌ తలెత్తుతున్నాయి. అంతేకాక, సమాజంపై చెడు ప్రభావం చూపేలా యువతను ప్రేరేపిస్తోంది కూడా. సో ఈ ప్రమాదాన్ని ఇప్పటికైనా గమనించి, యువతరమే దీనికి ఓ పరిష్కారం ఆలోచించాలి. ఈ జనరేషన్‌ సంగతి సరే, ఇక తదుపరి జనరేషన్‌ అయినా ఈ మాయదారి ట్రెండ్‌కి కాస్తయినా దూరంగా ఉండేలా మన జనరేషన్‌ సరైన పరిష్కార మార్గాన్ని అన్వేషించాల్సిన ఆవశ్యకత ఉంది. లేదంటే, ఈ మహమ్మారి కారణంగా భవిష్యత్‌లో ఇంకెన్ని వింత పరిణామాలు చవి చూడాల్సి వస్తుందో ఊహించడమే కష్టమని టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ సలహా. సో మై డియర్‌ యూత్‌ తస్మాత్‌ జాగ్రత్త.

మరిన్ని శీర్షికలు