బాలివుడ్ సుందరి ప్రియాంకచోప్రా నటనాప్రతిభ ప్రేక్షకులకు కొత్తేం కాదు....అంతకన్నా ఓ అడుగు ముందుకేసి ఈమధ్యే ద స్కై ఈజ్ పింక్ అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగానూ మంచి మార్కులే కొట్టేసింది. హాలివుడ్ సింగర్ నిక్ జొనాక్ ను పెళ్ళి చేసుకున్న తర్వాత ప్రియాంకను చాలామంది మీఆయనతో కలిసి ఎప్పుడు పాడుతున్నారు ? అని అడుగుతున్నారట........దానికి ప్రియాంక ఏం చెబుతోందంటే...నేనా మా ఆయనతో కలిసి పాడడమా....అని గారాలు పోతోందట....
అమ్మో ఆయన బాగా పాడుతారు...ఆయనముందు నేనస్సలు పాడలేను బాబూ...అని వయ్యారాలు పోతోందట....ఇంకా వాళ్ళాయన పాటల కబుర్లేం చెబుతోందంటే...వాళ్ళాయన పొద్దున్నే లేచి సంగీత సాధన మొదలెట్టేస్తాడట...అదే స్థాయిలో ఉంటుందంటే...తనకింకే సౌండ్ బాక్సులూ అక్కర్లేదట....తను నిద్ర లేవడానికి ఇంకే అలారమూ అక్కర్లేదట....ఆయన సంగీత సాధనకి ఇట్టే నిద్రమేల్కొంటుందట....ఇంతకీ ప్రియాంకా తనను సంగీతసాధనతో నిద్ర లేపుతున్నందుకు వాళ్ళాయనను పొగుడుతోందా, లేక పొద్దున్నే రాగాలాపనతో తన నిద్ర చెడగొడుతున్నాడని విసుక్కొంటోందా?
|