Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cartoonist babu  is no more

ఈ సంచికలో >> శీర్షికలు >>

దసరా అచ్చమైన సరదా - కొత్తపల్లి ఉదయబాబు.

dasara

దసరా - అంటే అచ్చమైన సరదా...ఆనాటి మా రోజుల్లో.దసరా పండుగ వస్తోంది అంటే దేవుని యెడ భక్తీ, పెద్దల పట్ల గౌరవం, పిల్లలందరి మధ్య మాలిన్యం లేని నిర్మల స్నేహం. పన్నెండు రోజుల దసరా సెలవులు ఇచ్చినప్పుడు బడి జరిగిన ఆఖరి రోజు  ఏ తరగతివారు ఆ తరగతి గదిని శుభ్రం చేసుకుని  మావిడి తోరణాలు కట్టి, రంగుల కాగితాలతో అలంకరించి, గదినిండా అందమైన రంగవల్లులు దిద్ది తోటి విధ్యార్ధులతో పోటీ పడేవాళ్ళం.

ఆ రోజుల్లో ఉపాద్యాయులందరూ చక్కగా పంచె కట్టి, లాల్చీ వేసుకుని, పైన కండువా ధరించి నుదుట నిలువుగా నామాన్ని ధరించి  విద్యార్ధి జీవితానికి నిజమైన మార్గదర్శి అయిన ‘’గురువు’ ల్లా వ్యవహరించేవారు. విద్యార్దుల పట్ల ప్రేమ, అభిమానాలు ప్రదర్శిస్తూ, తప్పు చేసినప్పుడు  మందలిస్తూ, నేరం చేసినప్పుడు శిక్షిస్తూ, బాగా చదివినప్పుడు అభినందిస్తూ, సరిగ్గా చదవలేనివారిని ప్రోత్సహిస్తూ, వారికోసం  బోధించిన పాఠమును అవసరమైతే మళ్ళీ బోధించి, అన్ని సందేహాలను నివృత్తి చేస్తూ, ఈనాటి విద్యార్ధులు రేపటి పౌరులు అనే నానుడి నిజమయ్యేలా వృత్తిధర్మాన్ని నూటికి నూరు పాళ్ళు దైవసేవగా భావించి పనిచేసేవారు. అంతే కాదు.

వూరి వారందరికీ ఆయనే పరోక్షడైవం.ఆయన మాటే శిరోధార్యం.ఆయనే మానసిక, శారీరక వైద్యుడు కూడా. వూరిలో ఎవరు తప్పు చేసినా చదువుకున్న విజ్నుడైన ఉపాధ్యాయుడే న్యాయనిర్ణేతగా గౌరవింపబడేవాడు. కడుపు నిండా తిన్నా తినకపోయినా వూరి ప్రజల సేవే పరమావధిగా బతికేవాడు.ఆయనకుగల అవసరాలన్నీ గ్రామస్తులు ఎంతో వినయంతో, భక్తీ శ్రద్ధలతో తీర్చేవారు.

ఇక విధ్యార్దులమైన మాకైతే అటువంటి ఉపాధ్యాయులందరూ గురుర్భ్రహ్మా...కు ప్రతిరూపాలే.దసరా సెలవు రోజుల్ ఉపాధ్యాయుల వెంట కొత్తబట్టలు కట్టుకున్ న పిల్లలందరూ ‘గిలకలు’ (పూలబాణాలూ)ధరించి గ్రామమంతా ముఖ్యంగా  విద్యార్ధుల ఇళ్ళకు  తిరిగేవారమని మా తాతగారు చెబుతూ ఉండేవారు.మా తరం లో అయితే ఆ విద్యార్ధుల ఇళ్ళకు వెళ్లి పెద్దలను ఆశీర్వదించేవారు . పిల్లలందరి చేతా ‘’అయ్యవారికి చాలు అయిదు వరహాలు-పిల్లవాళ్ళకు చాలు పప్పుబెల్లాలు’’  అంటూ రకరకాల దసరా పద్యాలు పాడించేవారు.ఇంటికి వచ్చిన గురుదేవులకు కొత్త బట్టలు పెట్టి గౌరవించేవారు గృహస్తులు.పిల్లలకు గుల్ల సెనగ పప్పు, మరమరాలు, బెల్లం ముక్కలు కలగలిపిన మిశ్రమాన్ని పంచిపెట్టేవారు. డబ్బున్న కామండులైతే పిల్లలకు కొత్త మట్టి పలకలు, బలపాలు పంచిపెట్టేవారు.

