Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇక ఆ సినిమాలు రానట్టే

ika aa cinimaalu raanatte

కప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ కోసం ప్రత్యేకంగా సినిమాలొచ్చేవి. జగపతిబాబు, వెంకటేష్‌ అలా సినిమాల్ని ఎక్కువగా చేసేవారు. ఇప్పుడు సినీ ప్రేక్షకుల మైండ్‌ సెట్‌లో మార్పు వచ్చింది. దాంతో పెద్ద హీరోలు ‘పవిత్రబంధం’ వంటి సినిమాలు చేయడానికి ఇష్టపడటంలేదు. ఒకవేళ ఎప్పుడో ఒకప్పుడు వచ్చినా, వాటి పట్ల ప్రేక్షకులు ఆసక్తి చూపడంలేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలో ఎంతుంది? అనే చూస్తున్నారు సినీ ప్రేక్షకులు.

సెంటిమెంట్‌ ఎక్కువగా వుండే ఫ్యామిలీ సినిమాలు ఆడకపోవడానికి ఇంకో కారణం కూడా వుంది. అదే టెలివిజన్‌. టెలివిజన్‌లో వస్తోన్న సీరియల్స్‌తోనే సెంటిమెంట్‌ని అభిమానించే ప్రేక్షకులకు కాలక్షేపం అయిపోతోంది. వారు సినిమా థియేటర్లకు వచ్చి సెంటిమెంట్‌ ఫీలవ్వాలని అనుకోవడంలేదు.

కొత్తగా వచ్చే దర్శకులు కూడా సెంటిమెంట్‌ అన్న అంశాన్ని తగ్గించి, సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌ పట్ల దృష్టి పెడుతున్నారు. నిర్మాతలూ అవే కోరుకుంటున్నారు. దాంతో సెంటిమెంట్‌ సినిమాల్ని నమ్ముకున్న హీరోలు, వేరే జోనర్‌లోకి మారాల్సి వస్తోంది. అలా సెంటిమెంట్‌ నేపథ్యంలో ఇకపై సినిమాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది.

మరిన్ని సినిమా కబుర్లు
March 28, Legend `Rowdy