Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
swami vivekananda biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (జనవరి 17 - జనవరి 23) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు బంధుమిత్రులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆలోచనల్లో కాస్త తడబాటు కనబడినను పెద్దల సహకారంతో వాటిని అధిగమించే అవకాశం ఉంది. నూతనవస్త్ర ప్రాప్తిని పొందుతారు. విందులు, వినోదాలలో పాల్గొనే ఆస్కారం ఉంది. సమయాన్ని వాటికి గడిపే ఆస్కారం ఉంది. ఒక చిన్న సూచన కుటుంబంలో తీసుకొనే నిర్ణయాల విషయంలో మాత్రం తొందరపాటు వద్దు. ఉద్యోగంలో కొంత నిరాశను పొందు అవకాశం ఉంది. సోదరులతో చేయుచర్చలలో ఫలితం ఆశించక పోవడం మంచిది. అనుభవజ్ఞుల సలహాలు ఉపయోగ పడుతాయి. విధ్యార్థులకు ఉపాధ్యాయుల సూచనలు పాటించుట వలన లాభంను పొందుతారు, ఉన్నతవిధ్యను అభ్యసించే వారికి అనుకూలమైన సమయం. ఉద్యోగులకు అనవసరపు ఖర్చులు, ప్రయాణాలు తప్పక పోవచ్చును, వ్యాపారవేత్తలకు అధికారులతో ఉన్న మంచి సంబంధాల చేత అనుకున్న పనులను నెరవేర్చుకోగలుగుతారు, నూతన ప్రయత్నాల విషయంలో మాత్రం ఆలోచన అవసరం. కళారంగంలో ఉన్నవారికి పెద్దల అండదండలతో అభివృద్దిని సాధిస్తారు, నూతన అవకాశాలను అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయండి మంచిది.

వృషభ రాశి
ఈవారం మీరు పూజాదికార్యక్రమాలకు సమయాన్ని ఇచ్చుటకు అవకాశం ఉంది. నలుగురిలో గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు. పెద్దలను కలుస్తారు వారితో చర్చలలో పాల్గొంటారు, వారిమూలన లాభంను పొందుతారు. ఊహించని ఖర్చులు పొందుతారు, బంధువులతో కలిసి చేపట్టిన పనులలో మాటపట్టింపులకు పోకపోవడం వలన మేలు జరుగుతుంది. పనులలో మొదట్లో ఉన్న ఉత్సాహం చివరి వరకు కొనసాగించే ప్రయత్నం చేయుట ఉత్తమం. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. సమయానికి భోజనం చేసే ప్రయత్నం చేయుట, ఆరోగ్యానికి ప్రాముక్యత ఇవ్వడం సూచన. విధ్యార్థులకు నూతన విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని కనబరుస్తారు, ప్రోత్సాహం అందిస్తే మంచిఫలితాలను పొందు అవకాశం ఉంది. ఉన్నతవిధ్యకోసం చేయు ప్రయత్నాలు మంచిఫలితాలను ఇస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చుటకు అవకాశం ఉంది. అధికారులతో మీకున్న సత్సంబందాలు ఉండటం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి. వ్యాపారవేత్తలకు ఖర్చులు పెరుగుతాయి, అదేవిధంగా ఆదాయం కూడా పెరుగుటకు అవకాశం ఉంది. కళారంగంలో ఉన్నవారికి గతంలో చేసిన పనులకు గాను పెద్దలతో గుర్తింపును పొందుతారు.

మిథున రాశి
ఈవారం మీరు వ్యతిరేకవర్గం నుంచి ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు చిన్న చిన్న సమస్యలు తప్పక పోవచ్చును. పనులలో శ్రమను పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త. మాటలను పొదుపుగా వాడుట సూచన. మీ ఆలోచనలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకొనే అవకాశం ఉంది  ఆచితూచి వ్యవహరించుట మంచిది. వారం మధ్యలో పనులలో వేగం పెరుగు సూచనలు కలవు ప్రయత్నం పెంచుట ఉత్తమం. బంధుమిత్రులతో మాత్రం మాటపట్టింపులకు పోకపోవడం మేలు నిదానం అవసరం. చేయువృత్తిలో చిన్న చిన్న తప్పులు జరుగు ఆస్కారం ఉంది జాగ్రత్త. కుటుంబంలో సర్దుబాటు విధానం అవసరం. విధ్యార్థులకు చిన్న చిన్న విషయాలకే ఖర్చుపెరుగు సూచనలు కలవు, సమయపాలన పాటించుట ఉత్తమం. ఉన్నతవిధ్యను అభ్యసించే వారు ముందుచూపును కలిగి ఉండుట మేలు. ఉద్యోగులకు ప్రయాణాల వలన, పనిభారం చేత శ్రమను పొందుతారు. కొన్ని విషయాల్లో నిరాశ ఉంటుంది. వ్యాపారవేత్తలకు అనుకోని ఖర్చులు కలుగుతాయి, అదేవిధంగా నూతన పనులను చేపట్టకపోవడం ఉత్తమం. కళారంగంలో ఉన్నవారికి నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. బాగాఆలోచించి పనుల పరంగా నిర్ణయాలు తీసుకోవడం చేయండి.

