Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Manam is estimated on the rich

ఈ సంచికలో >> సినిమా >>

వేసవిలో చల్లగా రాంచరణ్‌

Cool in summer ramcharan

వేసవి కాలంలో కొన్ని సినిమాలు ‘స్పెషల్‌’గా రిలీజ్‌ అవుతాయి. అదే సమయంలో కొత్త సినిమా షూటింగ్‌ల సందడి కూడా ఉంటుంది. కానీ ప్రారంభోత్సవాలు ఇండియాలో, షూటింగ్‌లు విదేశాల్లో జరుగుతాయి. కారణం సింపుల్‌. ఇక్కడి సమ్మర్‌ని తట్టుకోలేక నటీనటులు, దర్శక నిర్మాతలూ అందరూ చల్ల చల్లటి వాతావరణాన్ని వెతుక్కోవాలనుకోవడమే.

స్వామి కార్యం, స్వకార్యం ఒకేసారి అన్నట్టుగా విదేశాల్లో సినిమా షూటింగ్‌ సమ్మర్‌లో పెట్టుకుంటే అక్కడి చల్లదనాన్ని ఎంజాయ్‌ చేస్తూనే, సినిమా షూటింగ్‌ పూర్తి చేసెయ్యొచ్చు. కృష్ణవంశీ డైరెక్షన్‌లో, రామ్‌చరణ్‌ హీరోగా రూపొందనున్న సినిమా షూటింగ్‌ కూడా విదేశాల్లోనే, సమ్మర్‌ సీజన్‌లోనే జరగనుంది.

స్కాట్‌లాండ్‌, ప్యారిస్‌, లండన్‌ వంటి చోట్ల షూటింగ్‌కి చిత్ర యూనిట్‌ ఏర్పాట్లు చేసింది. చిరంజీవితో ప్రతిష్టాత్మకంగా ‘వందేమాతరం’ సినిమా చేయాలనుకుని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కృష్ణవంశీ, చిరంజీవి కుమారుడు చరణ్‌తో చేస్తోన్న సినిమా ఇది. మాస్‌ టచ్‌ ఉంటుందో లేదోగానీ, కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమాని కృష్ణవంశీ తెరకెక్కిస్తున్నాడట. అలా చూస్తే చరణ్‌కి ఇది కొత్త తరహా సినిమా అనే చెప్పవచ్చు.

 

మరిన్ని సినిమా కబుర్లు
tollywood ki em kadu