Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

'సైరా..' తండ్రిని గెలిపించిన తనయుడితడేరా.! - ..

Her father won the father.!

'తండ్రికి తగ్గ తనయుడు', 'తండ్రిని మించిన తనయుడు'.. అంటూ రకరకాల కొటేషన్స్‌ చాలానే విన్నాం. అయితే, తండ్రి నుండి వారసత్వం అంది పుచ్చుకోవడం వేరు. అలా అందుకున్న వారసత్వాన్ని నిలబెట్టుకోవడం వేరు. అన్నింటికీ మించి తండ్రి కోసం ఆయన కల నెరవేర్చడం కోసం తన కెరీర్‌నే పణంగా పెట్టడం వేరు. అదే చేస్తున్నాడిప్పుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. పేరుకు ముందు 'మెగా', 'పవర్‌' అనే బిరుదులు ఊరికే రాలేదు ఆయనకు. అలా వచ్చిన పేర్లను ఊరికే ఉంచలేదు కూడా. కొడుకు అడిగాడని తండ్రి ఎంత కష్టమైనా ఆ కోరిక తీర్చడం మామూలే. కానీ, తండ్రి కల కోసం తాను ఎంతలా కష్టపడ్డాడో చరణ్‌ని చూసి నేర్చుకోవాల్సిందే. కొడుకుగా తండ్రి చిరంజీవి నుండి అందుకున్న నట వారసత్వాన్ని నిలబెట్టేశాడు చరణ్‌. అక్కడితో తన పని అయిపోయిందనుకోలేదు. తన తండ్రికి జీవితంలో ఓ గొప్ప బహుమతిని ఎలా ఇవ్వగలనా.? అని ఆలోచించాడు. ఆ ఆలోచన నుండి పుట్టిందే 'సైరా నరసింహారెడ్డి' సినిమా. చరిత్ర మర్చిపోయిన ఓ గొప్ప వ్యక్తి జీవిత గాధతో తన తండ్రికి చరిత్రలో ఎప్పటికీ మర్చిపోని బహుమతి అందించాడు.

బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకోలేదు. ఎక్కడా రాజీ పడలేదు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ని అస్సలు అంచనానే వేయలేదు. అతి పెద్ద సాహసానికి తెర లేపాడు. నిజానికి నటుడిగా ఉన్నప్పుడు నిర్మాతగానూ కొన్ని సాహసోపేతమైన సినిమాలు చేశాడు చిరంజీవి కూడా. కానీ, చరణ్‌ చేసిన సాహసం ముందు అవన్నీ చిన్నవే అనిపిస్తాయి. ప్రస్తుతం హీరోగా ఎంతో బిజీ చరణ్‌. తనకున్న స్టార్‌డమ్‌కి నిర్మాతగా మారి సినిమాలు చేయడం అంటే.. అది కూడా మెగాస్టార్‌ వంటి ఓ గొప్ప నటుడితో సినిమా అంటే అంతకు మించిన సాహసం మరోటి ఉండదనే చెప్పాలి. ఫస్ట్‌ అటెంప్ట్‌గా 'ఖైదీ నెంబర్‌ 150' రూపొందించాడు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత తండ్రిని హీరోగా రీ ఎంట్రీ చేయించాడు. రికార్డులు కొల్లగొట్టించాడు. ఇక ఇప్పుడు చారిత్రాత్మక చిత్రంతో మరో గొప్ప అనుభూతిని ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాడు.

కొడుకుగా తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడం సహజమే. కానీ, నిర్మాతగా తన తండ్రిని మాత్రమే కాదు, సెట్‌లో సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కర్నీ చాలా జాగ్రత్తగా చూసుకునేవాడట. ఈ విషయాన్ని ఈ సినిమా కోసం పని చేసిన స్టార్‌ నటీనటుల నోట వినడం విశేషం. జగపతిబాబు వంటి ఎన్నో సినిమాల్లో నటించి, నిర్మించి, సినిమాల్లో ఎంతో అనుభవం ఉన్న జగపతిబాబు వంటి వ్యక్తి, తన తండ్రితో సమానంగా మా అందరి బాగోగుల్ని ప్రతీ క్షణం కనిపెడుతూ ఉండేవాడు చరణ్‌.. అంటూ చరణ్‌ అపూర్వమైన వ్యక్తిత్వాన్ని మనసారా అభినందించడం నిజంగా అరుదైన విషయం. ఒక్క జగపతిబాబే కాదు, ఇతర ఇండస్ట్రీలకు చెందిన అమితాబ్‌ బచ్చన్‌ కావచ్చు.. సుదీప్‌ కావచ్చు, విజయ్‌ సేతుపతి కావచ్చు ఇలా ప్రతీ ఒక్కరూ చరణ్‌ని అభినందిస్తున్నారు ఆ విషయంలో. పెద్దల పట్ట గౌరవం, వినమ్రతా భావానికి ముగ్ధులైపోయి ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. ఇంత తక్కువ అనుభవంతో, ఇంత చిన్న వయసులో నిర్మాతగా చరణ్‌ క్వాలిటీస్‌ ఎంత గొప్పవో వీరందరి మాటల్లో అర్ధం చేసుకోవచ్చు.

ఓ పక్క హీరోగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో బిజీగా ఉంటూనే, మరోపక్క నిర్మాతగా 'సైరా' పనులను ఎంతో బాధ్యతగా నిర్వహిస్తోన్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నేటి తరానికి ఎంతో ఆదర్శ ప్రాయం.

మరిన్ని శీర్షికలు
mulakkaya royyalu