కర్కాటక రాశి
ఈవారం మీరు ఉత్సాహంను కలిగిఉండి నూతన పనులను చేపడుతారు. ఆర్థికంగా నూతన అవకాశాలు కలుగుతాయి, కొత్త కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు ఆరంభిస్తారు. పనులను చేపట్టుటలో మాత్రం నిదానం వహించుట వలన తప్పక మేలుజరుగుతుంది. ఇష్టమైనవారిని కలుస్తారు వారితో చర్చలు చేయటకు అవకాశం ఉంది. నచ్చినపనులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. కుటుంబంలో సభ్యుల ఆరోగ్యరీత్యా ఇబ్బందులు తప్పకపోవచ్చును మానసికంగా దృడంగా ఉండుట మంచిది. అధికారులకు అనుగుణంగా నడుచుకోండి వారి సూచనలు, సలహాలను పాటించుట ఉత్తమం. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును, స్థానచలనం నకు అవకాశం ఉంది. విధ్యార్థులకు శ్రద్ద పూర్తిస్థాయిలో ఉండు అవకాశం లేదు కావున వారికి అర్థం అయ్యేలా చెప్పే ప్రయత్నం పెద్దలు చేయండి. ఉన్నతవిధ్యను అభ్యసించే వారికి అనుకోని ఖర్చులు, ప్రయాణాలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఉద్యోగులకు పనిభారం తప్పక పోవచ్చును. వ్యాపారవేత్తలకు ఇబ్బందులు తప్పకపోవచ్చును. నూతన ప్రయత్నాలు చేయకండి గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయండి. కళారంగంలో ఉన్నవారికి ఆవకాశాలు కలుగుతాయి కాకపోతే జాగ్రత్తగా వ్యవహరించక పోతే ఊహించని విధంగా వివాదములు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త.

సింహ రాశి
ఈవారం మీరు చేపట్టిన పనులలో అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. నూతనవిషయాల పట్లఆసక్తిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుటకు అవకాశాలు పెరుగుతాయి. అధికమైన ఆలోచనలు కలిగిఉన్నను ఉత్సాహంతో నలుగురిని కలుపుకొని వెళ్ళుట చేత విజయాలను నమోదుచేయు అవకాశం కలదు. బంధువులను కలిసి వారితో సమయాన్ని గడుపుతారు. చర్చలకు ప్రాముఖ్యతను ఇస్తారు చర్చాసంబంధమైన విషయాల్లో ఆసక్తితో పాల్గొను అవకాశం ఉంది. వినోదాలలో పాల్గొనుటకు ఇష్టంను కలిగి ఉంటారు. అందరికీ ఉపయోగపడే ఆలోచనలు చేయుట వలన నలుగురిలో గుర్తింపును పొందుతారు. క్రిందిస్థాయి వారిమూలన లాభంను పొందుతారు. విధ్యార్థులకు మేలుగా ఉంటుంది ప్రతి విషయానికి హైరానా చెందుతారు కావున నిదానం అవసరం. పెద్దలకు అనుగుణంగా నడుచుకోండి మంచిది. ఉన్నతవిధ్య అభ్యసించే వారికి మాత్రం మంచిఫలితాలు కలుగుతాయి. ఉద్యోగులకు బాగుంటుంది తమపనులను పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు మిశ్రమఫలితాలు కలుగుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట ఉత్తమం. కళారంగంలో ఉన్నవారికి బాగుంటుంది కొత్త అవకాశాలు కలుగుతాయి.
 

కన్యా రాశి
ఈవారం మీరు మొదట్లో ఉత్సాహంను కలిగి ఉండి మధ్యలో కొంత అసహనానికి లోనయ్యే అవకాశం ఉంది, చివర్లో కొంత ప్రయత్నం పెంచు ప్రయత్నం చేయండి మంచిది. చేపట్టిన పనులలో బంధువులు, మిత్రుల వలన అనుకున్న దానికన్నా అధికమైన ఖర్చును పొందుటకు అవకాశం ఉంది. స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త, ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు. బంధువులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం ఉంది కలహాములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళతో పరిచయాలు కలుగుటకు ఆస్కారం ఉంది. విధ్యార్థులకు కొంత శ్రమించుట చేత చక్కటి ఫలితాలు పొందుతారు, సమయాన్ని పెద్దలతో సంతోషంగా గడుపుతారు. ఉన్నతవిద్యను అభ్యసించే వారికి బాగుంటుంది కాకపోతే అనవసరపు విషయాలకు దూరంగా ఉండుట మంచిది. ఉద్యోగులకు మాట చేత పనులు జరుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. వ్యాపారవేత్తలకు పనులలో అనుకోని చిక్కులు పొందుతారు. కార్యఆలస్యం అవుతుంది ఓపికను కలిగి ఉండుట మంచిది. కళారంగంలో ఉన్నవారికి బాగుంటుంది గతంలో ఆగిఉన్న పనులు తిరిగి ఆరంభమయ్యే అవకాశం ఉంది అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

