Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

అప్పుడే సీక్వెలా?

Then the sequel?

ఆలూ లేదు చూలూ లేదు అప్పుడే కొడుకుపేరు సోమలింగమా అనేది పాత సామెత. ఈ సిన్మా వివాదాల నుంచి బయట పడనే లేదు...అప్పుడే సీక్వెలా అని ఆశ్చర్యపోతున్నారు జనాలు...ఇంతకీ ఏమిటా సిన్మా? సీక్వెలేంటి ?? ఇంకెవరు వివాదాల మారుపేరు వర్మ నిర్మించిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మా గురించే. వర్మ సినిమాల్లో నాటకీయత ఉండదు....పాత్రలు, హావభావాలు...సన్నివేశాలు సహజంగా ఉంటాయి...అలాగే ఎంచుకునే కథలూ, పాత్రలూ నిజమైనవి, ప్రజలకు బాగా పరిచయమున్నవే. ఈ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కూడా వాటికి తీసి పోయిందేమీ కాదు. ఇందులో పవన్ కళ్యాణ్ ను పోలిన పాత్ర ఉంటుందని స్వయంగా వర్మే చెబుతున్నాడు. జనసేన బదులు మనసేన అని పేరు మార్చారట. చంద్రబాబు పాత్ర కూడా అతికినట్టు సరిపోయిందని అంటున్నారు...

ఇక ముఖ్యంగా చెప్పుకోవలసింది కె.ఏ పాల్ పాత్ర గురించి..తనను మరీ కించపరిచేట్టు చూపించారని కే.ఏ. పాల్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ లబోదిబోమంటున్నాడు. కోర్టులో కేసు కూడా బుక్ అయ్యింది....అయినా నా సిన్మాలకు కేసులేం కొత్త కాదుగా అంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా చెప్తున్నాడు వర్మ...బాగుంది...కమ్మరాజ్యంలో కడపరెడ్లు-2 కి కూడా కేసులు సిద్ధం చేసుకోమని వర్మ విసురుతున్న సవాల్ లా లేదూ....

మరిన్ని సినిమా కబుర్లు
I don't want to ...