Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mega titles

ఈ సంచికలో >> సినిమా >>

మెగా ప్రిన్స్‌కి తండ్రిగా హీరో మాధవన్‌.!

Hero Madhavan as father of Mega Prince!

తమిళ స్టార్‌ హీరో మాధవన్‌ తెలుగు సినిమాలపై బాగానే దృష్టి పెట్టినట్లున్నారు. అయితే, హీరోలకు పోటీ కాకుండా, విలక్షణ పాత్రలు ఎంచుకుంటున్నారు తెలుగులో. ఆల్రెడీ నాగచైతన్యతో 'సవ్యసాచి' సినిమా కోసం విలన్‌గా మారారు. రొమాంటిక్‌ హీరోగా మాత్రమే అంతవరకూ మాధవన్‌ని చూసిన ఆడియన్స్‌ విలన్‌ పాత్రలో మ్యాడీని బాగానే ఆదరించారు. అయితే, సినిమా ఆశించిన రిజల్ట్‌ అందుకుని ఉంటే బాగుండేది. రిజల్ట్‌ రివర్స్‌ గేర్‌ వేసింది. ఇక ఇప్పుడు మరో యంగ్‌ హీరో సినిమాలో విలక్షణ పాత్రను ఎంచుకున్నారనీ తెలుస్తోంది. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటిస్తోన్న 'బాక్సర్‌' సినిమాలో హీరో తండ్రి పాత్ర కోసం మాధవన్‌ని అడిగారట.

ఆ పాత్రలోని వేరియేషన్స్‌ మ్యాడీని బాగా ఎట్రాక్ట్‌ చేశాయట. దాంతో ఆ ప్రాజెక్టుకు సైన్‌ చేశారనీ తెలుస్తోంది. అంటే మాధవన్‌, వరుణ్‌ తేజ్‌ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారన్న మాట. అయితే, ఈ విషయమై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌ పాత్రలో సరికొత్త లుక్స్‌తో కనిపించనున్నాడు ఈ సినిమాలో. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది ఈ చిత్రం. బాక్సింగ్‌లో మెలకువల కోసం వరుణ్‌ తేజ్‌, గత కొన్ని నెలలుగా ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా కబుర్లు
mass raja