తులా రాశి

ఈవారం మీరు నచ్చిన విధంగా ఉండేందుకు ప్రాముక్యతను ఇస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. బంధువులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు. మాతృసౌఖ్యంను పొందుతారు తల్లి లేదా తల్లివర్గం ద్వార లాభంను పొందుతారు. ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉండే అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి ఉత్తమం. సంచారం చేయుట వలన అలసి పోయే అవకాశం కలదు. ఆరోగ్యంను మాత్రం అశ్రద్ద చేయకండి. చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతాయి ముందుచూపు తప్పనిసరి. చక్కటి ప్రణాళికను కలిగి ఉండి ముందుకు వెళ్ళినచో మంచి ఫలితాలు పొందుతారు. గృహలాభంను పొందుతారు నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. విధ్యార్థులకు కొంత ఇబ్బంది తప్పక పోవచ్చును ఓపిక అవసరం, ప్రయత్నం పెంచుట ఉత్తమం. ఉద్యోగులకు శ్రమతప్పక పోవచ్చును అయినను కుటుంబసభ్యుల సహాకారం తప్పకుంటుంది. వ్యాపారవేత్తలకు నూతన విషయాల పట్ల అవగాహన పెంచుకోండి, వ్యాపారపరంగా నష్టంను పొందుతారు కావున జాగ్రత్త అవసరం. కళారంగంలో ఉన్నవారికి తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలి. మాట ఇచ్చునపుడు నిదానం అవసరం.

వృశ్చిక రాశి
ఈవారం మీరు బంధుమిత్రులతో కలిసి నూతన పనులను చేపడుతారు, సమయాన్ని వారితో సంతోషంగా గడిపే ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచిఫలితాలు కలుగుతాయి. బందుగృహంలో భోజనసౌఖ్యంను పొందుతారు. ప్రయత్నకార్యములలో ఒక అడుగుముందుకు వేస్తారు లాభంను పొందుతారు.  ఉద్యోగంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనులను చేపట్టుట మంచిది. కోపంను తగ్గించుకొనుట వలన మేలు జరుగుతుంది. ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం ఉంది జీవితభాగస్వామితో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో బాగాఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విధ్యార్థులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి, సమయపాలన పాటించుట అనేది సూచన. ఉన్నతవిధ్యను అభ్యసించే వారికి గట్టి ప్రయత్నం ద్వారా మేలుజరుగుతుంది. ఉద్యోగులకు ఫలితాలలో అసంతృప్తి ఉంటుంది వేచిచూసే దోరణి మేలుచేస్తుంది. వ్యాపారవేత్తలకు ఆశించిన లాభాలు కలుగుటకు అవకాశం ఉంది. చిన్న ప్రయత్నాలలో విజయం ఉంటుంది. కళారంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు పొందుతారు, ప్రణాళిక ఉన్నచో అభివృద్దిని పొందుతారు.

ధనస్సు రాశి
ఈవారం మీరు పెద్దల సూచనలు పాటించే ప్రయత్నం చేయుట మంచిది. గతంలో చేపట్టిన పనులకు ప్రాముఖ్యతను ఇవ్వడం తప్పక మేలుచేస్తుంది. నచ్చిన పనులను చేపట్టాలనే తలంపును కలిగి ఉంటారు. నూతన పరిచయాలు కలుగుతాయి వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. అధికమైన ఖర్చులు పొందుటకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు తప్పక పోవచ్చును. కుటుంబంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే వివాదములు  పొందుఅవకాశం ఉంది. చేపట్టు ప్రతిపనిని జాగ్రత్తగా చేయట అలాగే ఫలితాలను ఆశించక పోవడం అనేది సూచన. విధ్యార్థులకు ఆశించిన ఫలితాలు కలుగుతాయి కాకపోతే అధికమైన శ్రమ తప్పకపోవచ్చును. ఉన్నతవిద్యను అభ్యసించే వారు పెద్దల సూచనలు పాటించుట మంచిది,నూతన ప్రయత్నాలు మొదలు పెట్టు అవకాశం ఉంది. ఉద్యోగులకు రాజకీయపరమైన విషయాల పట్ల మక్కువ కలుగుటకు అవకాశం ఉంది, నూతన పనులను చేపడుతారు. వ్యాపారవేత్తలకు క్రయవిక్రయాల వలన లాభంను పొందుతారు, నూతన పనులను ఆరంభించే అవకాశం ఉంది. కళారంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు కలుగుతాయి, సంతోషాన్ని కలిగించే వార్తను వినే ఆస్కారం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది.

