Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

మేడ్ ఇన్ హెవెన్ లఘు చిత్రసమీక్ష - ..

Made In Heaven Short Film | Telugu Short Film | UV Sushma | Vinay CH | Rashmi Mayur | Madhura Audio
చిత్రం పేరు : మేడ్ ఇన్ హెవెన్
నిర్మాణం : బ్రోచిల్ ఎంటర్ టెయిన్ మెంట్
కథ, ఎడిటింగ్, దర్శకత్వం : రష్మి మయూర్ కొయ్యాడ
ఆడియో : మధుర ఆడియో
మీడియా పార్టనర్ : గోతెలుగు. కాం.
 
కథేంటంటే.....
బిజీగా ఉన్న ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని చాంబర్ లో కి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఆరోజు ముక్కోటి ఏకాదశి కనుక చీరకట్టులో సంప్రదాయాంగా వచ్చానని చెప్తుంది. ఆమె అందరితోబాటు ఇంటర్వూకి వచ్చిందనుకున్న అతడికి మాటల క్రమంలో అతడికి వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది...ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది...ఏం జరిగాయి, వీళ్ళిద్దరి పరిచయం ఇప్పుడే మొదలా, అంతకు ముందా? ఎలా అనేది రివ్యూలో కంటే డైరెక్టుగా చూస్తేనే ఆసక్తిగా ఉంటుంది.
 
ఎలా ఉందంటే....
పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయని విశ్వసించే హీరోయిన్ భావాలే దర్శకుడివిగా భావించొచ్చు. ఎందుకంటే కథాంశం అంతా ఈ నమ్మకం చుట్టూనే తిరుగుతుంది. నిరంతరం పని పని పని అంటూ బిజీగా ఉండే అబ్బాయి..అతడికి ఎల్లవేళలో తోడుంటానని మాటిచ్చిన అమ్మాయి..ఇద్దరి మధ్యా సంభాషణలు చిన్నచిన్నగా...పొడిపొడిగా బాగున్నాయి. కాబోయే లైఫ్ పార్టనర్స్ మధ్య ఎక్స్ పెక్టేషన్స్ ఏమేముంటాయి ఏవి ఎంత స్పష్టంగా ఏవి ఎంత అస్పష్టంగా ఉంటాయో వాళ్ళ మాటల ద్వారా దర్శకుడు బాగా ఎలివేట్ చేయగలిగాడు. అలాగే వయసులో ఆకర్షణ-మోహం, పరిపక్వమైన ప్రేమల మధ్య వ్యత్యాసాన్ని కూడా అతి తక్కువ నిడివిలో అందంగా చెప్పగలిగాడు దర్శకుడు. హీరొ, హీరొయిన్లు సహజం గా నటించారు. మ్యూసిక్ కొంచం డోమినేట్ చేసినా చాలా బాగుంది.
 
ఒక్కమాటలో చెప్పాలంటే....
పూర్తి యూత్ ఫుల్ షార్ట్ ఫిల్మ్ అయినా, అందరూ చూడదగినట్టు నీట్ గా ప్రెజంట్ చేసాడు దర్శకుడు రష్మి మయూర్. ఎన్నో షార్ట్ ఫిలింస్ తీసిన అనుభవం ఉన్నా, వాటన్నిటికంటే ఇందులో దర్శకత్వంలో చాలా పరిపక్వత కనిపిస్తుంది. ఆడియో కూడా ఎక్కడా విసుగు తెప్పించకుండా హాయిగా ఉంటుంది... పదహారు నిముషాల ఈ షార్ట్ ఫిల్మ్ లో లీనమైన ప్రేక్షకులకు సమయం ఇట్టే గడిచిపోయినట్టనిపిస్తుంది... ఇప్పటికే యూట్యూబ్ లో డెబ్భైవేల మార్కును దాటేసి... మళ్ళీమళ్ళీ చూస్తున్న ప్రేక్షకులతో దూసుకెళ్తుంది.
 
యూత్ ని ఆకట్టుకునే విధంగా చిత్రాలను రూపొందించగలనని ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా నిరూపించుకున్న రష్మిమయూర్ త్వరలో వెండితెర దర్శకుడు కావాలని అద్భుతమైన విజయాలందుకోవాలని ఆశిస్తూ శుభాభినందనలందజేస్తోంది గోతెలుగు. 
 
క్రింది లింక్ ద్వారా ఈ లఘు చిత్రాన్ని చూసి ఆనందించండి.
మరిన్ని శీర్షికలు
naa jnaapakaallomchi