Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
March 28, Legend `Rowdy

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగు సినీ కార్మికులుగా మార్పు

Labor of Telugu cinema

ఆంధ్రప్రదేశ్‌ విభజనతో సినీ పరిశ్రమకు ఇబ్బందులొస్తాయేమో అనే ఆందోళన సినీ వర్గాల్లో ఉంది. ఇదివరకు సినిమా షూటింగులపై దాడులు జరగడం, సినిమా నటులు ఎక్కడికి వెళ్ళినా తెలంగాణకు మద్దతు పలకమనో, సమైక్యాంధ్రప్రదేశ్‌కి మద్దతు పలకమనో డిమాండు చేసేవారు. ఆ వివాదం లేకుండా, రాష్ట్ర విభజన జరిగిపోయింది.

కాని ఇప్పుడు ఇంకో చిచ్చు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ` తెలంగాణగా విడిపోయిన తరువాత, ఏపీ సినీ నిర్మాతల సంఘం అనో, లేదంటే ఏపీ సినీ దర్శకుల సంఘం అనో పెడితే ఇబ్బందులొస్తాయి. అందుకనే ఇబ్బంది లేకుండా తెలుగు సినీ కార్మికుల సంఘం, అని తెలుగు సినీ దర్శకుల సంఘం అని పేర్లు మార్చుకుంటున్నారు.

కొన్ని సంఘాల తాలూకు పేర్లలో ‘తెలుగు’ అని ఇదివరకే ఉండగా, లేనివాటికి, ఆంధ్రప్రదేశ్‌ అని పేరు ఉన్నవాటికి ‘తెలుగు’ అని పేరు పెడుతున్నారు. వివాద రహితంగా తెలుగు సినీ పరిశ్రమ ఉండాలన్న ఆలోచనతో ఇలా చేయడం మంచిదే. సినీ పరిశ్రమకు ప్రాంతీయ సెగ తగలడం మంచిది కాదు గనుక ప్రాంతాలకు అతీతంగా సినిమా పరిశ్రమలో అందరూ కలిసి మెలిసి ఉండడానికి చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం.

మరిన్ని సినిమా కబుర్లు
Film and TV