మకర రాశి
ఈవారం మీరు తలపెట్టిన పనులలో శ్రమను పొందుతారు, సమయానికి భోజనం చేయుట సూచన. నలుగురిలో మంచిపేరును తెచ్చుకొనే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. కాకపోతే ఆరోగ్యంనకు ఖర్చు కలుగుతుంది. మోకాళ్ళనొప్పులు పెరుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. పనులకు సంభందించిన విషయాల్లో బంధువులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం ఉంది. అకారణంగా వివాదములు కలుగుటకు ఆస్కారం కలదు ముఖ్యంగా మీఅప్తుల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించుట ఉత్తమం. విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది. ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తప్పకపొవచ్చును. విధ్యార్థులకు ఓపిక అవసరం, శ్రద్ధను కలిగి ఉన్నచో ఫలితాలు ఓమాదిరిగా వచ్చుటకు అవకాశం ఉంది, ఉన్నత విద్యను అభ్యసించే వారికి నూతన అవాకాశాలు కలుగుతాయి వాటిని సాధించే దిశగా అడుగులు ముందుకు వేయండి మంచిది. ఉద్యోగులకు బాగుంటుంది కాకపోతే ఆర్థికపరమైన విషయాల్లో అనుకున్న దానికన్నా అధికమైన ఖర్చులు కలుగుతాయి. వ్యాపారవేత్తలకు నిరాశ ఎదురవుతుంది ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. శ్రమ పెరుగుటకు ఆస్కారం ఉంది. కళారంగంలో ఉన్నవారికి బాగుండకపోవచ్చును కావున వేచిచూసే దోరణి మేలుచేస్తుంది.


కుంభ రాశి
ఈవారం మీరు కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుతారు, సంతోషంను పొందు అవకాశం కలదు. ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు పొందుసూచనలు కలవు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. తోటివారికి సేవచేయాలనే తలంపును కలిగి ఉంటారు. నూతన అవకాశాల కోసం ప్రయత్నం చేస్తారు. గతంలో చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేసేప్రయత్నం చేయండి అలాగే చక్కటి ప్రణాలిక అవసరం. అధికమైన పనిఒత్తిడిని కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయుట వలన అలసి పోయే అవకాశం ఉంది. వినోదాలలో ఊహించని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. విధ్యార్థులకు ఆశించని ఫలితాలు పొందుతారు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది, ఉన్నతవిధ్యను అభ్యసించే వారికి బాగుంటుంది నూతన అవాకాశాలు పొందుతారు. ఉద్యోగులకు చక్కటి గుర్తింపు వస్తుంది కాకపోతే ముందు చూపు అవసరం, చాలావరకు తీసుకొనే నిర్ణయాలను వాయిదా వేయుట మంచిది. వ్యాపారవేత్తలకు బాగానే ఉంటుంది శ్రమను పొందుట చేత లాభంను పొందుతారు. కళారంగంలో ఉన్నవారికి పెద్దల అనుగ్రహం లభిస్తుంది, అలాగే నూతన అవకాశాలు పొందుతారు.

మీన రాశి
ఈవారం మీరు అధికారులకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందు సూచనలు కలవు. మధుర పదార్థముల యందు ఆసక్తిని కనబరుస్తారు. ఒకవార్త కొంత భాదను కలిగించినను ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. మిత్రులతో కలిసి కొత్త కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఉంది. ప్రయత్నాలు అనుకూలిస్తాయి నిదానంగా ముందుకు వెళ్ళండి. స్థిరమైన ఆలోచనలు చేయుట మంచిది. పనిభారం మాత్రం తప్పక పోవచ్చును. విధ్యార్థులకు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉన్నత విధ్యనుఅభ్యసించే వారు ప్రణాళికతో ముందుకు వెళ్ళుట వలన లాభంను పొందుతారు. అనుభవజ్ఞుల సూచనలు పాటించుట ఉత్తమం. ఉద్యోగులకు అధికారులతో గుర్తింపును పొందుతారు, ప్రయాణాలు చేయవలసి రావొచ్చును. వ్యాపారవేత్తలకు అనుకూలమైన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన పనులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు కాకపోతే ఫలితాలు కొంత నిదానంగా పొందు సూచనలు కలవు. కళారంగంలో ఉన్నవారికి బాగాశ్రమను పొందితే గాని అనుకూలమైన ఫలితాలు రాకపోవచ్చును. చిన్న చిన్న విషయాలకు భాదపడటం మంచిది కాదు అనితెలుసుకొనే ఆస్కారం ఉంది.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Identification