Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Film and TV

ఈ సంచికలో >> సినిమా >>

‘నలదమయంతి’ భారీతనం

Nala Damayanthi

‘నలదమయంతి’ పేరుతో ఓ సినిమా నిర్మితమవుతోంది తెలుగులో. రవికుమార్‌ పనస ఈ చిత్రానికి నిర్మాత. సినిమా కథ నచ్చి నారా రోహిత్‌ ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించేందుకు ముందుకొచ్చారు. చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ సినిమాకి భారీ తనం వచ్చేలా నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు వినికిడి.

‘ప్రతినిథి’ వంటి సినిమాల్లో నటించిన శ్రీవిష్ణు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్‌గా పేరున్న నటిని తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారట దర్శక నిర్మాతలు. అలనాటి ‘నలదమయంతి’ కథతో ఈ సినిమాకి కొన్ని పోలికలున్నాయని అంటున్నారు. భారీ స్థాయిలో సినిమా నిర్మాణానికి నిర్మాత ఏర్పాట్లు చేశారు.

కేరళలో భారీ సెట్స్‌ వేసి సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కిస్తారట. కథ మీద ఉన్న నమ్మకంతో ఖర్చుకు వెరవకుండా సినిమా రూపొందించాలనే నిర్మాతల ప్రయత్నం విజయవంతమవ్వాలని ఆశిద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Murugadoss