ఒకవేళ సెలవులకు అమ్మమ్మగారి వూరు వెళ్తే అక్కడ ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గోనేవాళ్ళం.అక్కడి ఉపాద్యాయులు ‘నువ్వు ఫలానా జగన్నాధంగారి మనవడివా?ఎం చదువుతున్నావురా? రెండు వేమన పద్యాలు అప్పగించు. ‘అని అడిగి వాటిని వల్లెవేసాకా ‘బాగా చదువుకో..అమ్మానాన్నల పేరు నిలబెట్టాలి తెలిసిందా? పెద్దలు చెప్పిన మాట విన్నవాడు ఎప్పుడూ చెడిపోదు సరికదా..విన్ ఉపయోగించుకుంటే  ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.నీ అభీష్టం నెరవేరు గాక.’’ అని మనస్పూర్తిగా దీవించేవారు.అలా ఉపాధ్యాయులకు బట్టలు పెట్టి దక్షణ తాంబూలాలు ఇచ్చే వ్యవస్థ ఈనాడు ‘కేవలం ‘’ డబ్బు’’ మాత్రమె తాంబూలంగా ఇంకొక పదంలో పచ్చిగా చెప్పాలంటే ‘’మామూలు’’ లేదా ‘’లంచం’’ గా రూపాంతరం చెందింది.

ఆనాడు బతకలేక బడిపంతులు. కానీ ఈనాడు బతికితే బడిపంతుల్లా బతకాలి.అందులోను భార్యా భార్తలిద్దరూ ఉపాధ్యాయులైతే నెలకు లక్షరూపాయలు కళ్ళచూసినట్టే. అయితే ఎంతజీతం వస్తే మాత్రం ఎం ప్రయోజనం. దసరా వస్తోందంటేనే ‘సరదా’ వలస వెళ్ళిపోతోంది ‘మామూళ్ళ’’ పేరుతొ. ఒక జీతం జీతం మామూళ్ళుగా వెళ్లిపోతుంటే  మధ్యతరగతి కుటుంబీకుడు ఏడవలేక నవ్వుతూ పండగ  జరుపుకుంటున్నాడు.

ఇంట్లో పనిచేసే పనిమనిషి మొదలు...ప్రతీ వాడికీ దసరా మామూలే. ఎవరైతే దక్షిణ తాంబూలాలు అందుకుని గౌరవింపబడ్డారో ఆ ఉపాధ్యాయులు కూడా మామూళ్ళు సమర్పించుకుంటున్నారు. దేశంలో ఏ ప్రభుత్వ ఆఫీసులో ఎంత చిన్న పని జరగాలన్నా ‘’మామూలు’’ సమర్పించుకునే తప్పని పరిస్థితి.ఈ ‘’మామూళ్ళ’’తోనే ప్రభుత్వ అధికారులు తమ వంశపు పది తరాలకు సరిపడా సంపాదిచేస్తోంటే, చిన్నపాటి ఉద్యోగులు బైక్ లు, కార్లు కొనుక్కునే స్థాయికి ఎదిగారు.ఎదుగుతున్నారు. ఉపాధ్యాయులు కేవలం ఉపాధ్యాయ దినోత్సవం నాడు మాత్రమె గౌరవింపబడుతూ సమాజ ప్రవాహంలో ఉన్నంతలో సుఖంగా బతుకుతున్నారు. ఇదీ నా అనుభవం లో నాకు తెలిసి ‘’మామూలు’’ గా  మొదలైన మామూళ్ళ కధ. ఇది చదివిన ప్రతీ ఒక్కరికీ దసరా శుభాకాంక్షలతో.

మరిన్ని శీర్షికలు
just remember it